Jagadhatri  Serial Today Episode:  సీఈవోను నన్ను చేసినప్పుడు మధ్యలో ధాత్రి ఎందుకు ఆఫీసుకు అంటూ నిషిక ప్రశ్నించడంతో వైజయంతి అమ్మీ కౌషికి తగ్గింది కదా అని ఇంకా తొక్కాలని చూడకు తాట తీస్తుంది. అయినా ఇప్పుడు మనం బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ముందు మంచి మార్కులు కొట్టేయాలి కానీ ఇలా గొడవలు పెట్టుకోకూడదు అని చెప్తుంది. తర్వాత కేదార్‌ ఇంట్లో వాళ్లు అక్కకు చేస్తుంది దారుణం అంటాడు.


ధాత్రి: అవును కేదార్‌. కౌషికి వదిన కుర్చీలో నిషిక కూర్చుంటే.. కమలాకర్‌ మామయ్యా, యువరాజ్‌ అరాచకాలకు అడ్డే ఉండదు.


కేదార్‌: నిషిక ఆవేశంలో కంపెనీని నడపలేదు. సమస్య వచ్చిన ప్రతిసారి సమాధానం కోసం కాకుండా గొడవ పడుతుంది.


ధాత్రి: మనం నిషిక సీఈవో అవ్వకుండా ఆపాలనుకున్నట్లే వాళ్లు కూడా మనల్ని ఆపాలని ప్లాన్‌ చేస్తారు. మనల్ని భయపెట్టొచ్చు. బెదిరించొచ్చు. అసలు ఆ కంపెనీలోకి రాకుండా చేయాలని చూస్తారు. అందరూ మూకుమ్మడిగా మనల్ని అన్ని వైపులా దాడి చేస్తారు. వదినను కంపెనీని మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటాం.



 అని చెప్తుంది ధాత్రి. మరోవైపు మీనన్‌ దొంగ నోట్లను మార్కెట్లకు పంపించేందుకు ప్యాక్‌ చేయిస్తుంటాడు. అభి ఇవి ఎవరిక పంపిస్తున్నారు అని అడుగుతాడు. తన ప్లాన్‌ మొత్తం అభికి చెప్తాడు మీనన్‌. ప్యాకింగ అయిపోయాక మీనన్‌, యువరాజ్‌ కు ఫోన్‌ చేసి ఫేక్‌ కరెన్సీ వస్తుందని ఈ డీల్‌ మనకు చాలా ఇంపార్టెంట్‌ అని చెప్తాడు. మొత్తం నేను చూసుకుంటాను భాయ్‌ అంటాడు యువరాజ్‌. బయటకు వెళ్లిన అభి మీనన్‌ పంపించే దొంగ నోట్లను వ్యవహారాని ఫోన్‌ చేసి సాధుకు చెప్తాడు. సాధు ధాత్రికి ఫోన్‌ చేసి ఫేక్‌ కరెన్సీ గురించి చెప్పి పట్టుకోమని చెప్తాడు. సరేనని ధాత్రి, కేదార్‌ వెళ్తారు. వెహికిల్స్‌ అన్ని చెక్‌ చేస్తుంటారు. మరోవైపు యువరాజ్‌ తన అనుచరుడితో వెళ్తుంటాడు.


అనుచరుడు: అన్న సిటీ మొత్తం చెక్‌ పోస్టులు పెట్టారట. మనం సిటీ లోపలికి వెళ్లాలంటే కచ్చితంగా ఎదో ఒక చెక్‌ పోస్టు దాటి వెళ్లాలి అన్న. అయినా నువ్వెందుకు అన్న జేడీ ఉందని తెలిసినా ఇదే రూట్లో వెళ్తున్నావు.


యువరాజ్‌: జేడీ మీద గెలవడానికిరా.. నాలుగుసార్లు గెలవగానే తనను ఓడించేవారు ఎవరూ లేరనుకుంటుంది. ఎదురు నిలబడేవారు లేరనుకుంటుంది. అందుకే అందరూ మర్చిపోయినా ఈ యువరాజ్‌ అంటే ఏంటో చూపించడానికి జేడీకి ఎదురు వెళ్తున్నాను. మాటేసి కాపు కాస్తున్న జేడీ కళ్ల ముందే నేను రాజులా నకిలీ డబ్బును తీసుకెళ్తాను.


అనుచరుడు: నాకెందుకో భయంగా ఉందన్నా.. జేడీకి అనుమానం వచ్చి దొరికిపోతే ఇక జీవితాంతం జైలులో ఉండాలి.


యువరాజ్‌: అనుమానమా? ఎలా వస్తుంది. బోజ్జ గణపయ్యా బొజ్జలో బూరలు ఉంటాయి కానీ నోట్ల కట్టలు ఉంటాయని ఎవరు అనుమానిస్తారు. ఒకవేళ అనుమానం వచ్చినా దేవుడి విగ్రమం మీద చెయ్యి వేసే ధైర్యం ఎవ్వరికీ ఉండదు.


 అంటూ యువరాజ్‌ తాను ఫేక్‌ కరెన్సీని నిమజ్జనానికి తీసుకెళ్తున్న వినాయకుడి బొజ్జలో తీసుకెళ్తున్నట్టు చెప్తాడు. ఇంతలో జేడీ చెక్ చేస్తున్న దగ్గరికి గణపతి విగ్రహం ఉన్న వాహనం వెళ్తుంది. అందులోంచి ఇద్దరు రౌడీలు స్వామీజీల వేషం వేసుకుని వెళ్తారు. వాళ్లను పట్టుకున్న ధాత్రి, కేదార్‌ పట్టుకుంటారు. మరో వ్యక్తిని యువరాజ్‌ పంపిస్తాడు. వాడిని ధాత్రి, కేదార్‌ పట్టుకుంటారు. వాడి స్కూటీ చెక్‌ చేస్తుంటే గణపతి దగ్గర ఉన్న వాళ్లకు మీరు వెళ్లి పంపించమని లొల్లి చేయండి అని చెప్తాడు. వాళ్లందరూ లొల్లి చేస్తుంటే చెక్‌ చేసి పంపిస్తానని చెప్తుంది జేడీ. స్కూటీలో డబ్బులు దొరకడంతో ధాత్రి, కేదార్‌ గణపతి విగ్రహాన్ని వదిలేస్తారు. యువరాజ్‌, మీనన్‌కు ఫోన్‌ చేసి జేడీ కళ్ల ముందు నుంచి డబ్బు తీసుకొస్తున్నా కనిపెట్టలేకపోయింది భాయ్‌ అని చెప్తాడు. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ఇంట్లో బల్లులతో విసిగిపోయారా? ఇలా చేయండి బల్లులన్నీ పరార్