Jagadhatri  Serial Today Episode:    యువరాజ్‌ వచ్చి నా కిడ్నీ నాన్నకు మ్యాచ్‌ అవదన్నారు కానీ కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా నాన్ను నేను చూసుకుంటాను అంటాడు. దీంతో అవసరం లేదని  ఆ దేవుడు నా రాత ఇంతే అని రాసిపెట్టాడు అంటాడు సుధాకర్.  దీంతో యువరాజ్‌ మీరు అలా మాట్లాడకండి నాన్నా అంటాడు. ఇంకెలా మాట్లాడమంటావురా..కన్నకొడుకు రక్తమే తండ్రికి  మ్యాచ్‌ అవనప్పుడు.. అంతకన్నా దౌర్బాగ్యం ఏముంటుదిరా అంటాడు. ఇంకెవరినైనా ట్రై చేద్దాం న్నాన్నా అంటాడు యువరాజ్‌. దీంతో కన్నకొడుకే కిడ్నీ ఇవ్వనప్పుడు ఇంకెవరు ఇస్తారురా అంటాడు సుధాకర్‌.  


కేదార్‌: సార్‌ మీకు అభ్యంతరం లేకపోతే ఆ కిడ్నీ నేను ఇస్తానండి.


నిషిక: ఇది మరీ బాగుంది కన్నకొడుకు కిడ్నీనే మ్యాచ్‌ అవనప్పుడు నీదెలా అవుతుందనుకుంటున్నావు.


కేదార్‌: దాందేవుంది. టెస్ట్‌ చేయించుకుంటాను మ్యాచ్‌ అవుతుంది అంటే ఇస్తాను.


నిషిక: నువ్వు అలా చేయడానికి జగధాత్రి ఒప్పుకోవాలి కదా?


ధాత్రి: ఒప్పుకోకపోవడానికి నా భర్త దొంగతనం చేయడం లేదు కదా? కిడ్నీ డొనేట్‌ చేస్తాను అంటున్నాడు. ఒకరి ప్రాణం నిలబెట్టడానికి ఎంతో ధైర్యం ఉంటే కానీ ముందడుగు వేయలేం. ఈయనతో ఏడడుగులు వేసినప్పుడే అనుకున్నాను. నాకేం అభ్యంతరం లేదు.


దీంతో ఎమోషనల్‌ అవుతున్న సుధాకర్‌.. బాధగా నిషిక, యువరాజ్‌ మాట్లాడుకున్న మాటలు గుర్తు చేసుకుంటాడు.


కౌషికి: చాలా బాగా చెప్పావు జగధాత్రి. మీ ఇద్దరిని చూస్తుంటే ఏ తల్లిదండ్రులకైనా నీ లాంటి కొడుకు ఉండాలనిపిస్తుంది. ఏ అత్తామామ్మలకైనా నీలాంటి కోడలు ఉండాలనిపిస్తుంది.


సుధాకర్‌: వద్దు కేదార్‌ మీ త్యాగం నేను భరించలేను.


కేదార్‌: ఇది త్యాగం కాదు నానా.. బాధ్యత. ఈ ప్రాణం పోసింది మీరే ఈ దేహం మీరిచ్చిందే.. మీరు నాకు రెండు కిడ్నీలు ఇచ్చారు. అందుకు నేను మీకు ఒక కిడ్నీ ఇవ్వలేనా..? కిడ్నీ ఇవ్వడం వల్ల మీరు నాకు రుణపడి పోతాను అనుకుంటే వచ్చే జన్మలోనైనా మీరు నాకు నాన్నగా పుట్టాలి. డాక్టర్‌ ఈయనకు నేను కిడ్నీ ఇస్తాను.


డాక్టర్‌: ఆయనకు మీరేం అవుతారు. రక్తసంబందీకులేనా..?


కేదార్‌: ఆయన్ని చూస్తూ ఉంటే మా నాన్న గుర్తుకొస్తారు. ఆయన్ని చూసిన ప్రతిసారి మా నాన్నే గుర్తుకు వస్తారు. నా కిడ్నీ ఆయనకు సెట్‌ అయితే ఈరోజు నుంచి మా ఇద్దరిది కూడా రక్తసంబంధం అవుతుంది కాబట్టి.. కొడుకుని అని రాసుకోండి.


డాక్టర్‌: ఓకే మీరు వెళ్లి అక్కడ అప్లికేషన్‌ పిలప్‌ చేసి శాంపిల్‌ ఇవ్వండి. రిపోర్ట్‌ కోసం రేపు రండి.


 అని డాక్టర్‌ చెప్పగానే కేదార్‌ వెళ్లి అప్లికేషన్‌ ఫిల్‌ చేసి బ్లడ్‌ శాంపిల్‌ ఇచ్చి వస్తాడు. తర్వాత అందరూ కలిసి ఇంటికి వెల్లిపోతారు.  ఇంట్లో యువరాజ్‌ గొడవ చేస్తాడు. కేదార్‌ను పట్టుకుని ఎవడ్రా నువ్వు ఎవరికి పుట్టావో తెలుసా..? అంటూ నిలదీస్తాడు. అవసరం అయితే ఆస్థిని అమ్మైనా మా నాన్నను కాపాడుకుంటాను అంటాడు.


నిషిక: శాశ్వతంగా ఈ ఇంటికి వారసుడివి అయిపోదామనుకుంటున్నావేమో..?


యువరాజ్‌: నాప్రాణం పోయినా అలాంటిది జరగనివ్వను..


సుధాకర్‌: ఆ మాట చెప్పడానికి నువ్వెవడురా అసలు. నా ప్రాణం ఎవరు కాపాడాలో నాకు కిడ్నీ ఎవరు ఇవ్వాలో చెప్పడానికి నువ్వెవడివిరా..


వైజయంతి: బావ యువరాజ్‌ నీ కొడుకు బావ


సుధాకర్‌: ఎవరు ఎవరికి ఏమౌతారో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అన్నీ తెలుసు. అయినా నన్ను బతికించాలి అంటే నా కొడుకే అయ్యుండాల్సిన అవసరం లేదు. కిడ్నీ ఎవరైనా దానం చేయోచ్చు అని డాక్టర్‌ చెప్పారు కదా? తన ఫీచర్‌ గురించి ఏమాత్రం ఆలోచించకుండా నాగురించి ఆలోచించాడు అంతకన్నా ఏం అర్హత కావాలి. మీకందరికీ తెలిసిన విషయమే అయినా మళ్లీ చెప్తున్నాను. కేదార్‌ నా కొడుకు.. వీడు నా కొడుకు.


  అని సుధాకర్‌ చెప్పగానే ధాత్రి, కేదార్‌, కౌషికి ఆనందంతో ఏడుస్తుంటారు. వైజయంతి.. యువరాజ్‌, నిషిక బాధపడతారు. ఎవరికి పుట్టాడో తెలియని వాణ్ని ఇంట్లోకి తీసుకొస్తానంటే నేను ఊరుకోను అని యువరాజ్‌ అనగానే సుధాకర్‌ కోపంగా యువరాజ్‌ను కొడతాడు. ఇంతలో  ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!