Jagadhatri  Serial Today Episode :  ఆ దొంగోణ్ని వెంటనే పోలీసులకు  పట్టిద్దామని అనబోయి వెంటనే ఆపేస్తుంది వైజయంతి. దీంతో ధాత్రి ఏంటత్తయ్యా ఆపేశారు. ఇందాకా పాత సినిమాల్లో విలన్‌ లాగా ఓ విజృంభించేశారు. ఇప్పుడు మాత్రం మూకీ సినిమా చూపిస్తున్నారు అని అడుగుతుంది.

నిషిక: ఏయ్‌ ఏం మాట్లాడుతున్నావే.. ఆత్మ నగలు కొట్టేసిందని మేము ఎప్పుడు చెప్పాము.

కేదార్‌: మరి మామయ్య నగలు కొట్టేశాడు అనగానే ఎందుకు వెతుక్కోవడానికి వెళ్లావు. నగలు కనిపించకపోయే సరికి పోలీస్‌ కంప్లైంట్‌ ఎందుకు ఇవ్వాలనుకున్నారు.

ధాత్రి: మేము ఆ విషయం చెప్పగానే.. ఆత్మలు నగలు ఎలా కొట్టేస్తాయే తింగరి దానా అనాలి కదా..? మీరందరూ డైలాగ్‌ చెప్పగానే యాక్షన్‌లోకి ఎందుకు దిగారు.

కేదార్: అక్క చెప్తుంది నిజమని నమ్మినా ఇప్పటిదాకా అసలు అది ఎలా సాధ్యం అని మాకు అంతు పట్టలేదు. కానీ ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చింది.

ధాత్రి: నిషి నీ నగలు ఎక్కడికి పోలేదు పక్క కప్‌బోర్డులోనే ఉన్నాయి వెళ్లి చూడు.

అని చెప్పగానే.. నిషిక లోపలికి వెళ్లి చూస్తుంది. నగలు అన్ని అక్కడే ఉంటాయి. యువరాజ్‌, వైజయంతి కూడా లోపలికి వెళ్తారు. పరంధామయ్య గెటప్‌లో ఉన్న వ్యక్తిని పట్టుకోవాలని అనుకుంటారు. తర్వాత సాధుతో కలిసి ఐజీని కలుస్తారు ధాత్రి, కేదార్‌. ఐజీ వాళ్ల అమ్మ  ధాత్రి, కేదార్‌లతో  పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంది.

ఐజీ: మా అమ్మ నిన్ను మనవడా అన్నందుకు నువ్వు షాక్‌ అయ్యావా..?

కేదార్‌: అలాంటిదేం లేదు సార్‌..

ధాత్రి: కొంచెం అయ్యాము సార్‌.. అసలు పెళ్లి అయిందా అని ఎందుకు అడిగారో ఆ తర్వాత ఆ స్మైల్‌ ఎందుకు ఇచ్చారో అసలు అర్థం కాలేదు.

ఐజీ: మా ఇంట్లో పెళ్లీడుకు వచ్చిన అమ్మాయి ఉది కదా..?  ఈడు జోడు బాగుంది అనిపిస్తే వెంటనే వరసలు కలిపేస్తుంది మా అమ్మ..

కేదార్‌ సిగ్గు పడుతుంటాడు.

కేదార్‌: ఓ మీకు అమ్మాయి ఉందా సార్‌..

ఐజీ: ఉంది.. ఐపీఎస్‌ కంప్లీట్‌ చేసింది. ఫీల్డ్‌ ట్రైనింగ్ కోసం మీ టీం లోనే జాయిన్‌ చేద్దామనుకున్నాను.

కేదార్: సూపర్‌ సార్‌..

సాధు: దాని గురించి కూడా మాట్లాడదామనుకున్నాను సార్‌.

కేదార్‌: ఏమైంది…?

ధాత్రి: మీకు అమ్మాయి ఉందా అని అంత క్యూరియస్‌గా అడిగావేంటి..?

కేదార్‌: నేనేదో క్యాజువల్‌గా అడిగా.

ధాత్రి: క్యాజువల్‌గా కాదు. క్యూరియస్‌గా క్లారిటీ తెచ్చుకోవడానికి అడిగినట్టు ఉంది. బయటకు వెళ్లాక క్లారిటీ ఇవ్వలేదనుకో మన టీంలో ట్వంటీ ట్వంటీ ఆడేస్తా..

కేదార్‌: అమ్మో నా ఫీచర్‌ బ్రైట్‌గా ఉంటుంది అనుకుంటే చాలా భయంకరంగా ఉండేలా ఉంది.

అని మనసులో అనుకుంటాడు కేదార్‌. ఇంతలో ఐజీ కూతురును వాళ్ల బామ్మ వెళ్లి నిద్ర లేపుతుంది. ఓసేయ్‌ మొద్దు ఇంత పొద్దు పోయే వరకు పడుకుంటే పోలీస్‌ ఎలా అవుతావే అని తిడుతుంది. పొద్దు పోయే వరకు పడుకుంటే పోలీస్‌ కాలేమా.. అంటుంది ఐజీ కూతురు. దీంతో బామ్మ కింద ఒక అబ్బాయి వచ్చాడు. చాలా పొడుగ్గా అందంగా ఉన్నాడు. పోలీస్‌ అంట పైగా పెళ్లి కూడా కాలేదంట అని చెప్తుంది. కింద కేసు గురించి మాట్లాడిన తర్వాత ఫైల్‌ గురించి అడిగితే పైన నా రూంలో ఉంది అని చెప్తాడు ఐజీ. ఫైల్‌ కోసం పైకి రూంలోకి వెళ్తాడు కేదార్‌. అప్పుడే నిద్ర లేచిన ఐజీ కూతురు కళ్లు మూసుకుని నడుచుకుంటూ వస్తూ.. ఎదురుగా వచ్చిన కేదార్‌ను పట్టుకుని అబ్బా వచ్చేశారా డాడ్‌ అని  ముద్దు పెడుతుంది. వెంటనే కళ్లు తెరచి చూసి షాక్ అవుతుంది. ఏయ్‌ ఎవరు నువ్వు అంటూ కేదార్‌ను తోసేయబోయి తానే కింద పడబోతుంది. కేదార్‌ అమ్మాయిని పట్టుకుంటాడు. అప్పుడే పైకి వచ్చిన ధాత్రి మరీ వదిలేయలేనంత గట్టిగా పట్టుకోవలసిన అవసరం లేదు అంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!