Jagadhatri Serial Today Episode: మీనన్ కోసం యువరాజ్, కమలాకర్ పని చేస్తున్నారని తెలిసి ధాత్రి, కేదార్ బాధపడతారు. యువరాజ్, కమలాకర్ ను మీనన్ మాయ నుంచి బయటకు తీసుకురావాలని ధాత్రి అంటుంది. అయితే ఇద్దరూ మీనన్ దగ్గర ఇష్టపడి పని చేస్తున్నారో.. లేక ఇరుక్కుపోయి పని చేస్తున్నారో తెలుసుకుంటేనే సమస్యకు సమాధానం వెతకగలం అంటాడు కేదార్. అయితే ముందు ఆ సమాధానాన్ని వెతకాలని మీనన్ నాశనం వజ్రపాటి వంశానికి శాపం కాకుడదని అంటుంది ధాత్రి. తర్వాత ధాత్రి, కేదార్ వచ్చి కౌషికిని ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అడగుతుంది. సురేష్ వచ్చి ఊరికి వెళ్దామన్నావు కదా? అంటాడు.
కౌషికి: సారీ సురేష్. వద్దామనే చాలా ట్రై చేస్తున్నాను. కానీ నా వల్ల కావడం లేదు. నేను రాలేను.
కేదార్: అదేంటక్కా అలా అంటున్నావు. వస్తామని చెప్పాము కదా. అత్తయ్య గారు ఎంతో ఆశతో ఇక్కడి నుంచి వెళ్లారు. ఇప్పుడు నువ్వు రావడం లేదంటే చాలా బాధపడతారు అక్క.
ధాత్రి: ఇప్పుడు మీరు వెళ్లకపోయినా ఫంక్షన్ జరుగుతుంది వదిన. మీకే నష్టమూ జరగదు కానీ మీరు లేని వెలితి, రాలేదన్న బాధ ఆదిలక్ష్మీ గారికి జీవితాంతం ఉంటుంది.
అంటూ అందరూ కలిసి కౌషికిని కన్వీన్స్ చేస్తారు. దీంతో కౌషికి వెళ్లడానికి ఒప్పుకుంటుంది. దీంతో వైజయంతి, నిషిక బాధపడతారు. రామచంద్రాపురం వెళ్లడానికి కౌషికి ఒప్పుకోవడంతో యువరాజ్, కమలాకర్ హ్యాపీగా ఫీలవుతారు. అక్కడ ఉన్న విగ్రహం కొట్టేయడానికి ఈజీగా ఉంటుందని ప్లాన్ చేస్తారు. దీంతో కమలాకర్, యువరాజ్ ఇద్దరూ అక్కతో పాటు మనందరం వెళ్తున్నాం అని చెప్పడంతో నిషిక వద్దని వారిస్తుంది. ధాత్రి మాత్రం అనుమానిస్తుంది. కౌషికి హ్యాపీగా ఫీలవుతుంది. నన్ను అర్థం చేసుకున్నందుకు థాంక్స్ చెప్తుంది. తర్వాత యువరాజ్, కమలాకర్, నిషిక, వైజయంతి పక్కకు వెళ్తారు. తర్వాత అందరూ కలిసి సురేష్ వాళ్ల ఇంటికి వెళ్తారు. ఇంటి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది కౌషికి. సురేష్ నచ్చజెప్పి కౌషికిని లోపలకి తీసుకెళ్తుంటే అందరూ లోపలికి వెళ్తుంటే పరంధామయ్య వచ్చి ఆగండి అంటూ కేకలేసి మీకు నా ఇంట్లోకి వచ్చే అర్హత లేదు. ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోండి. అంటూ తిడతాడు.
సురేష్: మీ అర్థం లేని కోపాల వల్లే విషయం ఇంతదూరం వచ్చింది.
పరంధామయ్య: నువ్వు నాకు పుట్టావా? నేను నీకు పుట్టానా? ఎలా ఉండాలో? ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నువ్వు మాట్లాడకు.
ఆదిలక్ష్మీ: ఏంటండి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన కోడలిని గుమ్మం బయటి నుంచే పొమ్మంటావా?
పరంధామయ్య: కోడలా? ఎవరు కోడలు..? ఎవరికి కోడలు? నా కొడుకుతో కలిసి ఉంటుందా? కాపురం చేస్తుందా? నాకు కోడలు అవ్వడానికి. ఎన్ని మాటలు అంది నన్ను. విన్న మీరు మర్చిపోయినా.. అన్న ఈ అమ్మాయి మర్చిపోయినా.. నేను మర్చిపోను.
కౌషికి: నేను అన్న మాట గుర్తున్న మీకు మీ నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ ఏం కోల్పోయిందో మర్చిపోయారా? మామయ్యగారు.
అంటూ కౌషికి నిలదీయడంతో పరంధామయ్య ఆ బిడ్డ ఇలా అవ్వడానికి కారణం నేను కాదు అంటాడు. దీంతో వైజయంతి భయపడుతుంది. కీర్తిని కిందపడేలా చేసింది గుర్తు చేసుకుంటుంది. నిషిక, వైజయంతి, ఆదిలక్ష్మీని తిడతారు. ఇంతలో ధాత్రి, పరంధామయ్యను కన్వీన్స్ చేయాలని చూస్తుంది. కౌషికి వెళ్లిపోతుంది. సురేష్ కడుపుతో ఉన్న కోడలిని ఇలా అవమానిస్తావా? నాన్నా అంటూ అనడంతో పరంధామయ్య సంతోషంగా నిజమా? నువ్వు తండ్రివి కాబోతున్నావా? ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడా? అంటూ అందరినీ ఇంట్లోకి రమ్మని పిలుస్తాడు. అందరూ లోపలికి వెళ్తారు. తర్వాత వైజయంతి, నిషిక ఎలాగైనా పరంధామయ్యా మళ్లీ కౌషికిని ఇంట్లోంచి వెళ్లగొట్టేలా చేయాలని ప్లాన్ చేస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: పొరపాటు దిద్దుకున్న 'మిస్టర్ బచ్చన్' టీం - సినిమా నిడివి తగ్గింపు...