Jagadhatri Serial Today Episode: టీవీలో కావ్య గురించి బాడ్ న్యూస్ వస్తుంది. అది చూసిన నిషిక జగధాత్రిని తిడుతుంది. విషం కక్కే పాము పిల్లలు కూడా విషం కక్కుతాయే కానీ పాలు ఇస్తాయా..? అంటూ తిడుతుంది. రేపు రోడ్డు మీద వెళ్తుంటే అందరూ దేశద్రోహి కూతురు మీ ఇంట్లో ఉందట కదా అని అడిగితే ఏం చెప్తాం అంటుంది. దీంతో సుధాకర్ కోపంగా నిషికను తిడతాడు. జగధాత్రి మనకేం ద్రోహం చేసింది అంటూ నిషికను తిట్టగానే నిషిక కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ఒంటరిగా కూర్చున్న ధాత్రి టీవీలో వచ్చిన న్యూస్ గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది.
ధాత్రి: మా అమ్మ చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఇంకా అవమానాలు పడుతూనే ఉంది. ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పులు మర్చిపోయే వరకు అవమానాలు పడతారు. మా అమ్మ మాత్రం ఏ తప్పు చేయకపోయినా.. ప్రాణాలతో మనుషుల మధ్య లేకపోయినా ఇంకా అవమానాలు ఎదుర్కొంటూనే ఉంది. ఏ డిపార్టమెంట్ అయితే మా అమ్మను అవమానిస్తుందో అదే డిపార్ట్‌మెంట్ మొత్తం మా అమ్మకు సెల్యూట్ కొట్టేలా చేయాలి.
కేదార్: మనం అదే పనిలో ఉన్నాం కదా ధాత్రి. త్వరలోనే మీ అమ్మగారి సిన్సియారిటీని నిరూపిద్దాం. నిజం నిప్పు లాంటిది ధాత్రి. ఎవరు దాయాలనుకున్నా దాగదు. బయటకు వస్తుంది. ఆరోజు అవమానించిన నోళ్లన్నీ పొగడ్తలతో ముంచెత్తుతాయి.
ధాత్రి: ఆ రోజు తొందరలోనే వస్తుంది కేదార్.
కేదార్: చాన్స్ దొరికింది కదాని అనేశారు. వాళ్లు తప్పు చేయకపోరు మనకు దొరక్కపోరు.
అని కేదార్ చెప్పగానే ధాత్రి ఆలోచిస్తుంది. మరోవైపు కౌషికి ఫోన్‌కు తన అకౌంట్ నుంచి కోటి రూపాయలు డెబిట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. అది చూసిన కౌషికి బ్యాంకు కు ఫోన్ చేసి అడుగుతుంది. మీ చెక్ నుంచే డ్రా అయిందని చెప్తారు. వెంటనే చెక్ బుక్ చూసి.. నిషిక చెప్పిన మాటలు గుర్తు చేసుకుని బయటకు వచ్చి నిషికను కోపంగా గట్టిగా పిలుస్తుంది.
సుధాకర్: ఏంటమ్మా కౌషి ఏమైంది…
వైజయంతి: ఏమై ఉండాదమ్మీ అట్టా అరుస్తా ఉండావు..
కౌషికి: నిషిక నా చెక్ బుక్ లోంచి చెక్ చింపుకుంది. నా సంతకం ఫోర్జరీ చేసి ఆ ఆక్షన్‌కు వెళ్లింది పిన్ని.
నిషిక: ఏం మాట్లాడుతున్నావు వదిన
కౌషికి: అవును నువ్వు నా చెక్ తీసుకుని ఆక్షన్‌కు వెళ్లావు.
యువరాజ్: నీ రూంలో ఉన్న చెక్ ఎలా తీసుకుంటుంది అక్కా.. నీ సంతకాన్ని ఫోర్జరీ ఎలా చేస్తుంది. అసలు నిషిక తన సంతకాన్నే ఒకసారి చేసినట్టు మరోసారి చేయదు.
వైజయంతి: నాకు తెలియకుండా నిషిక అడుగు కూడా బయట పెట్టదు. అటువంటిది వేలం పాట దగ్గరకు ఎలా వెళ్తుంది అమ్మీ. నువ్వే ఎవరికైనా ఇచ్చావేమో చూడు.
కౌషికి: పిన్ని నేను అన్ని క్రాస్ చెక్ చేసుకునే నిషికను అడుగుతున్నాను.
నిషిక: ఊరికో నన్ను ఎందుకు అనుమానిస్తున్నారు వదిన. ఆ చెక్కును జగధాత్రి తీసి ఉండొచ్చు కదా..?
వైజయంతి: తీసినా తీసి ఉండొచ్చు ఎంతైనా దొంగ కూతురు కదా..? ఆ లక్షణాలు యాడికి పోతాయి.
యువరాజ్: అవును అక్కా ఉదయం నుంచి వాళ్లు కూడా ఇంట్లో లేరు కదా.. ఆ చెక్కును వాళ్లే తీసుకుని వెళ్లి ఉండొచ్చు కదా..?
కేదార్: అవునక్కా యువరాజ్ చెప్పింది కరేక్టే.. మేము కూడా ఉదయం నుంచి ఇంట్లో లేము.. ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లాము. ఆ పని కూడా మీ దగ్గర మిస్సయిన చెక్ గురించే
అని కేదార్ తన ఫోన్ లో ఉన్న వీడియోలను ఫోటోలను కౌషికికి చూపిస్తాడు. అవి చూసిన కౌషికి కోపంగా నిషికను కొడుతుంది. సొంత ఇంట్లో దొంగతనం చేస్తారా..? అంటూ తిడుతుంది కౌషికి. దీంతో నిషికను కొట్టే హక్కు నీకు లేదని వైజయంతి అంటుంది. దీంతో వైజయంతిని సుధాకర్ తిడతాడు. తర్వాత జగధాత్రి నిషిక, వైజయంతిలను మిమ్మల్ని ఏమనాలి.. దొంగలనాలా..? మోసగాళ్లు అనాలా అంటూ తిడుతుంది. తర్వాత కావ్య కేసు గురించి కేదార్, జగధాత్రి ఆలోచిస్తారు. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!