Jagadhatri Serial Today March 19th: ‘జగధాత్రి’ సీరియల్: కేసు వెనక్కి తీసుకోనన్న ధాత్రి – కేదార్‌తో రాయబారం నెరపిన వైజయంతి
Jagadhatri Today Episode : సత్యప్రసాద్ మీద కేసు వెనక్కి తీసుకోనని ధాత్రి కరాకండిగా చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri Serial Today Episode : సత్యప్రసాద్‌ను జేడీ అరెస్ట్ చేయడంతో వజ్రపాటి ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు. ఇంతలో బయటకు వెళ్లిన ధాత్రి, కేదార్ ఇంటికి రావడంతో యువరాజ్ వాళ్ల మీదకు కోపంగా వెళ్తాడు. సత్యప్రసాద్ మీద పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోమని చెప్తాడు. ధాత్రి వినదు. దీంతో వైజయంతి లోపలికి వెళ్లి మాధురిని తీసుకొస్తుంది.
వైజయంతి: అత్తారింటి నుంచి కట్టుబట్టలతో కన్నీళ్లతో తిరిగి వచ్చిన నా కూతురుకు ఏం సమాధానం చెప్తావు.
నిషిక: ఏంటో బొమ్మలా అలా నిలబడి చూస్తున్నావు. మధుకు ఏం కాదు అన్నారు కదా..? తన బతుకు ఏం అవుతుందో తెలియక. తను చేయని తప్పుకు తనకు పడిన శిక్షకు ఏడుస్తున్న మధుకు ఏం చెప్తారో చెప్పండి.
ధాత్రి: ఏమైంది మధు. ఎందుకు ఇంటికి వచ్చావు.
కేదార్: అక్కడ నిన్ను ఎవరన్నా ఏమైనా అన్నారా..?
కాచి: చేసిందంతా చేసి మళ్లీ ఏమైనా అన్నారా..? అని అంత నెమ్మదిగా అడుగుతున్నారేంటి..? ఏ అత్తింటి వాల్లు తమ కోడలు కష్టాలు, కన్నీళ్లు తీసుకొస్తుందంటే చూస్తూ ఊరుకుంటారా..?
యువరాజ్: ఇవాళ అత్తారింట్లో సంతోషంగా నవ్వుతూ ఉండాల్సిన నా చెల్లి పుట్టింట్లో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉందంటే దానికి కారణం మీరు.
వైజయంతి: ఆ పొద్దు పెళ్లి చేసి సంతోషంగా ఆశీర్వదించారు కదా..? ఈ పొద్దు ఆ సంతోసం మీ వల్లే పోయింది.
నిషి: తన కాపురం ఏమై పోతుందో తన భర్తతో తను ఊహించుకున్న బంగారు జీవితం ఏమౌతుందోనన్న బాధకు, కన్నీళ్లకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి.
ధాత్రి: అసలు ఏమైంది మధు
మధు: జేడీ టీం వచ్చి మామయ్యగారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లాక మేము ఇంటికి వెళ్లాము. మామయ్యగారి అరెస్ట్‌కు కారణం మా పుట్టిళ్లే కారణం అని జగధాత్రి వదిన కేసు వెనక్కి తీసుకుంటేనే నన్ను మళ్లీ ఆ ఇంట్లోకి రాణిస్తామని చెప్పారు.
వైజయంతి: దీనికి ఏం సమాధానం చెప్తావో చెప్పు అమ్మి.
ధాత్రి: సారీ మధు నా మీద కోపాన్ని నీ మీద చూపిస్తారు అనుకోలేదు.
వైజయంతి: నీకు ఇట్టా జరుగుతుందని తెలిసే ఇట్టా చేశావు. నీ మాయ మాటలతో ఇంకా ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు అమ్మి.
కౌషికి: ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నారు. ధాత్రిని మనం ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాము ఏరోజైనా ఒకరి మనసును కష్టపెట్టాలని చూసిందా..?
వైజయంతి: ఇప్పుడు కూడా ఈ అమ్మి పక్కనే మాట్లాడుతున్నావా..? కౌషికి.. నీ చెల్లెలు కాపురం కళ్ల ముందే కూలిపోతుంది. అదేమన్నా నీకు తెలుస్తుందా..?
కాచి: కొంచెం అటు ఇటైనా మాధురి జీవితం నాశనం అవుతుంది అక్కా.. జీవితాంతం ఇక పుట్టింట్లోనే ఉండిపోవాలి.
నిషిక: అయినా వజ్రపాటి ఇంటి ఆడపిల్లలకు పుట్టింట్లో ఉండటం కొత్తేమీ కాదు కదా.? ఇప్పటి దాకా మొగుడు వదిలేసిన వాళ్లు ఒక్కరు ఉండేవాళ్లు రేపటి నుంచి ఇద్దరు ఉంటారు. ఏ మాటకు ఆ మాట కానీ ఈ ఇంటి ఆడిపిల్లలకు మొగుడితో కాపురం చేసే యోగ్యం లేదేమో..?
అనగానే.. ధాత్రి కోపంగా నిషిని కొట్టబోయి ఆగి.. నువ్వు ఈ ఇంటి కోడలివి.. నువ్వు మాట్లాడే మాటల్లోనే ఈ ఇంటి గౌరవం ఉందని నీకు ఎన్నిసార్లు చెప్పాను. అంటుంది. ఇక్కడ సమస్య మాధురిది కాబట్టి నువ్వు ఎలా ఇంటికి వచ్చావో అలాగే వెళ్లి కేసు వెనక్కి తీసుకో అని చెప్తారు. కేసు వెనక్కి తీసుకోవడానికి ధాత్రి ఒప్పుకోదు. దీంతో నిషి, యువరాజ్, వైజయంతి ధాత్రిని తిడతారు. ధాత్రి మాత్రం కేసు వెనక్కి తీసుకోలేను అంటూ వెళ్లిపోతుంది. దీంతో వైజయంతి ఏడుస్తూ.. కేదార్ దగ్గరకు వెళ్లి నువ్వు నిజంగా ఈ కుంటుంబం నీదే అనుకుంటే ధాత్రిని కేసు వెనక్కి తీసుకోమని చెప్పు.. మాధురి సంతోషం కోసమైనా నువ్వు ధాత్రిని కన్వీన్స్ చేయ్ అంటుంది. ఇంతటితో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!