Ammayi garu Serial Today Episode దీపక్ హారతి దగ్గరకు వెళ్తాడు. హారతి తాను ప్రెగ్నెంట్ అని నువ్వు తండ్రివి కాబోతున్నావని దీపక్‌తో చెప్తుంది. దీపక్ షాక్ అయిపోతాడు. ఈ విషయం తన తల్లితో పాటు ఇంట్లో అందరికీ తెలిస్తే తన పని అయిపోతుందని దీపక్ బిత్తరపోతాడు. హారతి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది.
హారతి: ఇంత కాలం ఈ హారతి ఒంటరిగా ఉన్నా పర్లేదు కానీ ఇప్పుడు నువ్వు నాతో ఉండాల్సిందే. ఏంటి దీపక్ ఏం మాట్లాడవు.
దీపక్: నేను చేసిన ఘనకార్యానికి నోట మాట రావడం లేదు కాళ్లు చేతులు ఆడటం లేదు. మనసులో నాకు తెలీకుండానే
ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నాను. ముందు హారతిని హాస్పిటల్‌కి తీసుకెళ్లి అక్కడ రాఘవని లేపేయాలి. ఆ తర్వాత హారతిని ఏం చేయాలో ఆలోచించాలి. అంత వరకు హారతి మేటర్ బయటకు రాకుండా చేయాలి.
విశాలాక్షి హాస్పిటల్లోనే ఉంటుంది. భర్త మాటలు తలచుకొని బాధ పడుతుంది. ఇంతలో రాజు అక్కడికి వచ్చి రాఘవని చూస్తాడు. డాక్టర్స్ ఏమైనా చెప్పారా అని అడుగుతాడు. కోమాలో ఉన్న మనిషి కోసం డాక్టర్లు ఏం చెప్తారని విరూపాక్షి అంటుంది. ఇక రాజు అమ్మాయి గారు తనకు దూరమయ్యేలా ఉన్నారని ఇప్పుడు ఏం చేస్తుంటారా అని ఆలోచిస్తాడు. విరూపాక్షి దేవుడి దగ్గరకు వెళ్లి దండం పెట్టుకుంటుంది. తప్పు చేయని తనని ఎందుకు శిక్షిస్తున్నావని పిల్లలను ఎందుకు శిక్షిస్తున్నావని అంటుంది. సూర్యని తనని దగ్గర చేయాలని పిల్లలు ప్రయత్నించి వాళ్లు ఒకరికి ఒకరు దూరం అవుతున్నారని పిల్లల కోసమైనా రాఘవని బతికించమని వేడుకుంటుంది.
మరోవైపు రూప రాజు, తల్లిని చూడాలని ఉందని అనుకుంటుంది. ఇక పనామె రావడంతో తనకి హాస్పిటల్‌కి వెళ్లాలని ఉందని ఆమెని తోడు పిలుస్తుంది. సూర్య ప్రతాప్ రూపతో ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగితే రూప కంగారుగా అమ్మ దగ్గరకు అనేస్తుంది. దాంతో సూర్య ప్రతాప్ రూప మీద కోప్పడతాడు. దాంతో పనామె మందారం అమ్మ అంటే అమ్మవారు అని కవర్ చేస్తుంది. దాంతో సూర్య ప్రతాప్ వెళ్లనిస్తాడు.
మరోవైపు జీవన్ పేపర్ చూస్తుంటాడు. అక్రమ కట్టాడాలపై సీఎం కొరడా అన్న వార్త విని నవ్వుకుంటాడు. చెల్లి శ్వేతని పిలిచి నీ పెళ్లికి రాజు ఒప్పుకోవడం లేదు కదా ఇప్పుడు అదే రాజు పెళ్లికి ఒప్పుకునేలా చేస్తా అని అంటాడు. ఎలా అని శ్వేత అంటే సీఎం చేస్తున్న అక్రమ ఆస్తుల కట్టడాల్లో రాజుకి సంబంధించి ఆర్ఆర్ కంపెనీ ఉండేలా చేస్తే అప్పుడు రాజుకి ఇక ఏ ఆధారం ఉండకపోవడం ముత్యాలు సూర్యప్రతాప్ మీద విరుచుకుపడుతుందని అప్పుడు వేరే దారిలేక నువ్వు తప్ప వేరే దిక్కలేక నిన్నే పెళ్లి చేసుకుంటాడని అంటాడు. దానికి శ్వేత అందులో మనకు షేర్ ఉందని అంటే అది మనకే లాభమని మన మీద అనుమానం రాదని అంటాడు.
రూప హాస్పిటల్‌కి వచ్చి తల్లిని కలుస్తుంది. రాఘవకి ఏం కాదని రాఘవ లేవగానే మన జీవితాలు మారుతాయని రాజు రూపతో చెప్తాడు. వీటన్నింటికి విజయాంబికే కారణం అని రూప రాజుతో చెప్తుంది. అత్తయ్యని ఎదుర్కొనే విధానం ఇది కాదని అంటుంది. విజయాంబికని ఎదుర్కొవడం కష్టమని విరూపాక్షి అంటుంది. ఇక రూప అత్తయ్య తన దగ్గర చేసిన ఛాలెంజ్ గురించి చెప్తుంది. రాఘవ లేచి నిజం చెప్పినా దాన్ని కూడా విజయాంబిక తనకు అనుకూలంగా మార్చేస్తుందని అంటుంది.
మరోవైపు సీఎం సూర్య ప్రతాప్ అక్రమ కట్టడాలు ఎవరివైనా కూల్చేమని ఆదేశాలు ఇచ్చామని ఆల్రెడీ కూల్చేస్తున్నారని మీడియాతో చెప్తాడు. సూర్య ప్రతాప్ మాటల్ని శ్వేత, జీవన్ వింటారు. ఇంతలో మీడియా వ్యక్తి మీ అల్లుడికి సంబంధించిన ఆర్ ఆర్ కంపెనీ ఉందని అది ఎందుకు కూల్చడం లేదని అడుగుతారు. దాంతో సూర్య ప్రతాప్ ఆఫీసర్లకు ఆ విషయం అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.