Jagadhatri  Serial Today Episode:  ఐసీయూలో ఉన్న వైజయంతి, నిషిక, ధాత్రి, కేదార్‌ లను డాక్టర్‌ బయటకు వెళ్లమని చెప్తుంది. అయితే వైజయంతి, నిషిక బయటకు వెళ్తారు. వీళ్లు రాలేదేంటి అని చూస్తారు. లోపల సంతాపసభ పెట్టుకున్నారేమో అని వెటకారంగా నవ్వుకుని ముందు ఈ విషయం కమలాకర్‌, కాచిలకు చెప్పాలని అక్కడి నుంచి వెళ్లిపోతారు. లోపల బెడ్‌ మీద ఉన్న కౌషిక మన బిడ్డ బతికే ఉందని సురేష్‌ కు  చెప్తుంది.

  సురేస్‌, ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అసలేం జరిగిందని సురేష్‌ అడగ్గానే జరిగింది ధాత్రి చెప్తుంది. తాము డాక్టర్‌ తో కలిసి ఆడిన నాటకాన్ని సురేష్‌ కు చెప్తారు.



కౌషికి: కంచెలా కాపలా కాయాల్సిన వాళ్లే కసాయి వాళ్లలా  కాటేయాలని చూశారా? నా రక్తమే నా బిడ్డన చంపాలని ప్రయత్నించిందా? ఇదే నిజమైతే ఈ నిజాన్ని నేను ఎప్పటికీ నమ్మలేనేమో జగధాత్రి. ఇది ఎప్పటికీ నిజం అవ్వకూడదని కోరుకుంటున్నాను.  


ధాత్రి: మీ నమ్మకమే నిజం అవ్వోచ్చేమో వదిన. మా అనుమానం కూడా అబద్దం అయ్యుండొచ్చు. తప్పు ఎక్కడ జరిగిందో అసలు తప్పు ఎవరు చేశారో..? ఈ దుర్బిద్ది ఎవరిదో తెలిసేంత వరకు మీ కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవాలి.


కేదార్‌: ఏ రూపంలో వస్తుందో కూడా తెలియని ప్రమాదం నుంచి తప్పించుకోవడం కష్టం అక్కా.. అందుకే కొన్ని రోజులు ఈ నాటకం.  


సురేష్‌:  కౌషికి పరిస్థితులు చక్కబడతాయి. నమ్మకం ఉంచు కౌషికి.


కౌషికి: కేదార్‌ నిన్ను వద్దన్నా.. కాదన్నా.. చీ అన్నా.. పొమ్మన్నా.. అయినా ఇవాళ నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు.  నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు.


కేదార్‌: మనం ఒక్క ఫ్యామిలీ అక్కా.. నీకోసం ప్రాణాలకు తెగించి ఏంటి? నా ప్రాణం ఇచ్చైనా కాపాడుకుంటాను. నాకు తోడ బుట్టి ఉండకపోవచ్చు కానీ నీకు తోడుగా నీకు రక్షణగా ఎప్పటికీ ఈ తమ్ముడు ఉంటాడు అక్కా..


అన చెప్పి కౌషికిని తీసుకుని ఇంటికి వస్తారు. ధాత్రి లోపలికి వెళ్లి హారతి తీసుకొచ్చి కౌషికికి దిష్టి తీస్తుంది. కౌషికిని చూసి సుధాకర్‌ బాధపడతాడు. నిన్ను ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలియడం లేదు అంటాడు. అందరూ లోపలికి వెళ్తారు. దీంతో నిషిక మనం హ్యాండ్‌ బ్రేక్‌ తీసింది తెలిసిందా? ఏంటి అని కాచికి చెప్తుంటే ఇంతలో సుధాకర్‌ అక్కడికి వచ్చి ఏమన్నావు అంటూ అడగడంతో వైజయంతి, నిషిక షాక్‌ అవుతారు. దీంతో వైజయంతి మాట మార్చి ఏదో చెప్తుంది. దీంతో సుధాకర్‌ వెళ్లిపోతాడు. తర్వాత కౌషికి ధాత్రి, కేదార్‌ లకు ఫోన్‌ చేసి తన రూంలోకి రమ్మని చెప్తుంది.


ధాత్రి: ఏంటి వదిన ఇదంతా..?


కౌషికి: నా ఇద్దరి తమ్ముళ్లకు రాఖీలు కట్టాలని రాఖీలు తీసుకొచ్చాను. కానీ ఆరోజు నేను ఉన్న పరిస్థితికి కట్టలేకపోయాను. రాఖీ పౌర్ణమి వెళ్లాక కట్టడం వల్ల ఉపయోగం లేదని కట్టలేదు. కానీ ఇవాళ్టీ కి మించిన మంచి రోజు లేదనిపించింది. అందుకే కడదామనుకుంటున్నాను.


కేదార్‌: చాలు అక్కా ఇంతకంటే నాకేమీ వద్దు. అమ్మ తర్వాత నాకు దొరికిన రక్త సంబంధం నువ్వే అక్కా. ఈ చేయి చివరి దాకా వదిలిపెట్టను.


 అనగానే కౌషికి రాఖీ తీసుకొచ్చి కేదార్‌ చేతికి కడుతుంది. తర్వాత కేదార్‌, ధాత్రి, కౌషికి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత కొద్ది రోజులు ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండాలని ధాత్రి చెప్తుంది. తర్వాత కౌషికి గదిలోంచి బయటకు వచ్చిన ధాత్రి, కేదార్‌ లను చూసి నిషిక కిందకు వచ్చి కేదార్‌ చేయి చూపించమని అడుగుతుంది. కేదార్‌ చేయి చూపించగానే రాఖీ ఎవరు కట్టారని అడుగుతారు. ఇంతలో అందరూ ఎవరు కట్టారో చెప్పమని అడుగుతారు. యువరాజ్ వచ్చి కేదార్‌ కు వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో యువరాజ్‌ కు ధాత్రి వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!