Jagadhatri  Serial Today Episode: ఆఫీసుకు ధాత్రి, కేదార్‌ వస్తారు. వాళ్లను చూసిన వైజయంతి, నిషిక ఇరిటేటింగ్‌ గా ఫీలవుతారు. నిషిక సతోషానికి కారణం తను సీఈవో కావడమే అయితే అది మనం ఎలాగైనా ఆపాలని అనుకుటారు. మరోవైపు ధాత్రి, కేదార్‌ లను  ఆపడానికి లిప్ట్‌ ప్లాన్‌ చేశానని నిషిక చెప్తుంది. వైజయంతి హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో ధాత్రి, కేదార్‌ ల అరుపులు వినిపిస్తాయి.

వైజయంతి: నీ ప్లాన్‌ సక్సెస్‌ అయినట్టు ఉంది అమ్మీ. అబ్బాబ్బా ఆ అరుపులు వింటాఉంటే మనసుకు ఎంత హాయిగా ఉండాదో..

నిషిక: చెప్పాను కదా అత్తయ్యా ఈ నిషిక టైం స్టార్ట్‌ అయింది.

వైజయంతి: ఈ దెబ్బతో వీళ్లిద్దరి పీడ విరగడైపోతుంది.

నిషిక: అవును.. ఏంటత్తయ్యా..  వీళ్లు లిఫ్ట్‌ ఎక్కలేదా? వీళ్లు ఇక్కడ ఉంటే

వైజయంతి: అయితే ఆ అరుపులు ఎవరివి.

నిషిక: కాచి.. బూచి..

అనుకుంటుండగా ధాత్రి, కేదార్‌లు ఇద్దరూ నడుచుకుంటూ నిషిక దగ్గరకు వస్తారు. తాము లిప్ట్‌ ఎక్కకుండా కాచి బూచి లిఫ్ట్‌ ఎక్కడం గురించి గుర్తు చేసుకుంటారు. లిఫ్ట్‌ లో కాచి, బూచి ఇరుక్కుపోయి అరుస్తుంటారు.

ధాత్రి: చెప్పా కదా నిషి నా ఎంట్రీ టైంలో తేడా ఉండదని.

నిషిక: నీ పని వచ్చాక చెప్తాను. త్వరగా లిప్ట్‌ ఓపెన్‌ చేయ్‌.. ఎంటత్తయ్యా ఇది.

కేదార్‌: మీ చెల్లి మన కోసం చాలా గట్టిగానే ప్లాన్‌ చేసింది.

ధాత్రి: వాళ్ల ప్లాన్‌ మనకు తెలియకూడదని పాపం ఎన్ని తంటాలు పడుతుందో చూడు.

నిషిక: కాచి మీరెందుకు లిఫ్టులో వచ్చారు.

వైజయంతి: అమ్మి మిమ్మల్ని నడుచుకుంటూ రమ్మని చెప్పాము కదా?

ధాత్రి: చెడపకురా చెడేవు అనే సామెత నువ్వు ఎక్కడైనా విన్నావా? కేదార్‌.

కేదార్‌: ఇప్పుడు చూస్తున్నాను కూడా ధాత్రి..

   అంటూ మాట్లాడుకుంటుండగా వైజయంతి, నిషిక, కాచి, బూచి లోపలికి వెళ్తారు. వారి వెనకే ధాత్రి, కేదార్‌ లోపలికి వెళ్తారు. మీటింగ్‌ హాల్లో కూర్చున్న రాఘవరావు బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌ అందరూ కలిసి కంపెనీ సీఈవోగా నిషిక గారిని ఎన్నుకున్నారు. అనగానే ధాత్రి ఆపుతుంది. దీంతో మాకు నిషికనే నెక్ట్‌ సీఈవోగా చేయమని కౌషికి, సుధాకర్‌ గార్లే చెప్పారని ఆరోజు ఫోన్‌ లిఫ్ట్‌ చేసింది మీరే కదా? అంటాడు. దీంతో వైజయంతి భయంగా అవునని అంటుంది.   వైజయంతి, నిషిక ఆడిన నాటకాన్ని ధాత్రి ఎక్స్‌పెక్ట్‌ చేస్తుంది. కేదార్‌ అడ్డు చెప్పబోతుంటే ధాత్రి అడ్డుకుంటుంది.

కేదార్‌: ఎందుకు ధాత్రి నన్ను ఆపుతున్నావు.

ధాత్రి: ఇప్పుడు నిజం బయటపడితే పోయేది నిషిక పరువు మాత్రమే కాదు. వజ్రపాటి ఇంటి పరువు, వజ్రపాటి ఇంటి కోడలి పరువు కేదార్‌.

సీఈవోగా నిషిక సంతకం చేసి బాద్యతలు తీసుకుంటుంది.

కేదార్‌: ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరుగుతుంది ధాత్రి. అక్క మన మీద పెట్టుకున్న నమ్మకం అంతా కోల్పోయాము.

నిషికకు అంతా కంగ్రాచ్యులేషన్స్‌ చెప్తారు. ఇంతలో ధాత్రి, కేదార్‌ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతారు. కౌషికికి ఫోన్‌ చేసి అందరూ కలిసి నిషికను సీఈవోగా ఎన్నుకున్నారు అని ధాత్రి చెప్తుంది. దీంతో కౌషికి షాక్ అవుతుంది.  మీరేం అక్కడ ఏమీ అనకండి ఇంటికి వచ్చాక మాట్లాడుదాం అని చెప్తుంది కౌషికి. సరేనని లోపలికి వెళ్తారు ధాత్రి, కేదార్‌. లోపల కౌషికి నేమ్‌ బోర్డును నిషికి తీసేస్తుంటే కేదార్‌ అడ్డుకుంటాడు. సీఈవో ఛైర్‌లో నిషిక కూర్చుంటుంటే ధాత్రి చైర్‌ లాగుతుంది. నిషిక కిందపడుతుంది. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ షర్ట్‌ మీద నక్షత్ర ఫోటో – కవర్‌ చేయలేక ఇబ్బందిపడ్డ భూమి