Jagadhatri  Serial Today Episode: పెళ్లి అయ్యే వరకు కేదార్‌, ధాత్రిలను ఇంట్లోనే ఉండమని చెప్తుంది కౌషికి. అంతవరకు ఎవరితోనూ గొడవ పడొద్దని సూచిస్తుంది. అయితే తాము ఎవరితో గొడవ పడమని వాళ్లే కావాలని మమ్మల్ని రెచ్చగొడతారని ధాత్రి చెప్తుంది. సరే మీరు లోపలికి వెళ్లండి అని కౌషికి చెప్పగానే ధాత్రి కేదార్‌ లోపలికి వెళ్లిపోతారు. ఇంతలో సుధాకర్‌ వచ్చి వాళ్లను పెళ్లి చేసి పంపించడానికే తీసుకొచ్చావా? అని కౌషికిని అడుగుతాడు. దీంతో కౌషికి ఇంకా వేరే ఏదైనా ఉందా? అని అడగ్గానే ఏం లేదని సుధాకర్‌ వెళ్లిపోతాడు. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తానని కౌషికి మనసులో అనుకుంటుంది. తర్వాత కేదార్‌, సూరికి ఫోన్‌ చేస్తాడు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తుంది. దీంతో కేదార్‌ కంగారు పడుతుంటాడు. ధాత్రి వస్తుంది.


ధాత్రి: ఏమైంది ఎందుకు అంత కంగారుపడుతున్నావు..?


కేదార్‌: సూరి మామ ఫోన్‌ స్విచ్చాప్‌ వస్తుంది.


ధాత్రి: స్విచ్చాఫ్‌ వస్తుందా? ఇక్కడికే సాక్ష్యం తీసుకుని బయలుదేరుతున్నాను అని చెప్పారు. ఇప్పుడు స్విచ్చాప్‌ అవ్వడం ఏంటి?


కేదార్‌: అదే అర్థం కావడం లేదు ధాత్రి. ఇవాళ్టీతో నేను ఈ ఇంటి వారసుణ్ని అని బయటపడిపోతుందని అనుకుంటే ఇలా జరగుతుందేంటి?


అనగానే యువరాజ్‌ గురించి ధాత్రి అడుగుతుంది. మనం వెళ్లిపోయామని అందరూ స్వీట్లు పంచుకుంటుంటే యువరాజ్‌ ఎక్కడికి వెళ్లినట్లు అంటూ ఆలోచిస్తారు. యువరాజ్‌ సూరిని ఆపడానికి ప్రయత్నిస్తాడని కేదార్‌ చెప్తాడు. అలా జరగకూడదని కోరుకుందాం అనుకుంటారు మరోవైపు యువరాజ్‌ ఇంటికి వస్తాడు. అందరూ టెన్షన్‌గా వెళ్లిన పని ఏమైందని అడుగుతారు. వెళ్లిన పని పూర్తి చేసే వచ్చానని యువరాజ్‌ చెప్పడంతో పైనుంచి అంతా చూసిన కేదార్‌ కోపంగా కిందకు వచ్చి యువరాజ్‌ను కొడతాడు. దీంతో మెడపట్టి బయటకు గెంటేశాము కదా మళ్లీ ఎలా వచ్చారు అని అడుగుతాడు యువరాజ్‌.  కౌషికే తీసుకొచ్చిందని నిషిక చెప్తుంది. ఇంతలో గొడవ పెద్దది కాగానే లోపలి నుంచి కౌషికి వస్తుంది.


కౌషికి: ఏమైంది మీకు అలా ఉన్నారు..?


ధాత్రి: యువరాజ్‌ సూరి బాబాయ్‌ని చంపేశాడు వదిన.. అదే విషయం ఇంటికి వచ్చి గర్వంగా చెప్పుకుంటున్నాడు.


కౌషికి: ఎంత పని చేశావురా యువరాజ్‌. పంతానికి పోయి ఒక మనిషి ప్రాణం తీసి వచ్చావా?


నిషిక: వదిన వాళ్ల మాటలు నమ్మి మీరు ఆయన్ని అనుమానిస్తున్నారా?


కౌషికి: నువ్వు మాట్లాడకు నిషి.. ఒక మనిషి ప్రాణాలు తీయడం అంటే ఆషామాషి విషయం కాదు.


 అని కౌషికి అడగ్గానే యువరాజ్‌ ఏదో చెప్పబోతుంటే వైజయంతి అడ్డుపడుతుంది. ఇంతలో ధాత్రి కల్పించుకుని సూరి బాబాయ్‌ ఎక్కడున్నాడో తెలుసుకుంటాము. సాక్ష్యాధారాలతో నిరూపిస్తాం.. అని వెళ్లిపోతారు. ఇంట్లో వాళ్లందరూ కౌషికిని తిట్టి వెళ్లిపోతారు. మరోవైపు ధాత్రి, కేదార్, సూరి కోసం వెతుకుతుంటారు. ఒక దగ్గర మర్డర్‌ జరిగి ఉంటుంది. అక్కడకు వెళ్లి ఎంక్వైరీ చేస్తారు కేదార్‌, ధాత్రి. స్పాట్‌లో క్లూ కోసం వెతుకుతారు. స్పాట్‌లో యువరాజ్‌ పర్సు దొరుకుతుంది. దీంతో ధాత్రి, కేదార్‌ షాక్‌ అవుతారు.


కేదార్‌: చెప్పాను కదా ధాత్రి ఆ యువరాజే సూరి మామను చంపేశాడని


ధాత్రి:  యువరాజ్‌ ఎన్ని తప్పులు చేసినా మీనన్‌ తో చేతులు కలిపినా.. నిషి ముఖం చూసి ఊరుకున్నాను. కానీ పంతంతో ఒక మనిషి ప్రాణం తీయాలని చూశాడు. ఇంక యువరాజ్‌ను ఎవ్వరూ కాపాడలేరు.


కేదార్‌: నాకు సాయం చేయబోయి సూరి మామ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇదంతా నా వల్లే జరిగింది.


అంటూ బాధపడుతుంటే ధాత్రి, కేదార్‌ను ఓదారుస్తుంది. మరోవైపు యువరాజ్‌, కరుణాకర్‌ కలిసి కేదార్‌ను కూడా చంపేయాలని ప్లాన్‌ చేస్తారు. ఇంతలో పోలీసులను తీసుకుని ధాత్రి, కేదార్‌ ఇంటికి వస్తారు. కౌషికి వచ్చి ఏమైందని అడగ్గానే హంతకుణ్ని తీసుకెళ్లడానికి పోలీసులు వచ్చారని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన శివకార్తికేయన్ - మూడో బిడ్డకు తండ్రైనట్లు వెల్లడి