Jagadhatri Serial Today Episode: కాచి, బూచి కిచెన్‌లోకి వెళ్లి మొత్తం పెంట పెంట చేస్తారు. అప్పుడే కిచెన్‌లోకి వచ్చిన ధాత్రి ఏంటి ఇలా చేశారు అని అడిగితే కాఫీ, స్నాక్స్ చేసుకున్నామని నిషిక చెప్తుంది. ఏంటి కాఫీ, స్నాక్స్ కే ఇంత చేశారా అని ఆశ్చర్యపోతుంది. రాత్రి ఎవరు బోజనం చేయరు అందరికీ చపాతీ చేయండి అని చెప్పి వెళ్లిపోతుంది నిషిక.
కేదార్: మీ చెల్లిని.. మా చెల్లిని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టొచ్చు..
ధాత్రి: ఎప్పుడూ చేయని పని కదా..?
కేదార్: అప్పుడప్పుడు చూపించాలి ఇంక..
అంటూ కేదార్ క్లీన్ చేయబోతుంటే..
ధాత్రి: ఏయ్ ఏం చేస్తున్నావు..
కేదార్: క్లీనింగ్ చేస్తాను..
ధాత్రి: నువ్వు వెళ్లి హాల్లో కూర్చుని టీవీ చూస్తుండు.. నేను వీటిని క్లీన్ చేసి అరగంటలో వంట చేస్తా..
కేదార్: టీవీ చూసే వాళ్లు చాలా మంది ఉన్నారులే.. ఇద్దరం కలిసి క్లీన్ చేసి వంట చేద్దాం.
ధాత్రి: ఏమీ వద్దు నువ్వు వెళ్లు నేను చూసుకుంటాను.
కేదార్: నాభార్య ఇక్కడ ఒక్కతే కష్టపడుతుందని తెలిసి కూడా నేను వెళ్లి ఎలా కూర్చోను.
ధాత్రి: ఇది నాకు కష్టం కాదు.. ఇష్టం.. అందరికి ఏం కావాలో వండిపెట్టడం.. నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవడం నాకు ఇష్టం.
కేదార్: అలాగే నా భార్యకు ఇష్టమైన పనుల్లో నేను పాలు పంచుకోవడం నాకు ఇష్టం.
ధాత్రి: సరే..అయితే రా..
అంటూ ఇద్దరూ కలిసి కిచెన్ మొత్తం క్లీన్ చేస్తారు. తర్వాత ఇద్దరూ కలిసే చపాతీలు చేస్తుంటారు. మరోవైపు ఆఫీసును మేనేజర్ వచ్చి కౌషికితో షేర్స్ గురించి మాట్లాడుతుంటాడు.
మేనేజర్: రావు గారు మన షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి షేర్స్ అన్ని కొనే ఆలోచనలో ఉన్నట్టు ఆయన పీఏ చెప్పారు మేడం.
కౌషికి: అదే జరిగితే మన కంపెనీలో 70శాతం షేర్స్ రావు చేతుల్లోకి వెళ్లిపోతాయి. అప్పుడిక కంపెనీ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. మేనేజర్ గారు ఈ కంపెనీలో ఇటుక ఇటుక పేర్చుకుంటూ వచ్చింది ఇలా ఒకరి చేతుల్లో పెట్టడానికి కాదు. షేర్స్ రావు గారు కొనడానికి వీల్లేదు. దానికి మనం ఏం చేయాలో చెప్పండి.
మేనేజర్: ఏముంది మేడం.. రావు గారు ఆఫర్ చేసిన దానికంటే మనం ఎక్కువ ఇస్తామంటే మనకే అమ్ముతారు.
కౌషికి: అన్ని షేర్స్ కొనాలంటే 25 కోట్లు కావాలి. ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే..
మేనేజర్: మేడం మనుక ఇంకా రెండు రోజులే ఉన్నాయి.
కౌషికి: గచ్చిబౌలి దగ్గర నా లాండ్ ఒకటి ఉంది. అది 30 కోట్లు వ్యాల్యూ చేస్తుంది. అర్జెంట్ మనీ కావాలని 25 కోట్లకు ఇచ్చేదాం అది చూడండి
మేనేజర్: సరే మేడం..
అంటూ మేనేజర్ వెళ్లిపోతాడు. అప్పుడే పై నుంచి వస్తున్న యువరాజ్, నిషిక మేనేజర్‌ను చూసి ఇంత రాత్రి పూట వచ్చాడంటే ఏదో ముఖ్యమైన విషయమే అయ్యుంటుంది అనుకుంటారు. అక్కనే అడుగుతానని యువరాజ్ అంటాడు. తర్వాత ఫోన్ మాట్లాడుకుంటూ ఒంటరిగా వెళ్తున్న కేదార్‌ను తన మనుషులతో వచ్చి కొట్టి వెళ్లిపోతాడు యువరాజ్. యువరాజ్‌ను చూసిన కేదార్ ఇంటికి వచ్చి యువరాజ్‌కు పాలు తీసుకెళ్లి గొంతు పట్టుకుని కొడతాడు. పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం నేరం అంటూ వార్నింగ్ ఇస్తాడు. రమ్య, ధాత్రికి ఫోన్ చేసి హీరోయిన్ మేనేజర్‌ను ఫైండ్ అవుట్ చేశామని చెప్తుంది. ధాత్రి, కేదార్ వెంటనే వెళ్లాలని బయలుదేరుతారు. లాండ్ అమ్మకం విషయంలో చిన్న ప్రాబ్లమ్ ఉందని లాయర్ చెప్పగానే కౌసికి ఆలోచనలో పడుతుంది. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!