Jagadhatri  Serial Today Episode:  యువరాజ్‌, వైజయంతి రూంలో కేదార్‌ గురించి మాట్లాడుకుంటుంటారు. కేదార్‌ ఇంటి వారసుడని యువరాజ్‌, వైజయంతికి చెప్పగానే వైజయంతి ఏడుస్తుంది. ఈ నిజాన్ని బయటకు తెలియకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని యువరాజ్‌కు చెప్తుంది వైజయంతి. ముఖ్యంగా నిషికకు నిజం తెలిస్తే తను వెళ్లిపోతుందని భయపడుతుంది వైజయంతి. ఇంతలో నిషిక రూంలోకి వచ్చి ఏంటి అత్తయ్య నాకు తెలియకూడదని చెప్తున్నారు అని అడగ్గానే వైజయంతి, యువరాజ్‌ షాక్‌ అవుతారు. తర్వాత వైజయంతి, యువరాజ్‌  సిగరెట్లు తాగుతున్నాడు. అది నీకు తెలిస్తే బాధపడతావని.. చెప్తున్నాను అంటుంది. నిషిక సరేలే ఇక నుంచి తాగనని మాటిచ్చాడు కదా? అంటుంది. అవునని వైజయంతి నిషిక నమ్మేసింది అని మనసులో అనుకుంటుంది. నిషిక కూడా మీరేదో నాకు తెలియకుండా దాస్తున్నారు అని మనసులో అనుకుంటుంది. తర్వాత అందరూ టిఫిన్‌ చేస్తుంటారు. కేదార్ ఒక్కడు ఒకచోట కూర్చుని సుధాకర్‌ గురించి ఆలోచిస్తుంటాడు. ఇంతలో ధాత్రి వస్తుంది.


ధాత్రి: కేదార్‌ టిఫిన్‌ తినకుండా ఇక్కడ కూర్చున్నావేంటి?


కేదార్‌: ఆ చైర్‌లో కూర్చుని నవ్వుతూ అందరితో కలిసి టిఫిన్‌ చేయాల్సిన నాన్న, జైల్లో ఒంటరిగా నేరస్తుల మధ్య ఉంటున్నారు ధాత్రి. అది గుర్తొస్తే ఆకలి చచ్చిపోతుంది.


ధాత్రి: నీ బాధ నీ మనసుకు అర్థం అవుతుంది. కానీ కడుపుకు కాదు కదా? ఎలాగైనా తినేయాల్సిందే.


అంటూ ధాత్రి కేదార్‌ను తీసుకెళ్లి టిఫిన్‌ పెడుతుంది. దూరం నుంచి గమనిస్తున్న కౌషికి బాధగా వచ్చి టిఫిన్‌ చేస్తుంది.


ధాత్రి: కేదార్‌ నువ్వు తినడం మానేస్తే పరిస్థితులు చక్కబడతాయా చెప్పు


కేదార్‌: తినాలన్నా మనసు తిననివ్వడం లేదు ధాత్రి.


అంటూ కేదార్‌ లేచి వెళ్లిపోతుంటే కౌషికి కేదార్‌ చేతి పట్టుకుని ఎంత కష్టమున్నా తినడం నుంచి లేచి వెళ్లిపోకూడదని మా బాబాయ్‌ చెప్తుండేవాడు. అంటూ కౌషికి కేదార్‌కు తినిపిస్తుంది. ధాత్రి హ్యాపీగా ఫీలవుతుంది. యువరాజ్‌, నిషికి షాక్‌ అవుతారు.


నిషికి: అబ్బో  ఏ సంబంధం లేకపోయినా  సొంత తమ్ముడిలా ప్రేమ చూపిస్తున్నారు వదిన.


కౌషికి: ప్రేమ చూపించడానికి రక్త బంధమే కావాలా? ఆత్మబంధువు అయినా సరిపోతుంది.


యువరాజ్‌: రోజు రోజుకు వాడికి దగ్గరవుతూ చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అక్కా? (అంటూ మనసులో అనుకుంటాడు.)


ఇంతలో వైజయంతి పైనుంచి వస్తూ కౌషికి కేదార్‌కు తినిపించడం చూసి షాక్‌ అవుతుంది. కౌషికి కూడా నిజం తెలిసిపోయిందా? అనుకుంటూ కౌషికి దగ్గరకు వచ్చి మీ బాబాయి స్థానంలో మీ తమ్ముడు యువరాజ్‌ను కూర్చోబెడదాము.ఆయన ఆస్థులు యువరాజ్‌  పేరుమీద రాసి బిజినెస్‌లు  వాడికి అప్పజెబుదాము.. అని చెప్పడంతో కౌషికి బాంబు పేలుస్తుంది. యువరాజ్‌కు ఇంకా ట్రైనింగ్‌  పూర్తి కాలేదని చెప్తుంది. ఎలాగైనా యువరాజ్‌ను  సీఈవోను చేయాలనుకున్న వైజయంతి ప్లాన్‌ను కౌషికి  తిప్పికొడుతుంది. దీంతో అందరూ కోపంగా వెళ్లిపోతారు. నిషిక లోపలికి వెళ్లి బ్యాగ్‌  సర్దుకుంటుంది.


యువరాజ్‌: నిషి ఏం చేస్తున్నావు?


నిషిక: అలిగి మా ఇంటికి పోతున్నాను.


వైజయంతి: ఏందమ్మి ఆవేశంలో అరవాలి కానీ ఇట్టా అలిగి ఇంటికి పోతానంటే ఎట్టా


నిషిక: అరిచి గీపెట్టినా ఈ ఇంట్లో నా మాట వినేవాళ్లు కానీ నాకు విలువ ఇచ్చే వాళ్లు కానీ ఎవ్వరూ లేరత్తయ్యా


యువరాజ్‌: అందుకని మీ పుట్టింటికి వెళ్లిపోతావా?


నిషిక: వెళ్లకుండా రోజుకొకసారి అందరి ముందు  అవమానాలు పడమంటారా? మీ నాన్న గారి స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టడానికి ఆవిడకు ప్రాబ్లం ఏంటండి?


అంటూ నిషిక కోపంగా కౌషికిని తిడుతుంది. ఆవిడ దృష్టిలో అందరూ బానిసలే మార్పు రాదని తెలిసే ఈ ఇంట్లోంచి వెళ్లిపోతున్నాను. లేదంటే ఆయన పేరు మీద ఆస్థులు రాసి ఆయనను సీఈవో స్థానంలో కూర్చోబెడితేనే ఈ ఇంట్లో ఉంటాను అని నిషిక చెప్పడంతో ఇవాళ్టీ  ఎపిసోడ్‌ అయిపోతుంది.  


Also Read: ముత్యాల డ్రెస్​లో ముద్దుగా మెరిసిపోతున్న జాన్వీ కపూర్