Jagadhatri  Serial Today Episode: మీనన్‌ మర్యాదగా నీ బిజినెస్‌ డీటెయిల్స్‌ ఇచ్చి అప్రూవల్‌ గా మారిపో అంటాడు కేదార్‌. మీనన్‌ వినడు. కాసేపట్లో మీరే మర్యాదగా ఇక్కడి నుంచి పంపిచేస్తారు చూస్తూ ఉండండి అంటాడు మీనన్‌. ఏన్నో ఏళ్ల ముందు ఈ రోజు కోసం కలగన్నాను మీనన్‌. ఆఖరి సారిగా అడుగుతున్నాను ఇన్‌స్పెక్టర్‌ కావ్యు ఎందుకు చంపావు ఎందుకు అని ప్రశ్నిస్తుంది. మీనన్‌ నవ్వుతూ ఉంటాడు. ఇంతలో జేడీకి వీడియో కాల్‌ వస్తుంది. అందులో ఆరాధ్య కిడ్నాప్‌ అయి ఉంటుంది. ఆరాధ్య ఏడుస్తూ ఉంటుంది.


ధాత్రి: ఏయ్‌ ఎవర్రా నువ్వు ఆ అమ్మాయిని వదిలేయ్‌ లేదంటే చంపేస్తాను.


కిడ్నాపర్‌: నేను ఎవరనేది ముఖ్యం కాదు జేడీ నాకు ఏం కావాలనేది ముఖ్యం. మా అన్నను గంటలో వదిలిపెట్టకుంటే ఈ అమ్మాయి శవం మీకు గిఫ్టుగా పంపుతాను.


కేదార్‌: రేయ్‌ ఆరాధ్య కు ఏమైనా అయితే నిన్ను ప్రాణాలతో వదలను. అసలు ఈ కేసుకు ఆరాధ్యకు ఏ సంబంధం లేదు.


కిడ్నాపర్‌: మర్యాదగా మా అన్ను వదిలిపెట్టండి. లేకపోతే ఈ పిల్లను చంపేస్తాను. తనతో పాటు ఎంత మందిని చంపుతానో నాకే తెలియదు.


మీనన్‌: ఇప్పుడు చెప్పండ్రా అమ్మాయిలు, అబ్బాయిలు. ఇప్పుడు ఏం చేద్దాం. ఏ సాధు నువ్వు చెప్పు ఏం చేద్దాం.


సాధు: చెప్పడానికి ఏమీ లేదు జేడీ ఫినిష్‌ హిమ్‌ .


మీనన్‌: అరేయ్‌ మెంటల్‌ నీ కూతురు అక్కడ ఉంది నీకు అర్థం కావడం లేదా?


సాధు: అర్థం కావడానికేం లేదు. నకిలీ నోట్ల దగ్గర నుంచి కిడ్నాపులు, దొపీడీలు, దొంగతనాలు ఇలా సొసైటీ నాశనం అవ్వడానికి ఏం చేయాలో అన్ని చేస్తున్నాడు వీడు. ఇలాంటి వాడి ప్రాణాలు కాపాడే నా కూతురు ప్రాణం నాకు నా కుటుంబానికి ఏమీ వద్దు జేడీ. వీణ్ని చంపేసేయ్‌.


మనీన్‌: రేయ్‌ సాధు.. నేను చెప్పేది వినరా..


సాధు వెళ్లిపోతాడు. కేదార్‌, ధాత్రి, సాధు రూంలోకి వెళ్తారు. ఆరాధ్య కిడ్నాప్‌ అయిందని మీకు ముందే తెలుసా? సార్‌ అని అడుగుతుంది ధాత్రి. అవునని ఇంతకు ముందే తెలిసిందని చెప్తాడు. ఒక తండ్రిగా నేను ఓడిపోయినా పోలీసుగా గెలుస్తాను జేడీ అంటాడు సాధు. కానీ ధాత్రి, కేదార్‌ అందుకు ఒప్పుకోరు మీనన్‌ ను అప్పగించాలనుకుంటారు. కిడ్నాపర్‌ చెప్పిన ప్లేస్‌కు మీనన్‌ ను తీసుకెళ్తారు.


మీనన్‌: డోర్‌ తీయ్‌.. పాప ఇంటికి రావాలంటే వాళ్ల పప్పా ఏం చేయాలో తెలుసుగా..


 కేదార్‌: గుర్తు పెట్టుకో మీనన్‌ నీ జీవితం ఆడవాళ్లు పెట్టిన బిక్ష. ఆరోజ కావ్య గారు.  ఈరోజు ఆరాధ్య, జేడీ. అక్కడ ఏమైనా అయితే నీ ప్రాణం నీతో ఉండదు.


 అంటూ కేదార్‌ వార్నింగ్‌ ఇవ్వగానే మీనన్‌ వెళ్లిపోతాడు. మరోవైపు సుధాకర్‌, కౌషికి, నిషిక అందరూ మాట్లాడుకుంటుంటారు.


సుధాకర్‌: అసలు వినాయకుడి విగ్రమం ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి విగ్రహం చుట్టూ ఏదో జరుగుతూనే ఉంది కౌషికి.


కౌషికి: అవును బాబాయ్‌. అసలు విగ్రహం ఇంటికి తీసుకురావడం నుంచే కన్పీజన్‌ మొదలైంది.


కాచి: అవును అక్కా ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఎవరో చెప్పినట్టు ట్రాక్టర్‌ను అలా తీసుకెళ్లిపోయాడు.


కౌషికి: అవును కాచి ఆరోజ రాత్రి వచ్చిన దొంగ కూడా మనం అనుకుంటున్నట్టు లడ్డు కోసం కాదు విగ్రహం కోసం వచ్చి ఉండాలి.


నిషిక: విగ్రహం కోసం ఎందుకొస్తారు వదిన. అయినా వినాయకుడి విగ్రహాన్ని ఎవరైనా ఎందుకు దొంగిలించుకెళ్తారు.


కౌషికి: అవును నేను అదే ఆలోచిస్తున్నాను అయినా వినాకుడి విగ్రహాన్ని ఎందుకు దొంగిలించుకుంటారు. ఆ విగ్రహం చాలా విలువైంది అయ్యుండొచ్చు.


నిషిక: విలువైందా? అదేదో విగ్రహంలో కోట్ల కోట్లు డబ్బులు ఉన్నట్లు మాట్లాడుతున్నారు.


కౌషికి: అవును ఏమైనా ఉండకూడదా?


అనగానే ఇంతలో డోర్‌ దగ్గర నుంచి చాటుగా మొత్తం వింటున్న యువరాజ్‌ అక్కా అనుకుంటూ లోపలికి వస్తాడు. విగ్రహం నిమజ్జనం చేశామని చెప్తాడు. ఇంతలో ధాత్రి, కేదార్‌ వచ్చి నిమజ్జనం చేస్తే అసలు ఎందుకు ట్రాక్టర్‌ ను అలా తీసుకెళ్లాడో కనుక్కోలేదా? యువరాజ్‌ అని అడుగుతారు. దీంతో యువరాజ్‌ ఏదో మాటలు చెప్పగానే కౌషికి సరేలే అంటుంది. ఇంతలో నిషికకు ఫోన్‌ రావడంతో పైకి వెళ్తుంది. దీంతో కేదార్‌ ఫోన్‌ రాగానే నిషిక పైకి వెళ్తుంది. వెనకే ధాత్రి వెళ్తుంది. ఆఫీసు నుంచి రమ్య ఫోన్‌ చేసి నిషికకు కంపెనీకి సీఈవో అయినట్టేనని కంగ్రాట్స్‌ చెప్తుంది.  దీంతో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని కిందపడేసిన ఆరు – భాగీ గురించి ఫీల్‌ అయిన అమర్‌