Jagadhatri  Serial Today Episode: విగ్రహం వెనకనుంచి జేడీ, కేడీ వస్తారు. వాళ్లను చూసిన మీనన్‌ షాక్‌ అవుతాడు. తర్వాత అందర్ని చంపేయాలని ఇవాళ ఇక్కడి నుంచి వెళ్లితే జేడీ ప్రాణాలు తీసుకునే  వెళ్తాను అంటాడు మీనన్‌. అలాగే భాయ్‌ అంటూ మీనన్‌ మనుషులు జేడీ, కేడీల మీదకు వెళ్తారు. జేడీ, కేడీ రౌడీలను కొడుతుంటారు. యువరాజ్‌ చాటు నుంచి వచ్చి చూస్తుంటాడు.


యువరాజ్: జేడీ ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది. అయిపోయింది ఈ డీల్‌ కూడా సర్వనాశనం అయిపోయింది.  


మీనన్‌: ఒరేయ్‌ గన్‌ ఇవ్వరా.. గన్‌ ఇవ్వరా.. నీకేంట్రా స్పెషల్‌ గా చెప్పాలా..? వెళ్లి వాళ్లను కొట్టు..


 అని వెళ్లి మీనన్‌ జేడీకి గన్‌ ఎయిమ్‌ చేస్తాడు. జేడీ తప్పించుకోవాలని చూస్తుంది. కానీ మీనన్‌ జేడీని కింద పడేసి మోకాళ్ల మీద కూర్చోబెడతాడు.


మీనన్‌: జేడీ మీ వాళ్లందర్ని నీల్‌ డౌన్‌ చేయమని చెప్పు.


యువరాజ్: భాయ్‌ జేడీని పట్టేసుకున్నాడు.


మీనన్‌: రేయ్‌ అరవకుండా వచ్చి అందరూ నీల్‌ డౌన్‌ చేయండి.


ధాత్రి: ఎవ్వరూ రాకండి. కిరణ్‌ రాకండి. వద్దు


మీనన్‌: రేయ్‌ వచ్చి కూర్చోండి.. దేవా ఆ ట్రాక్టర్‌ వెనక దాక్కున్నాడు కదా వాణ్ని ఇక్కడకు తీసుకురా..? ఎంత ధైర్యంరా నీకు నన్నే చేట్‌ చేస్తావా? తొక్కుతా నా కొడకా..? ఏంటి జేడీ నాలుగు డైలాగులు చెప్పి నలుగురు మనుషులను కొట్టడం అనుకుంటున్నావా? ఈ మీనన్‌ తో పెట్టుకోవడం అంటే ముందు డబ్బు సంగతి చూసి తర్వాత నీతో మాట్లాడతా..? దేవా వెళ్లి విగ్రహంలోంచి డబ్బులు బయటకు  తీయ్‌.


దేవా: ఓకే భాయ్‌..


మీనన్‌: ఇంత ఈజీగా దొరుకుతావనుకోలేదు భాయ్‌.


దేవా: భాయ్‌ అన్ని ఎలుకలు ఉన్నాయి భాయ్‌. మొత్తం ఎలుకలు కొరికేశాయి భాయ్‌.


 అని చెప్పగానే కంగారుగా మీనన్‌ విగ్రహం వైపు చూస్తుంటే మీనన్‌ చేతిలో గన్‌ లాక్కున్ని మీనన్‌ కు ఎయిమ్‌ చేస్తుంది.


ధాత్రి: కిడ్నాపులు, దొంగతనాలు, దోపిడీలు చట్టవిరుద్దమైన పనులు చేసినందుకు నిన్ను అరెస్ట్‌ చేస్తున్నాను మీనన్‌.


మీనన్‌: జేడీ తప్పు చేస్తున్నావు. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మీనన్‌ ను టచ్‌ చేసిన ఏ ఒక్కడూ బతికి ఉన్నట్టు  రికార్డ్స్‌ లో  లేదు.


దాత్రి: రికార్డ్స్‌ ను తిరిగి రాసే టైం వచ్చింది మీనన్‌. ప్రతిసారి నిన్ను పట్టుకోవాలని చూసిన వారి ప్రాణాలు తీయడమే విన్న ప్రజలు ఈసారి ఒక పోలీస్‌ ఆఫీసర్‌  నిన్ను అరెస్ట్‌ చేయడం గురించి నువ్వు చేసిన పాపాలకు అన్యాయాలకు పడిన శిక్ష గురించి మాట్లాడుకుంటారు.  


మీనన్‌: నా కాలర్‌ పట్టుకున్నందుకు నువ్వు జీవితాంతం బాధపడేలా చేస్తాను. మర్చిపోను జేడీ నువ్వు చేస్తున్న ఏ ఒక్కటి మర్చిపోను.


ధాత్రి: చూడు బాగా చూడు నిన్ను అరెస్ట్‌ చేస్తుంది. జేడీ ఐపీఎస్‌.


 అంటూ కాలర్‌ పట్టుకుని మీనన్‌ ను తీసుకుపోతుంది జేడీ. దూరం నుంచి చూస్తున్న యువరాజ్‌ షాక్‌ అవుతాడు. అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు. జైలులో ఉన్న మీనన్‌ దగ్గరకు  సాధు వస్తాడు.


సాధు: మీనన్‌


మీనన్‌: నేను నీతో మాట్లాడను. వెళ్లి జేడీని రమ్మని చెప్పు.


సాధు: ఇది నీ డెన్‌ కాదు నువ్వు ఆర్డర్స్‌ వేయడానికి నువ్వు చెప్పినట్టు మేము వినడానికి. మీనన్‌ మాట్లాడుతుంది నీతోనే చెప్పు. జేడీ వస్తే మాట్లాడటానికి ఏమీ ఉండదు మీనన్‌. నీ మంచికోసమే చెప్తున్నాను. నువ్వు నాతో మాట్లాడటమే నీకు సేఫ్‌.


 అని సాధు చెప్తుండగానే జేడీ వచ్చి మీనన్‌ను తన్ని ఇది నీ డెన్‌ అనుకుంటున్నావారా..? అంటూ సార్‌ అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు. నిన్ను చంపేసి ఇక్కడే పాతేస్తే కూడా నన్ను అడిగేవారే లేరిక్కడ అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. మర్యాదగా నీ బిజినెస్‌ డీటెయిల్స్‌ ఇచ్చి అప్రూవల్‌ గా మారిపో అంటాడు కేదార్‌. మీనన్‌ వినడు. కాసేపట్లో మీరే మర్యాదగా ఇక్కడి నుంచి పంపిచేస్తారు చూస్తూ ఉండండి అంటాడు మీనన్‌. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: లేబర్‌ ఆఫీసర్‌గా మారిన కనకం – రాజ్ కు వార్నింగ్‌ ఇచ్చిన సీతారామయ్య