Jagadhatri Serial Today Episode: సామ్రాజ్యం వీడియో గ్రాఫర్ ను తీసుకొచ్చి గుడిలో ధాత్రి తన మెడలో తానే తాళి వేసుకున్న వీడియో చూపించమని చెప్తుంది. అందరూ వీడియో కోసం ఎదురుచూస్తుంటారు. వీడియో గ్రాఫర్ తన ఫోన్ తీసి వీడియో ప్లే చేయబోతుంటే ధాత్రి అడ్డుపడుతుంది. నిన్ను పోయిన వారం పోలీసులు అరెస్ట్ చేశారు కదా అంటూ ఏదేదో మాట్లాడుతుంటే అందరూ షాక్ అవుతారు.
యువరాజ్: గోపీ నిన్ను ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు.
గోపి: నన్ను ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదు.
నిషిక: ఏయ్ నాన్నమ్మ తీసుకొచ్చిన వీడియో మేము చూడకుండా అడ్డుపడుతున్నావు కదా?
అంటుంది నిషిక. బయట కేదార్ తన టీం కోసం ఎదురు చూస్తుంటాడు. ఇంతలో టీం మెంబర్స్ వస్తారు. వాళ్లను త్వరగా పని చేయాలని చెప్తాడు. వాళ్లు తమ పని మొదలుపెడతారు.
కౌషికి: నువ్వు వీడియో చూపించు గోపి..
అనగానే గోపి వీడియో ప్లే చేస్తాడు. ధాత్రి తాళి తీసుకుని కేదార్ దగ్గరకు వెళ్లగానే బయట ఉన్న కేదార్ టీం జామర్లు ఆన్ చేయగానే లోపల వీడియో స్టక్ అవుతుంది. దీంతో గోపితో వైఫై కనెక్టు చేయిస్తుంది ధాత్రి దీంతో బయట ఉన్న టీం గోపి ఫోన్‌లో ఉన్న వీడియోను డిలీట్ చేస్తారు. దీంతో గోపి ఫోన్‌లో ఉన్న వీడియో కనిపిండదు. దీంతో అందరూ షాక్ అవుతారు. ధాత్రి హ్యాపీగా ఫీలవుతుంది. అందరూ ధాత్రే ఏమో చేసిందని తిడతారు. ఇంతలో గోపి తన లాప్‌టాప్‌లో కూడా వీడియో ఉందని తీసుకొచ్చి ప్లే చేస్తాడు. వీడియో చూసిన అందరూ షాక్ అవుతారు.
నిషిక: అబ్బాబ్బా ఎన్ని ప్లాన్లు ఎన్ని మోసాలు జగధాత్రి ఫస్ట్ టైం నీమీద చాలా గౌరవం పెరిగిపోయింది. నువ్వు ఎలాంటి దానివో ఇవాళ అందరికీ క్లారిటీ వచ్చింది.
వైజయంతి: అన్నయ్య గారు చూశారా మీ అమ్మాయి పెళ్లి అయిందని మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎలా మోసం చేసిందో?
అనగానే ధాత్రి వాళ్ల నాన్న నేను ఎవరు చెప్పినా నమ్మను వీడియో కూడా నమ్మను అది నిజం కాదని నువ్వు చెప్పమ్మా అంటూ తన మీద ఓట్టేసి చెప్పమనగానే ధాత్రి అది నిజమే అంటుంది. దీంతో వెంటనే ఆయన ధాత్రి చెంప పగులగొడతాడు. తమను మోసం చేసినందుకు ఆయన బాధపడతాడు.
సురేష్: అంకుల్ మీ కోపాన్ని బాధని అర్థం చేసుకోగలను.. కానీ మీరు కూడా వాళ్లిద్దరి మధ్య ఉన్న ప్రేమని అర్థం చేసుకోండి. జగధాత్రికి ఎంత నమ్మకం లేకుంటే ఇంత పని చేయడానికి వెనకాడదు.
కాచి: అంటే వాళ్లు చేసింది తప్పు కాదంటావా? బావ.
సురేష్: కారణం ఏదైనా ఇలా చేయడం తప్పే కానీ పాపం కాదు కదా?
వైజయంతి: చాలులే అబ్బి వినేవాడు ఉంటే నువ్వు ఏదైనా చెప్తావు.
నిషిక: ఎంటి వదిన ఇక్కడ ఇంత జరుగుతున్నా ఏమీ పట్టనట్టు ఊరుకున్నారు.
కౌషికి: తప్పు చేశావు జగధాత్రి, జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశావు.
ధాత్రి: వదిన ఒక్కసారి నేను చెప్పేది వినండి..
అనగానే యువరాజ్, నిషిక కోపంగా ధాత్రి, కేదార్ లను బయటకు గెంటివేస్తారు. ఇంకోసారి ఈ ఇంటి గడప తొక్కితే చంపేస్తానని యువరాజ్ వార్నింగ్ ఇస్తాడు. తర్వాత ధాత్రి వాళ్ల నాన్న రాగానే విధిలేని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చిందని ధాత్రి చెప్పగానే ఆయన ధాత్రిని నమ్మి నేను మీ వెనకాలే ఉంటానని చెప్పడంతో ధాత్రి హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఎన్నికల ప్రచారంలో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రధాని మోదీ, 76 రోజుల్లో ఏకంగా 206 ర్యాలీలు