Jagadhatri Serial Today Episode: ఇంటికి వచ్చిన కేదార్‌ను చూసి నిషిక షాక్ అవుతుంది. అందరినీ పిలస్తుంది. కేదార్ ను చూసి కౌషికి హ్యాపీగా ఫీలవుతుంది. అయితే ఒక హంతకుడితో కలిసి మేము ఉండలేమని నిషిక అంటుంది. దీంతో ధాత్రి కోపంగా నిషికను తిడుతుంది. నిషిక ఇంకో మాట మాట్లాడితే చెల్లివి అని కూడా చూడను అంటుంది. ఏం చేస్తావే చంపేస్తావా..? అయినా చంపడం నీకు మీ అమ్మకు.. మీ ఆయనకు పెద్ద తేలిక కాదు కదా అంటుంది. ఇంతలో బూచి వచ్చి చెల్లె్మ్మ హీరోయిన్‌తో చేసిన తప్పా.. హీరోయిన్ ను చంపిన తప్పా అంటాడు. రెండూ తప్పే అన్నయ్య అంటూ ఇంతకీ హీరోయిన్ ను ఎలా పడగొట్టావు అని నిషిక అడుగుతుంది. నేను అంటేనే ఇంత కోపం వస్తుందా..? ప్రపంచం మొత్తం ఇదే అంటుంది. అందరి నోళ్లు మూయిస్తావా.?
కేదార్: ప్రపంచం అంతా ఏమనుకుంటే నాకేంటి నిషి.. నా ప్రపంచం మొత్తం నా ధాత్రి. నా ధాత్రికి నా గురించి బెంగ బాధ తప్పా ఒక్క అనుమానం కనిపించలేదు నాకు.
ధాత్రి: కేదార్ తప్పు చేశాడని అన్న అందరితోటి కేదార్ తప్పు చేయలేదని నేను అనిపిస్తాను. ఆరోజు వీర తిలకం దిద్ది లోపలికి తీసుకొస్తాను. పద కేదార్.
సుధాకర్: ఒకప్పుడు నా కుటుంబమే నా బలం అనుకునే వాడిని కానీ ఇప్పుడు కుటుంబం నా బలం కాదు నా బలహీనత అని అర్థం అయింది. మనుషులను మనుషుల్లా చూడలేని మిమ్మల్ని చూస్తుంటే నాకు మతిపోతుంది. ఇంత కంటే దిగజారకండి.
అని చెప్పి సుధాకర్ వెళ్లిపోతాడు. రాత్రికి ధాత్రి కేక్ తీసుకొచ్చి కేదార్ ముందు పెడుతుంది. బెయిల్ వస్తేనే కేక్ తో సెలబ్రేట్ చేసుకోవాలా..? అని కేదార్ అడుగుతాడు. నిజంగా నీకు గుర్తు లేదా..? ఇవాళ స్పెషల్ ఏంటో..? అంటుంది. అవునని కేదార్ చెప్పగానే.. ఇవాళ డిసెంబర్ 26 అంటూ ప్లాష్ బ్యాక్ చెప్తుంది ధాత్రి.
కేదార్: ఆరోజు ఎన్నోన్నో అనుకుని వచ్చాను. కానీ నువ్వు నీ గొల్స్, ఎయిమ్స్ అనగానే ఏం చెప్పాలో అర్తం కాక సైలెంట్ అయిపోయాను. నాకు ఇంకా అర్తం కాలేదు. కానీ నువ్వు ఇవాళ కేక్ తెచ్చి ఏం చేయాలనుకుంటున్నావు.
ధాత్రి: అరే ఇక్కడ బ్రెయిన్ ఉందా..? బంకమట్టి ఉందా..?
కేదార్: మామూలుగా అయితే బ్రెయిన్ ఉంటుంది. అదేంటో కానీ నీ దగ్గరకు వచ్చాక నిన్ను చూడగానే.. బంకమట్టి అయిపోతుంది.
ధాత్రి: బ్యాడ్ జ్యోక్..
కేదార్: సరే ఇప్పటికైనా చెప్పు..
ధాత్రి: అంటే ఆరోజు నువ్వు ప్రపోజ్ చేసి ఉంటే మనిద్దరం ప్రేమించుకునేటోళ్లం కదా..? అంటే ఇవాళ మన లవ్ యానివర్స్ అయినట్టే కదా
కేదార్: అవును కదా..?
ధాత్రి: అందుకే యానివర్సరీ సెలబ్రేసన్ చేసుకుందామనే కేక్ తీసుకొచ్చాను.
కేదార్: అసలు ఇలాంటి ఐడియాలు నాకెందుకు రావు ధాత్రి.
ధాత్రి: చెప్పా కదా..? లవ్ ఓకే అయిన వెంటనే అబ్బాయిలు, అమ్మాయిలను లైట్ తీసుకుంటున్నారు. ఇక మనకి పెళ్లే అయిపోయింది. నువ్వు లైట్ తీసుకోకుండా ఎలా ఉంటావు.
కేదార్: నువ్వు నా లైఫ్‌కు వైఫ్ వి.. వెలుతురు ఇచ్చే లైట్ వి .. నిన్ను లైట్ ఎలా తీసుకుంటాను ధాత్రి.
ధాత్రి: ఏయ్ ఈ మాటలకు ఏం తక్కు వ లేదు. సరే రా కేక్ కట్ చేద్దాం.
అని ఇద్దరూ కేక్ కట్ చేసి హ్యాపీగా ఫీలవుతారు. కేక్ కట్ చేసి కేదార్‌కు తినిపిస్తుంది ధాత్రి.. ఇంతలో కేదార్ లేచి గట్టిగా హ్యాపీ యానివర్సరీ అంటాడు. మరోవైపు వాళ్ల మనశాంతి పోగోట్టి మనం ప్రశాంతంగా ఉందామంటే కాలం ఎలా మలుపు తిప్పిందో అంటుంది వైజయంతి. అయినా వదినకు ఈ సంతోషం ఎన్ని రోజలు అత్తయ్యా అని నిసిక అంటుంది. వాళ్లిద్దరి మాటలు ధాత్రి వింటుంది. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!