Brahmamudi Serial Today Episode: అప్పును పెళ్ళి చూపులకు రెడీ చేస్తారు ఇద్దరు అక్కలు. ఎంతో అందంగా రెడీ చేసినా అప్పు ఏంటిది చీ యాక్‌ నేనేంటి చీర కట్టుకోవడం ఏంటి? అంటూ ఇబ్బంది పడుతుంది. అయితే బంటిని పిలిద్దాం వాడు ఎలా ఉందో చెప్తాడు. అని బంటిని లోపలికి పిలుస్తారు. బంటి లోపలికి వచ్చి అటు ఇటు చూసి నవ్వుతాడు. దీంతో కోపంగా అప్పు నువ్వు ఇక్కణ్నుండి వెళ్లిపో అంటుంది.


స్వప్న: వాడంతా నవ్వుతున్నాడు కాబట్టి నాకు కూడా డౌట్‌గా ఉంది కావ్య.


కావ్య: కానీ మనం ఆడపిల్లను చూపిస్తామని చెప్పి అబ్బాయిని చూపించినట్టు అవుతుంది కదక్కా?


అప్పు: వచ్చినోళ్లు నచ్చితే నచ్చిండ్రు లేకపోతే లేదు. నేనైతే ప్యాంటు షర్టే వేసుకుంటా?


కావ్య: అప్పు అది కాదే?


అప్పు: అక్కా ఫ్లీజ్‌.. నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను ఎవరి కోసం మారను అలా అయితేనే పెళ్లి చూపులకు వస్తాను. లేదంటే లేదు.


కావ్య: సరే లేవే నువ్వు అలాగే ఉండు.


   అని చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలవుతుంటారు. మరోవైపు కళ్యాణ్‌ ఒంటరిగా కూర్చుని బాధపడుతుంటాడు. అప్పు కొనిచ్చిన జాకెట్‌ చూసి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంటాడు. ఇంతలో రాజ్ వచ్చి జాకెట్‌ తీసుకెళ్లి డస్ట్‌ బిన్‌లో వేస్తాడు. దీంతో పరుగెత్తుకెళ్లిన కళ్యాణ్‌ డస్ట్‌ బిన్‌లోంచి జాకెట్‌ తీసుకుంటాడు.


కళ్యాణ్‌: ఏంటన్నయా నువ్వు చేసిన పని..  ఇది నాకు ఎంత ఇష్టమో తెలుసా?


రాజ్: కానీ పాతది అయిపోయింది కదరా?


కళ్యాణ్‌: అన్నయ్యా.. పాతవి అయిపోయినా కొన్ని జ్ఞాపకంగా అలాగే మిగిలిపోతాయి అన్నయ్యా!


రాజ్: అప్పు మీద నువ్వు లోపల దాచుకున్న నీ ప్రేమలాగా? రేయ్‌ నిన్ను కొన్ని రోజులుగా అబ్జర్వ్‌ చేస్తూనే ఉన్నాను. నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నువ్వెందుకో అప్పును ప్రేమిస్తున్నావు అనిపిస్తుంది. నిజం చెప్పరా అప్పును నువ్వు ఇష్టపడుతున్నావా? నీ మనసులో మాట ఏంటో చెప్పరా.. స్నేహం ముసుగులో ప్రేమిస్తున్నావా? లేక ప్రేమిస్తూ కూడా అది కేవలం స్నేహం అనే భ్రమ పడుతున్నావా?


కళ్యాణ్‌: తెలియదు అన్నయ్యా


రాజ్‌: తెలియకపోవడం ఏంట్రా  నువ్వేమైనా చిన్న పిల్లాడివా?


కళ్యాణ్: అవును అన్నయ్యా  ఈ విషయంలో నేను చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నాను అనిపిస్తుంది. ఇందాకా నువ్వు అప్పుకు పెళ్లిచూపులు జరుగుతున్నాయి అన్నప్పుడు నాలో ఒక భయం పుట్టింది. ఒకవేళ తను శాశ్వతంగా దూరం అయిపోతుందన్న బాధ. ఏంటో ఒక్కటి మాత్రం నిజం. ఒకవేళ తను ఆ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే అదే జరగని.. నా మనసేం బాగా లేదన్నయ్యా.. రాత్రికి గెస్ట్‌ హౌస్‌ లోనే ఉంటాను అమ్మకు చెప్పు అన్నయ్యా


   అని కళ్యాణ్‌ వెళ్లిపోతాడు. పైనుంచి మొత్తం విన్న రుద్రాణి ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. వెంటనే ఈ విషయం ధాన్యలక్ష్మికి చెప్పాలని వెళ్తుంది. మరోవైపు మూర్తి ఇంటికి పెళ్లి వారు వస్తారు. అప్పు మాములుగానే ప్యాంటు షర్టులో పెళ్లిచూపులకు వస్తుంది. కనకం కంగారుపడుతుంది.  పెళ్లి కొడుకు ఎవరి ఇష్టం వాళ్లది. అప్పు తన లాగే ఉండాలనుకోవడం తప్పే కాదు అంటాడు. పైగా అనామిక వేసిన కేసు గురించి తెలుసని.. మహిళా మండలి అధ్యక్షురాలు మా బంధువేనని ఆ విషయలో నాకు అన్ని నిజాలు చెప్పిందని అనడంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో పెళ్లికొడుకు నేను మీకు నచ్చడం కాదు అప్పుకు కూడా నేను నచ్చాలి కదా అనగానే అప్పు మా అమ్మానాన్నల ఇష్టమే నా ఇష్టం మా అక్కలు ఏం చెప్పినా నాకు ఇష్టమే అని లోపలికి వెళ్లిపోతుంది. అందరూ మాట్లాడుకుని ఏకంగా పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ:  ‘ఇంద్ర’ విడుదలై 22 ఏళ్లు - మరోసారి థియేటర్లలో సందడి చేయనున్న సినిమా, రీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?