Jagadhatri  Serial Today Episode:  మినిస్టర్‌ మర్డర్‌ జరిగిన రోజు ఏం జరిగిందో మొత్తం వివరిస్తుంది ప్రియ. తనకు ప్రెగ్నెసీ వచ్చిందని చెబితే అబార్షన్‌ చేయించుకోమని తనను కొట్టడంతో  తన బాయ్‌ ఫ్రెండ్‌ వచ్చి గొడవ చేశాడని. ఇద్దరికి జరిగిన పెనుగులాటలో  మినిస్టర్‌ కింద పడిపోయాడని ప్రియ చెప్తుంది. తర్వాత మేము అక్కడి నుంచి వచ్చేశామని, న్యూస్‌ లో  ఆయన చనిపోయిన విషయం తెలియడంతో మేము దేశం వదిలి పారిపోవాలనుకున్నట్లు చెప్తుంది ప్రియ. అదే టైం లో మీరు మా ఇంటికి వచ్చారనడంతో..


ధాత్రి: మీ ఇంట్లో చికెన్‌, మందు, మినిస్టర్‌ గారి షర్ట్‌ చూసినప్పుడే నీకు ఆయనకు సంబంధం ఉందని మాకు అర్థమైంది. అందర్ని మోసం చేసి మిరిద్దరు కలిసి ఉన్నారని మినిస్టర్‌ అనుకుంటే నువ్వు ఆయన్ని కూడా మోసం చేశావు.


కేదార్‌: మినిస్టర్‌ గారు చనిపోయింది మీ వల్ల కాదు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాం. మీరు చెప్పిందంతా మాకు స్టేట్‌మెంట్‌ ఇచ్చి వెళ్లండి. మాకు చెప్పకుండా సిటీ దాటి వెళ్లొద్దు. మాకు మళ్లీ ఏ అవసరం ఉన్నా పిలుస్తాం.


ధాత్రి: మీ ఇంటి ముందు ఇద్దరు కానిస్టేబుల్స్‌ ని కూడా అరెంజ్‌ చేస్తాం.  


  అని మినిస్టర్‌ గారి గురించి ఇంకా ఏమైనా తెలిస్తే చెప్పాలని అడగడంతో ప్రియ మినిస్టర్‌ గారి మొదటి భార్య, కొడుకు గురించి చెప్తుంది. దీంతో ధాత్రి, కేదార్‌ వాళ్లను  కూడా ఎంక్వైరీ చేయాలనుకుంటారు. మరోవైపు దివ్యాంక కారు దిగి కౌషికి నాతో పెట్టుకున్నావు నిన్ను దెబ్బ మీద దెబ్బ కొడతానని లోపలికి వస్తుంది. దివ్యాంకను చూసిన కౌషికి నిషికను పిలిచి తిడుతుంది. దివ్యాంకను ఎందుకు ఇంటికి పిలిచావని కోప్పడుతుంది. ధాత్రి కూడా కోప్పడుతుంది. దీంతో రేపు తనకు సురేష్‌కు ఎంగేజ్‌మెంట్‌ అని మీరందరూ తప్పకుండా రావాలని దివ్యాంక చెప్పడంతో కౌషికి, ధాత్రి, కేదార్‌ షాక్‌ అవుతారు. మిగతావాళ్లందరూ హ్యాపీగా ఫీలవుతారు. తన ఎంగేజ్‌మెంట్‌కు కౌషికి వస్తే.. మినిస్టర్‌ కు చెందిన పెన్‌డ్రైవ్‌ ఇస్తానని దివ్యాంక చెప్పడంతో కౌషికి వస్తానని చెప్తుంది.


దివ్యాంక: మీరందరూ తప్పకుండా రావాలి.


కేదార్‌: మా అక్క వస్తే మేము తప్పకుండా వస్తాము.


దివ్యాంక: అంటే కౌషికి రాకుంటే రారా? నాకోసం నన్ను కలవడానికి మా ఇంటికి రావొచ్చు కదా?


ధాత్రి: నిన్న కలవడానికి నీ ఇంటికి ఏదో ఒకరోజు వస్తాము దివ్యాంక. ఆరోజు మాత్రం నువ్వు లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేవు.


దివ్యాంక: అయితే ఆ రోజు కోసం నేను ఎదురుచూస్తుంటాను.


అంటూ చెప్పి దివ్యాంక వెళ్లిపోతుంది. తర్వాత వైజయంతి బిగ్గరగా అరుస్తూ నిద్ర లేస్తుంది. సుధాకర్‌ ను ఎవరో రౌడీలు కొట్టి చంపేసినట్లు కలగంటుంది. దీంతో అందరూ వచ్చి వైజయంతిని ఓదార్చి  పొద్దునే జైలుకు ములాఖత్‌ కు వెళ్దామని ధైర్యం చెప్పి వెళ్లిపోతారు. బయటకు వెళ్లిన కౌషికి మీనన్‌ చెప్పినట్లు వాడు బాబాయ్‌ని ఏమైనా చేస్తాడేమోనని బాధపడతుంది. ఇంతలో ధాత్రి, కేదార్‌ వస్తారు.


ధాత్రి: వదిన దేనికోసం అంత టెన్షన్‌ పడుతున్నారు. ఏమైనా జరిగిందా?


కేదార్‌: ఇవాళ అంతా కూడా అలాగే ఉన్నావు అక్క ఏమైంది.


కౌషికి: ఏమీ అవ్వలేదు. బాబాయ్‌ గురించే టెన్షన్‌గా ఉంది. ఇప్పుడు ఈ భయం తోడైంది. పొద్దునే బాబాయ్‌ని చూసేదాకా నా మనసు కుదుటపడదు. ఇప్పటికే చాలా లేట్‌ అయ్యింది వెళ్లి పడుకోండి.


కేదార్‌: అక్క దేనికో కంగారు పడుతుంది. కానీ మనకు చెప్పడం లేదు ధాత్రి.


ధాత్రి: వదినకు వచ్చిన ఆ చెప్పుకోలేని కష్టమెంటో మనం కనిపెట్టాలి కేదార్‌.


అని డిసీజన్‌ తీసుకుంటారు. మరునాటి ఉదయం అందరూ కలిసి జైలుకు వెళ్లి సుధాకర్‌ను కలుస్తారు. అయితే అందరూ మాట్లాడుతుంటే ధాత్రి మాత్రం సుధాకర్‌ పెదవికి గాయం అవ్వడం గమనించి పెదవికి ఏమైందని అడుగుతుంది. దీంతో ఇవాళ్టీ  ఎపిసోడ్‌ అయిపోతుంది.  


Also Read: మార్చి 23న మమ్ముట్టి 'భ్రమయుగం' తెలుగు వెర్షన్‌ - టికెట్‌ ధరలపై మేకర్స్‌ కీలక నిర్ణయం?