Jagadhatri  Serial Today Episode: హాస్పిటల్‌ స్టోర్‌ రూంలో యువరాజ్‌ బర్తు సర్టిఫికెట్‌ కాల్చేయడంతో కేదార్‌ ఏడుస్తూ అక్కడే కూలబడిపోతాడు. ఇంతలో పైకి సూరి వస్తాడు. ఏడుస్తున్న కేదార్‌ను సూరి ఓదారుస్తాడు. కేదార్‌ ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడగడంతో బర్తు సర్టిఫికెట్‌ కాలిపోయిందని చెప్పడంతో ఎవరు ఇంత దారుణానికి ఒడిగట్టింది అని అడగడంతో యువరాజ్‌ ..  నా తమ్ముడు అంటూ ఏడుస్తూ చెప్తాడు కేదార్‌. దీంతో ఇక్కడికి వాడెలా వచ్చాడు. వాడికి ఎవరు చెప్పారు అని సూరి అడుగుతాడు.


కేదార్‌: నాకు నా తండ్రితో బతికే రాత లేదేమో మామా. ఇప్పుడు ఆఖరి సాక్ష్యం కూడా పోయింది. ఇక నేను అనాథగానే మిగిలిపోవాల్సిందే


సూరి: కేదార్‌ దేవుడు మంచి వాళ్లకు ఎప్పుడూ అన్యాయం చెయ్యడు నాన్నా.. నువ్వు ఇలా నిరాశపడిపోతే ఎలా.. నువ్వు నిజాన్ని నిరూపించడానికి మార్గాలు ఉన్నాయి నాన్నా..


కేదార్‌: ఏంటి మామా నువ్వు మాట్లాడుతుంది.


సూరి: ఆరోజుల్లో ప్రతి గవర్నమెంట్‌ డాక్యుమెంట్‌ని ఒక కాపీని డివిజినల్‌ ఆఫీసులో పెట్టేవారు. అలాగే నీ బర్తు సర్టిపికేట్‌ కూడా ఆ ఆఫీసులో ఉండే అవకాశం ఉంది. ఇక మీ అమ్మానాన్న పెళ్ళి ఒక ఆర్యసమాజ్‌ లో జరిగింది. అక్కడ ఇద్దరూ చేసిన సంతకాలతో పాటు రికార్డ్స్‌ కోసం ఒక ఫోటో కూడా పెట్టుకుని ఉంటారు.


కేదార్‌: అవునా మామ నేను ఆయన కొడుకునే అని నిరూపించుకోవచ్చా?


అని అడగ్గానే అవునని కొద్ది రోజుల్లో నేను ఆ సాక్ష్యాలు  తీసుకొస్తానని చెప్తాడు. మరోవైపు నెక్లెస్‌ కోసం వెతుకుతున్న ధాత్రి, ఏమైనా కనిపించిదా అని అడగడంతో కింద నెక్లెస్‌ బాక్స్‌ పెట్టే ముక్క ఒకటి కనిపిస్తుంది అని చెప్పడంతో అయితే నన్ను కిందికి తీసుకెళ్లండి వదిన అని చెప్తుంది ధాత్రి. కిందికి వెళ్లిన తర్వాత నెక్లెస్‌ బాక్స్‌ చెందిన చిన్న పీస్‌ ఒకటి దొరుకుతుంది.


కౌషికి: బాక్స్‌ కు సంబంధించిన దానిలా ఉంది జగధాత్రి.


ధాత్రి: అవును వదిన ఇది ఆ బాక్స్‌ కు సంబంధించిందే  అంటే పైనుంచి వేస్తుంటే కింద పట్టుకోకపోవడంతో  పగిలి ఉంటుంది.


అంటూ చెప్పడంతో దూరం నుంచి గమనిస్తున్న వైజయంతి, నిషిక, కాచి, బూచి జరిగిందంతా కలగంటారు.


నిషిక: ఇందేటత్తయా మొత్తం చూసినట్టు చెప్పేస్తుంది.


కాచి: అక్కా జగధాత్రి వెళ్లే స్పీడు చూస్తుంటే నగ ఎక్కడుందో కనిపెట్టి మనందర్ని జైలుకు పంపిచేలా ఉన్నారు.


బూచి: అయితే ఐడియా ఇచ్చిన వాళ్లే జైలుకు పోవాలి.


వైజయంతి: నేనెందుకు పోవాలి.. నేను పోను..


నిషిక: ఆపండి.. అది మనల్ని పట్టుకోవాల్సిందేమీ లేదు. మనలో ఉన్న భయమే మనల్ని పట్టిస్తుంది.


ధాత్రి: ఎంటి నిషిక జరిగింది జరినట్లు చెప్పగానే నోట్లోంచి మాట రావడం లేదా?


నిషిక: నువ్వొక కట్టుకథ అల్లి మాకు చెప్పగానే మేమందరం భయపడిపోతామనుకున్నావా?


ధాత్రి: కట్టుకథ కాదు నిషి తెరవెనుక అందరూ కలిసి ఆడిన నాటకం. మీరే నెక్లెస్‌ దాచి మీరే నామీద వేస్తున్నారని నాకు తెలుసు.


అంటూ ధాత్రి చెప్పగానే నిషిక నేరం నీ మీదకు వచ్చే వరకు మాట ఎలా మారుస్తున్నావు చూడు అంటుంది. దీంతో కౌషికి కూడా నిషికను నిలదీయడంతో అందరూ భయపడిపోతారు. ఇంతలో ధాత్రి నెక్లెస్‌ ఈ కౌంపౌండ్‌ వాల్‌ దాటి బయటకుపోలేదని ఇక్కడే ఎక్కడో దాచి ఉంటారని చెప్పి ఎక్కడైనా మట్టి తవ్వినట్లు ఉందేమో చూడమని చెప్పడంతో అక్కడ మట్టి తవ్వినట్లు ఉందని చెప్పడంతో అక్కడకు వెళ్లి తవ్వబోతుంటే వైజయంతి వచ్చి ఆపుతుంది. ఇంతలో పోలీసుల వస్తారు. ధాత్రిని అరెస్ట్‌ చేస్తామని చెప్పడంతో ధాత్రి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: మయోసైటిస్‌తోనే సిటాడెల్‌ షూటింగ్‌ - చాలా కష్టంగా గడించింది, యాక్షన్‌ సీన్స్‌లో మూర్చపోయా