Jagadhatri Serial Today Episode: సుధాకర్ అన్ని ఆలోచిస్తూ స్ట్రెస్ కు గురై తల్లడిల్లుతుంటే కేదార్ వచ్చి సేవ్ చేస్తాడు. ఇంతలో ఇంట్లోంచి కౌషికి, ధాత్రి వస్తారు. ఇప్పుడెలా ఉందని అడుగుతారు. బాగానే ఉందని చెప్తారు. ఎదురుగా ఉన్న నిజాన్ని ఎక్కువ కాలం మోయకూడదని.. కంపెనీ సీఈవో అవ్వడానికి కేదార్ సుధాకర్ మామయ్య కొడుకు అని చెప్పకుండా దత్తత తీసుకుంటే సరిపోతుంది కదా అని చెప్తుంది ధాత్రి.
కౌషికి: థాంక్యూ జగధాత్రి. అన్ని సమస్యలకు ఒకటే సమాధానం ఇచ్చావు. కేదార్‌ను బాబాయ్ దత్తత తీసుకుంటే నువ్వు చెప్పినట్లు చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు.
సుధాకర్: సలహా బాగానే ఉంది కానీ దీనికి వైజయంతి, నిషిక వాళ్లు ఒప్పుకుంటారా? దత్తత కార్యక్రమాన్ని జరగనిస్తారా?
కౌషికి: అందరితో నేను మాట్లాడతాను. మనకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఎలాగైనా ఒప్పిద్దాం.
అని కౌషికి చెప్పగానే సుధాకర్ సరేనని చెప్పి ధాత్రికి థాంక్స్ చెప్పి వెళ్లిపోతాడు. ఇలాగైనా నా తమ్ముడు కేదార్‌కు న్యాయం చేసినట్లు అవుతుంది అని మనసులో అనుకుంటుంది కౌషికి. అందరూ కలిసి లోపలికి వెళ్తారు. వైజయంతి, నిషిక వాళ్లను పిలిచి ఏం ఆలోచించారని కౌషికి అడుగుతుంది.
నిషిక: ఎన్నిసార్లు ఆలోచించినా మా నిర్ణయం మారదు వదిన. కేదార్ ఇంటి వారసుడిగా యువరాజ్ సీట్లో కూర్చోవడానికి ఒప్పుకోం వదిన
వైజయంతి: మాకు కొంచెం టైం ఇస్తే దీనికి వేరే మార్గం ఆలోచిస్తాము.
కౌషికి: మన దగ్గర టైం లేదు.వేరే మార్గము లేదు. అదే ఇక్కడ సమస్య కద పిన్ని.
నిషిక: మీ నాటకాలు ఇంక ఆపండి
కేదార్: నిషి ఎవరితో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా?
నిషి: సొంత తమ్ముడిని కాదని ఒక పరాయి వాడికి ఆస్థి ఇవ్వాలని చూస్తున్న ఒక స్వార్థపరురాలితో మాట్లాడుతున్నాను.
ధాత్రి: ఈ మాట అన్నది నువ్వు కాబట్టి ఆగుతున్నాను నిషిక. లేదంటే నిన్ను చంపినా కూడా తప్పు లేదు.
వైజయంతి: చంపెయ్ నువ్వు నా కోడలును చంపెయ్. ఆ జేడీ నా కొడుకును చంపేస్తుంది. మమ్మల్ని అందర్నీ చంపేయండి.
సురేష్: ఇన్ని సంవత్సరాలు సంతోషాలు, సుఖాలు అన్నీ పక్కన పెట్టి కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యం ఈ వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్.. అలాంటి దాన్ని కౌషికి తన చేతులారా నాశనం చేసుకుంటుందా?
వైజయంతి: కౌషికి తెలివైంది కద బాబు ఎందుకు నాశనం చేసుకుంటుంది. అయిపోతుంది అని మమ్మల్ని బయపెట్టి వాణ్ని సింహాసనం మీద ఎక్కించి పట్టాభిషేకం చేద్దాం అనుకుంటుంది.
నిషిక: చూడండి వదిన ఇంట్లో ఉన్న గొడవలు, సమస్యలు చాలు కొత్తవి సృష్టించకండి.
సుధాకర్: నిషి నువ్వు మాట్లాడాల్సినవి మేము వినాల్సినవి అన్ని అయిపోయాయా? ఇంకా కౌషికిని అనాల్సిన మాటలు ఉన్నాయంటే చెప్పు అయ్యాకనే మాట్లాడతా?
వైజయంతి: ఏంది బా మేమంతా కౌషికితో ఇట్లా మాట్లాడుతున్నాము అంటున్నావా?
సుధాకర్: కోపంలో ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు తెలియడం లేదు అంటున్నాను వైజయంతి. నేను ఈ సమస్య నుంచి బయటపడటానికి ఒక నిర్ణయం తీసుకున్నాను.
వైజయంతి: ఏంటా నిర్ణయం
సుధాకర్: నేను కేదార్‌ను దత్తత తీసుకుందామనుకుంటున్నాను.
అని సుధాకర్ చెప్పగానే వైజయంతి, కమలాకర్, నిషిక షాక్ అవుతారు. కేదార్, ధాత్రి, హ్యాపీగా ఫీలవుతారు. వైజయంతి, సుధాకర్‌ను నిలదీస్తుంది. ఇంతలో నిషిక కోపంగా వెళ్లి కేదార్ గళ్ల పట్టుకుని నీవల్లే ఇదంతా జరుగుతుందని నిలదీస్తుంది. దీంతో ధాత్రి, నిషికను కొడుతుంది. దీంతో నిషిక దత్తత తీసుకోండి కానీ బయటి వాళ్లను ఎవరినైనా తీసుకొండని చెప్తుంది. ఇంతలో సుధాకర్ రేపు పొద్దునే కేదార్ దత్తత కార్యక్రమం ఉంటుంది ఇదే ఫైనల్ అని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత నిషిక, యువరాజ్‌కు ఫోన్ చేసి ఇంట్లో జరిగిందంతా చెప్తారు. దత్తత ఆపడానికి ఏం చేయాలన్నా చేస్తానని యువరాజ్ చెప్తాడు. మరోవైపు ధాత్రి కూడా యువరాజ్ రేపు అందరి ముందుకు వస్తాడని కేదార్‌కు చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: అలియా భట్‌తో క్యూట్ సెల్ఫీ - ఆలస్యంగా ఫోటోలు షేర్ చేసిన సితార