Jagadhatri  Serial Today Episode: యువరాజ్‌ దగ్గరకు వెళ్లిన వైజయంతి ఇక మీ నాన్న దృష్టిలో చెడ్డవాడు అనిపించుకోవడం కన్నా ఇప్పటికైనా తేరుకుని ఏదో ఒకటి చేయమని చెప్తుంది. దీంతో సరే ఇప్పుడు నేను ఆడబోయే నాటకంలో మీరు సపోర్టింగ్‌ క్యారెక్టర్‌ గా అద్బుతంగా నటించాలని చెప్తాడు. దీంతో నిషిక, వైజయంతి సరే అంటూ ముగ్గురు కలిసి వెళ్తారు. మరోవైపు ధాత్రి కేదార్‌ ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు యువరాజ్‌ వెళ్లి మళ్లీ ఏదో నాటకం ఆడతారని చెప్తాడు. అలా ఏం జరగదని ధాత్రి చెప్తుంది. మరోవైపు యువరాజ్‌, వైజయంతి, నిషిక ముగ్గురు కలిసి సుధాకర్‌ దగ్గరకు వెళ్తారు.


యువరాజ్‌: దేవుడి దయవల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది నాన్నా. నాకు చాలా హ్యాపీగా ఉంది.


నిషిక: మామయ్య ఆరోగ్యం మీద వాళ్లు ఎందుకంత నిర్లక్ష్యం. మనం వజ్రపాటి సుధాకర్‌ అనే కదా చెప్పాము.. వి సుధాకర్‌ అని వాళ్లు ఎలా రాసుకంటారు.


వైజయంతి: అవును అబ్బోడా.. నాకు కూడా అనుమానం వస్తుంది.


సుధాకర్‌: అందులో అనుమానించాల్సింది ఏమంటుంది వైజయంతి. పొరపాటు జరిగిందని వాళ్లు సారీ కూడా చెప్పారు కదా..?


యువరాజ్‌: కానీ ఎవరో కావాలనే ఆ డాక్టర్‌ తో అలా చెప్పించారు అనిపిస్తుంది.


సుధాకర్‌: అవును యువరాజ్‌.. నువ్వు కూడా అలాగే చెప్పావు కదా? నువ్వంటే కిడ్నీలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పావు కానీ కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయని చెప్పించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది.


యువరాజ్‌: మీకు రెండు కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయి. అర్జెంట్‌ గా ఆఫరేషన్‌ చేయాలని చెప్పిస్తే వాడు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రావొచ్చు.. వాడు అలా చేయడం వల్లే కదా? మీరు వాణ్ని కొడుకు అని ఒప్పుకున్నారు. చాలా క్లియర్‌ గా ప్లాన్‌ చేశారు నాన్నా..


వైజయంతి: బో పిల్లలు చెప్తా ఉంటే నాకు కూడా అనుమానం వస్తుంది. ఈ నాటకంలో ఆ జగధాత్రి హస్తం ఉందేమో..?


 అంటూ ముగ్గురు కలిసి సుధాకర్‌ ను తమ మాటలతో రెచ్చగొడుతుంటే.. సుధాకర్‌ మాత్రం ధాత్రి అలా చేసి ఉండదు అంటాడు. దీంతో వైజయంతి ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్ చేస్తుంది. దీంతో సుధాకర్‌ మీ అనుమానం నిజమని తేలితే కనక వాళ్లను జీవితకాలం క్షమించను అంటాడు సుధాకర్‌. మరుసటి రోజు జగధాత్రి, సుధాకర్‌ కు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది.


సుధాకర్‌: అమ్మా జగధాత్రి కూర్చో అమ్మా నీతో మాట్లాడాలి. నీకు ఈ ఇంట్లో కానీ నా ఆస్థిలో కానీ వాటా ఏదైనా కావాలంటే నన్నే అడుగమ్మా..


ధాత్రి: మీ ఆస్థిలో నాకు వాటా ఎందుకు అవసరం మామయ్య గారు. అయినా మమ్మల్ని ఇంట్లో ఉండటానికి ఆశ్రయం కల్పించారు. అంతకు మించి మాకు ఈ ఆస్తిలో చిల్లిగవ్వ అవసరం లేదు. అయినా మీరు ఇలా ఎందుకు అడుగుతున్నారు.


సుధాకర్‌: ఇంతకాలం నువ్వు చాలా మంచిదానికి అని కల్మషం లేని దానివి అని నేను నమ్మేవాణ్ణి.


ధాత్రి: ఇప్పుడేమైంది మామయ్యాగారు.


సుధాకర్‌: నువ్వు కేదార్‌ కలిసి నన్ను పిచ్చివాణ్ని చేశారు కదమ్మా..


కేదార్‌: ఏమంటున్నారు నాన్నా.. అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.


  అనగానే సుధాకర్‌ మీరు నాకు కిడ్నీ ఆఫరేషన్‌ అని మీరు ఆస్థి కోసం నాటకం ఆడారని నాకు అనిపించింది. అదే నిజమైతే నా గుండె తట్టుకోలేదమ్మా..? అనడంతో ధాత్రి, కేదార్‌ బాధపడతారు. ఎమోషనల్‌ గా ఫీలవుతూ.. కేదార్‌ నువ్వడిగితే ప్రాణమైన ఇస్తానని చెప్తాడు కేదార్‌. ఇంతలో సత్యప్రసాద్‌ పెళ్లి కార్డులు తీసుకుని వస్తాడు. మొదటి శుభలేఖ సుధాకర్‌, వైజయంతిలకు ఇస్తాడు. సుధాకర్‌, వైజయంతిలు కూడా వాళ్ల కార్డు ప్రసాద్‌ కు ఇస్తారు. ఆ కార్డులో అన్న కేదార్‌, వదిన జగధాత్రి అని పేర్లు ఉండటంతో అందరూ షాక్‌ అవుతారు. యువరాజ్‌ వచ్చి ఆ పేర్లు ఎందుకు ప్రింట్ చేయించారని ప్రశ్నిస్తాడు. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!