Jagadhatri  Serial Today Episode: సురేష్‌ కోసం దివ్యాంక ఇంటికి వచ్చిన ధాత్రి, కేదార్‌లను ఇంట్లోంచి వెళ్లండని తిడుతుంది దివ్యాంక. దీంతో ధాత్రి, కేదార్‌లు సురేష్‌ను కన్వీన్స్‌ చేస్తుంటారు. దివ్యాంక ఏదో చేసింది కాబట్టే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు మాకు అర్థం అయింది నిజం చెప్పు అని అడుగుతారు. సురేష్‌ దివ్యాంక తనతో తీసుకున్న ఫోటోలను గుర్తు చేసుకుంటాడు. మీరు ఇక్కడి నుంచి వెళ్లండి.. నేను ఎక్కడికి రాలేను అంటాడు. ఇంతలో కేదార్‌ కంగారుగా బావ కీర్తి కనబడటం లేదు.. అంటాడు. దీంతో సురేష్‌ కంగారుగా కీర్తి కనిపించడం లేదా..? అంటూ అయితే వెళ్దాం పదండి అంటూ వెళ్లబోతుంటే దివ్యాంక ఆపుతుంది.

సురేష్‌: నేను వెళ్లాలి దివ్యాంక..

దివ్యాంక: గంటలో మనకు ఫ్లైట్‌ ఉంది.

సురేష్‌: నీకు వాళ్లు ఏం చెప్తున్నారో అర్థం కావడం లేదా..? నేను వెళ్లాలి నా కూతురిని వెతుక్కోవాలి.

దివ్యాంక: సురేష్‌ ఆ పిల్లను  వెతకడానికి ఆ ఇంట్లో చాలా మంది ఉన్నారు. నువ్వు వెళ్లి చేయడానికి అక్కడేమీ లేదు. మనం వెళ్లాలి పద..

సురేష్‌: నాకు నా కూతురు సేఫ్‌గా నా కళ్ల ముందు కనిపించే వరకు నేను ఎక్కడికి రాను.

దివ్యాంక: సురేష్‌ నవ్వు నాకు కాబోయే భర్తవు.. ఇలా అడ్డమైన వాళ్లు వచ్చి కనిపించడం లేదని నన్ను కాదని వెళితే నేను చూస్తూ ఊరుకోను..

సురేష్‌: చంపేస్తా.. ఇంకోసారి నా భార్యను నా కూతురిని అడ్డమైన వాళ్లు అన్నావంటే చంపేస్తా.. తాగిన మైకంతో నేను చేసిన తప్పుకు ఇంత శిక్ష వేస్తావని అనుకోలేదు. నావల్ల వచ్చిన నీ కడుపును అడ్డు పెట్టుకుని ఇంకెంత మంది బాధకు కారణం అవుతావు.

ధాత్రి: ఏంటి అన్నయ్యా మీరు చెప్తుంది నిజమా..?

కేదార్‌: ఇందుకా.. ఇన్ని రోజులు అందరికీ దూరంగా ఉన్నావు. అక్కతో దూరంగా ఉన్నావు..

సురేష్‌: కౌషికి వరకైతే నేను వద్దనుకున్నా దివ్యాంక. కానీ నా బిడ్డ వరకు వస్తే నేను ఊరుకోను..

దివ్యాంక: ఏంటి సురేష్‌ ఏదో మైకంలో  అలా అన్నాను…పద ఇద్దరం వెళ్లి వెతుకుదాం

అని అందరూ వెళ్లబోతుంటే.. ఇంతలో అక్కడికి కౌషికి, దివ్యాంక వాళ్ల అమ్మా వస్తారు. వాళ్లిద్దరిని చూసిన దివ్యాంక షాక్‌ అవుతుంది. నిజం తెలుసుకున్న దివ్యాంక వాళ్ల అమ్మ కోపంగా తిడుతుంది.  దీంతో దివ్యాంక కోపంగా ధాత్రిని తిడుతుంది. నేను తల్లి అవడం.. సురేష్‌తో కలవడం అంతా అబద్దం అని చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. సురేష్‌ కోపంగా దివ్యాంకను తిడతాడు. ఎందుకు అబద్దం చెప్పావు అని అడుగుతాడు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను చెప్పిన అబద్దం అది అంటుంది. దీంతో సురేష్‌ బాధగా కౌషికికి సారీ చెప్తాడు. సారీ వద్దని నువ్వు అడిగిన విడాకులు కూడా ఇస్తానని వెళ్లిపోతుంది కౌషికి. దివ్యాంక వాళ్ల ఇంట్లో జరిగిన విషయం నిషికకు తెలిసిపోతుంది.

వైజయంతి: ఎట్టా..? మనం నెలంతా కష్టపడి ఇద్దరినీ విడగొడతామా..? వాళ్లిద్దరూ పోయి ఒక్క రోజులో వాళ్లిద్దరినీ కలుపాతారా..?

కాచి: అసలు ఆ జగధాత్రి వాళ్లకు ఏ మాత్రం మనస్సాక్షి ఉన్నా.. మన కష్టానికి ప్రతిఫలం ఒక్కసారైనా దక్కనిస్తారు.

వైజయంతి: అమ్మా కాచి ఇక నా వల్ల కాదు. ఈ జగధాత్రి, కౌషికి కలిసి ఉన్నన్ని రోజులు వాళ్లను మనం ఏమీ చేయలేము. నేను ఓటమి ఒప్పుకుంటా..?

కాచి: మనం ఏ ప్లాన్‌ చేసినా తిరిగి అది మన మెడకే చుట్టుకుంటుంది.

వైజయంతి: ఏందమ్మీ నిషి నువ్వు ఏమీ మాట్లాడటం లేదేంటి..?

నిషిక: వదిన, అన్నయ్య కలవకుండా ఉండటానికి మళ్లీ ప్లాన్‌ చేస్తున్నాను

అని నిషిక తన ప్లాన్‌ చెప్తుంది. వాళ్లిద్దరి మధ్య ఉన్న దూరాన్ని పెంచి బంధాన్ని తెంటేయాలని అంటుంది. ఈసారి మన ప్లాన్‌ జగధాత్రి, కేదార్‌ మాత్రమే కాదు ఎవ్వరూ కూడా వాళ్లను కలపలేరు అంటుంది నిషిక.  దీంతో  ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!