Jagadhatri  Serial Today Episode:  కావ్య ఫోటో చూడగానే హోంమంత్రికి ప్లాష్‌బ్లాక్‌ గుర్తుకు వస్తుంది. లోపల భయపడుతూనే.. బయటకు ఈవిడ ఎప్పుడో చనిపోయింది కదా..? అని అడుగుతాడు. దీంతో జేడీ చనిపోలేదని ఎవరో చంపేశారని చెప్తుంది. చంపలేదని త్రిపాఠి చెప్తాడు. దేశద్రోహం చేసి చనిపోయింది అంటాడు. దీంతో అబద్దం సార్‌ అంటూ అవన్నీ కట్టుకథలు అసలైన కథ వేరే ఉంది సార్‌ అది కూడా మా ఇన్వెస్టిగేషన్‌ లో తేలిందని జేడీ చెప్పడంతో హోంమంత్రి భయపడతాడు. ఆధారాలు ఏమైనా దొరికాయా అని అడుగుతాడు. దొరికాయని జేడీ ఒక ఫోటో చూపిస్తుంది. అది చూసిన మంత్రి ఇంకాస్త భయంతో వణికిపోతాడు.


మంత్రి బామర్ధి: బావా నీ ఫోన్‌ స్క్రీన్‌ మీద ఉన్న ఫోటో అక్కడ డిసిప్లే మీద వస్తుందేంటి..?


మంత్రి: నువ్వు ముందు బయటకు వెళ్లరా…


జేడీ: ఈ కేసులో ప్రధాన నిందితుడి ఫోటో సార్‌ ఇది. ఇతనికి కావ్య మేడం చావుతో పాటు  ప్రొఫెసర్‌ చావుతో కూడా సంబంధం ఉంది సార్‌. ఇతన్ని మనం పట్టుకుంటే కావ్య మేడంకు మనం న్యాయం చేయోచ్చు సార్‌.


మంత్రి: గుడ్‌ చాలా బాగా ఇన్వెస్టిగేషన్‌ చేశారు. కానీ మీరు చెప్పిది మీ వెర్షన్‌. కానీ నేను విన్నది ఇందాక త్రిపాఠి చెప్పింది నేను విన్నాను.


జేడీ: చెప్పాను కదా.. సార్‌ అదంతా కట్టుకథ అని..


మంత్రి: ఓకే చెప్పావు కదా..? ఇక నుంచి ఈ విషయం గురించి నేను ఆలోచిస్తాను. ఓకే గాయిస్‌.. పోలీసులు అంటే ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టి ఫ్రెండ్లీగా మెలగండి. మళ్లీ రిపబ్లిక్‌ డే రోజు కలుద్దాం. జేడీ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన కేసు గురించి వేలాడుతున్నావు. పైగా దాని గురించి ఎవ్వరూ కేసు పెట్టలేదు.


మంత్రి: ఏంటి నువ్వు కేసు పెడతావా..? నీకేం అవుతుంది ఆ సీఐ కావ్య.. క్లోజ్‌ అయిపోయిన కేసును మళ్లీ తోడి ప్రాణాల మీదకు తెచ్చుకోకు


 అంటూ మంత్రి వార్నింగ్‌ ఇస్తాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆయన వెళ్లిపోయాక ఈ కేసులో ఈ హోం మంత్రి కూడా ఉన్నాడేమో జేడీ అని కేదార్‌ అనుమానిస్తాడు. తర్వాత వైజయంతి, నిషిక పురాతన నగల వేలం పాట దగ్గరకు వెళ్తారు. మీర్జాపూర్‌ మహారాణి గారి నెక్లెస్‌ కోసం వేలంపాట పాడుతుంది. కోటి రూపాయలకు వేలం పాడి చెక్‌ ఇస్తుంది.  నగ తీసుకుని ఇంటికి వెళ్తుంది.


వైజయంతి: అయినా రాజుల కాలం నాటి నగలే నగలు..


నిషిక: కోటి రూపాయలు ఖర్చు పెట్టినా ఇంత నాణ్యమైన నగలను మనం తయారు చేయించుకోగలమా..? అత్తయ్యా..


వైజయంతి: నువ్వు చెప్తా ఉండాది అక్షర సత్యం అమ్మీ..


యువరాజ్‌: అందుకేనేమో ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్ అంటారు.


నిషిక: అత్తయ్యా ఎలా ఉంది.


వైజయంతి: అమ్మీ నిజంగా చెప్తున్నాను. ఈ నగలో నిన్ను చూస్తుంటే.. కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. ఓరే అబ్బోడా.. మీర్జాపూర్‌ యువరాణి గురించి వాళ్లు వీళ్లు అంటుంటే వినడమే కానీ చూడలేదు. ఇప్పుడు నిషికను చూస్తుంటే ఆమెనే గుర్తుకు వస్తుంది.


యువరాజ్‌: అవును నిషి ఈ నగలో చూస్తుంటే చాలా బాగున్నావు.


కాచి: పెద్దమ్మా త్వరగా కిందకు రండి ఆ జగధాత్రి వాళ్ల గురించి టీవీలో వస్తుంది.


టీవీలో కావ్య గురించి బాడ్‌గా వస్తుంది. పోలీసులు ఎలా ఉండకూడదో చూపించడానికి దొరికిన ఆణిముత్యమే ఈ కావ్య అనే పోలీస్‌ ఆఫీసర్‌ అని న్యూస్‌ వస్తుంది. అది చూసిన జగధాత్రి బాధపడుతుంది. వైజయంతి.. కావ్యను తిడుతూ అలాంటి దేహద్రోహి కూతురు మన ఇంట్లో ఉంది అంటే మనల్ని కూడా అట్టాగే చూస్తారు అంటుంది. కౌషికి కోపంగా వైజయంతిని తిడుతూ ఆవిడ తప్పు చేసి ఉంటే జగధాత్రిని నిందించడం ఏంటని ప్రశ్నిస్తుంది.  ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!