Jagadhatri  Serial Today Episode: మేము కొట్టకుంటుంటే మా ఆస్థులు కొట్టేయాలనే కదా నువ్వు ప్లాన్‌ చేస్తున్నావు అంటుంది వైజయంతి. అయితే తనకు ఆస్థులు వద్దని మీలో ఒకడిగా బతకడమే నాకు ఇష్టమని కేదార్‌ చెప్తాడు. అయితే నువ్వు కౌషికిని అడ్డుపెట్టుకుని కంపెనీకి సీఈవో కావొచ్చు కానీ మాలో ఒకడివి ఎప్పటికీ కాలేవని కమలాకర్‌ చెప్తాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందని ధాత్రి, కౌషికిని అడుగుతుంది. దీంతో కంపెనీని కాపాడుకోవడానికే నేను ఇదంతా చేస్తున్నాను అని అగ్రిమెంట్‌ పేపర్స్‌ పై సంతకం చేయమని కేదార్‌కు ఇస్తుంది కౌషికి. కేదార్‌ సంతకం చేయబోతుంటే నిషిక తుమ్ముతుంది. ఇంతలో యువరాజ్‌ వచ్చి పేపర్స్‌ లాక్కుంటాడు. అందరూ హ్యాపీగా ఫీలవుతారు.


యువరాజ్: ముందు వెనక ఎవరూ లేని అనామకుడివి. అనాథవి నువ్వు నా కంపెనీలో నా సీట్లో కూర్చోవాలి అనుకుంటావా? నేను బతికుండగా అది ఎలా జరుగుతుందనుకున్నావు. ఒకవేళ జరిగినా నిన్నెలా బతకనిస్తాను అనుకున్నావు. వజ్రపాటి వంశానికి ఒక్కడే వారసుడు అది యువరాజే.


ధాత్రి: యువరాజ్‌ కేదార్‌ షర్ట్‌ వదులు. నీకే చెప్తుంది వదులు.


యువరాజ్: మిమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. చేసింది చాలు మీ వల్ల జరిగింది చాలు. ఇంట్లోంచి బయటకు పోండి. మళ్లీ ఈ గడపలో అడుగుపెడితే ప్రాణాలు తీసేస్తా..


కౌషికి: యువరాజ్‌ ఆవేశపడకు కూర్చోని మాట్లాడుకుందాం.


యువరాజ్: మాట్లాడిన పనులు చేసిన పనులు ఇక చాలక్క. నువ్వింకేం మాట్లాడకు. నేను వచ్చాను కదా నేను చూసుకుంటాను. ఏంట్రా చెప్తుంటే ఇంకా ఇక్కడే నిలబడ్డారు. మర్యాదగా పోతారా? మెడ పట్టుకుని గెంటేయమంటారా?


ధాత్రి: ఆవేశపడకు యువరాజ్ ఆ తర్వాత బాధపడేది నువ్వే


కేదార్‌: యువరాజ్ ఒక్కసారి నేను చెప్పేది విను


 అనగానే యువరాజ్‌ కోపంగా కేదార్‌ గళ్ల పట్టుకుని బయటకు గెంటేయబోతుంటే కౌషికి అడ్డుపడుతుంది. దీంతో యువరాజ్‌ కోపంగా కౌషికిని తిడతాడు. దీంతో సుధాకర్‌ యువరాజ్‌ను తిడతాడు. కౌషికి పేపర్స్‌ తీసి కేదార్‌ను సంతకం చేయమని చెప్పగానే యువరాజ్‌ గన్‌ తీసి కౌషికికి ఎయిమ్‌ చేస్తాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. నా గుర్తింపుకు అడ్డొస్తే అక్క అని కూడా చూడకుండా చంపేస్తానని  బెదిరిస్తాడు.


ధాత్రి: తోడబుడితేనో.. లేదా తండ్రికి తోడ బుట్టిన వాడికి పుడితేనో తమ్ముడివి అయిపోవు యువరాజ్. మనసు అర్థం చేసుకుని నలుగురిలో అక్క గౌరవాన్ని కాపాడిన వాడు తమ్ముడు అవుతాడు. ఇవాళ పదవిని కాపాడుకుని ఏం కోల్పోయావో నీకు అర్తం అయిన రోజు జీవితాంతం బాధపడతావు.


వైజయంతి: అమ్మీ అబ్బోడు ఏదో ఆవేశంలో ఇలా చేశాడు. వాడు చేసింది తప్పే ఇంకోసారి ఇలా చేయకుండా నేను చూసుకుంటాను. అబ్బోడా పిచ్చి కానీ పట్టిందారా? కోపం వస్తే ముందు వెనక ఏమీ ఆలోచించవా? నిషి అబ్బోడిని లోపలికి తీసుకుని పోండి.    


 అని వైజయంతి చెప్పగానే యువరాజ్‌, కేదార్‌ చేతిలోని పేపర్స్‌ తీసుకుని చించేసి లోపలకి వెళ్లిపోతాడు. కౌషికి, యువరాజ్‌ మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. మరోవైపు లోపలికి వెళ్లిన కమలాకర్‌ యువరాజ్‌ చేసిన పని కరెక్టేనని అంటాడు.  అయితే ఇలా కాదని కౌషికికి ఎదురెళ్లి కొట్టలేమని.. మంచితనంతో ముంచాలని వైజయంతి చెప్తుంది. ఇవాళ కేదార్‌ ఇలా చేయడం వల్ల కౌషికి ఇక కేదార్‌కు కంపెనీ బాధ్యతలు అప్పజెప్పదని కమలాకర్‌ చెప్తాడు. మరోవైపు జేడీ, కేడీలాగా వచ్చి యువరాజ్‌ను అత్తారింటికి తీసుకెళ్దామని ధాత్రి, కేదార్‌ వెళ్తారు. తర్వాత అందరూ భోజనం చేస్తుంటే సుధాకర్‌ వస్తాడు. కౌషికి ఎక్కడని అడుగుతాడు. ఇంతలో కౌషికి డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వస్తుంది. యువరాజ్ ను పిలుస్తుంది. కోపంతో యువరాజ్ ప్లేట్‌ పగలగొడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: విదేశాల్లో ఫ్యామిలీతో చిరంజీవి హాలిడే ట్రిప్ - మెగా ఈవెంట్ కోసం సిద్ధమంటూ ట్వీట్