Jagadhatri  Serial Today Episode: ఒక్క సంవత్సరంలోనే రెట్టింపు ఆదాయం వస్తుందని ఇంద్రాణి చెప్పగానే.. వైజయంతి షాక్‌ అవుతుంది. ఆశ్చర్యపోతుంది. నిషిక కూడా సంతోషంగా వెంటనే ఆ ఫ్యాక్టరీని కొనేద్దామని చెప్తుంది. ఒక్క సంవత్సరంలోనే నేను పెద్ద బిజినెస్‌ వుమన్‌ అయ్యానని అందరూ చెప్పుకోవాలి అంటుంది.

Continues below advertisement


కౌషికి: గొప్ప బిజినెస్‌ వుమన్‌ అని కాదు నిషి. డబ్బులు ఉన్నా.. బుద్ది లేక నష్టాల్లో ఉన్న కంపెనీలో డబ్బులు పెట్టి మోసపోయిందని మాట్లాడుకుంటారు.


వైజయంతి: ఏందమ్మీ కౌషికి శుభమాని కొత్త వ్యాపారం గురించి మాట్లాడతా ఉంటే నష్టపోతారని శాపనార్థాలు పెడతా ఉండావు.


యువరాజ్‌: చేసిన చాలెంజ్‌లో మేము గెలుస్తావేమోనన్న భయంతో ఆదిలోనే అంతం చేయాలని చూస్తున్నావా అక్కా..?


ధాత్రి: ఇలా వదిన మాటల్లో చెడును వెతికారు కాబట్టి. ఇవాళ వదిన పక్కన కాకుండా ఎదురుగా నిలబడాల్సి వచ్చింది.


కేదార్‌: అక్క మిమ్మల్ని ఓడించాలనుకోవట్లేదు. పడిపోకుండా కాపాడాలి అనుకుంటుంది. ఎప్పటికి అర్థం చేసుకుంటారు.


ధాత్రి: అయినా మీరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు యువరాజ్‌. కానీ అపార్థం మాత్రం చేసుకోకండి. మన మధ్య ఉన్న అపార్థాలే ఇలాంటి వాళ్లకు ఆయుధాలుగా మారతాయి.


నిషిక: ఏంటో మన అని మీతో కలిపేసుకుంటున్నారు. వదిన ఎన్నిసార్లు చెప్పినా..? మీరు ఎప్పుడు ఈ ఇంటికి పరాయి వాళ్లే..


వైజయంతి: వదిలేయ్‌ నిషి.. మనం పందెంలో గెలిచాక ఎవరు ఈ ఇంట్లో ఉండాలో ఎవరు ఉండకూదడో నిర్ణయించే పెత్తనం మన చేతికి వచ్చినాక మాట్లాడదాము.


నిషిక: మీరు కూర్చోండి ఇంద్రాణి గారు బిజినెస్‌ గురించి క్లియర్‌గా మాట్లాడదాము.


కౌషికి: చూడు ఇంద్రాణి నువ్వు తప్పు చేశావు. నేను బయట పెట్టాను. అది మనసులో పెట్టుకుని నా కుంటుంబంతో ఆటలాడాలని చూస్తే ఊరుకోను.


 అంటూ ఇంద్రాణికి వార్నింగ్ ఇస్తుంది కౌషిక. దీంతో నిషిక కోపంగా కౌషికిని తిడుతుంది. ఇద్దరి మధ్య గొడవ జరగుతుంది. దీంతో కౌషికి వాళ్లు ఇంద్రాణిని తీసుకుని తమ రూంలోకి వెళ్లిపోతారు.


కౌషికి: కళ్ల ముందు ఆ ఇంద్రాణి మోసం కనబడుతున్నా వాళ్లకు ఎందుకు కనిపించడం లేదో నాకు తెలియడం లేదు ధాత్రి.


ధాత్రి: బిజినెస్‌ అంటే ఒకరోజు ఒక రూంలో నలుగురు తీసుకునే నిర్ణయం కాదు కదా వదిన. ఆ ఇంద్రాణి మోసం వాళ్లు తెలిసేలా చేస్తే చాలు.


కేదార్‌: నాన్నను యువరాజ్‌తో మాట్లాడదామని చెబుదాం అక్కా.. మన మాట వినకపోయినా నాన్న మాట వింటాడు కదా..?


కౌషికి: అవును బాబాయ్‌ రాగానే యువరాజ్‌తో మాట్లాడమని చెప్పాలి.


అంటుంది. మరోవైపు ఇంద్రాణిని పైకి తీసుకెళ్లిన వైజయంతి వాళ్లు కౌషికి అలా మాట్లాడినందుకు సారీ చెప్తారు. అసలు కౌషికి ఎందుకు అడ్డు పడుతుందో తెలియడం లేదు. కానీ ఎలాగైనా అక్క మాటలు వినకూడదని యువరాజ్‌ డిసైడ్‌ అవుతాడు. అసలు డీల్‌ ఏంటని ఇంద్రాణిని అడుగుతారు.


ఇంద్రాణి: జేకే గారు చెప్పిన ఆఖరి ప్రైస్‌ పదమూడు కోట్లు..


యువరాజ్‌: పదమూడు కోట్లా..?


ఇంద్రాణి: అంతకంటే ఒక్క రూపాయి తక్కువ ఉన్నా ఫ్యాక్టరీ అమ్మను అని చెప్పారు. పైగా ఇంకా మనకు ఎక్కువ టైం కూడా లేదు. రెండు రోజుల్లో డీల్‌ ఫినిష్‌ చేయాలి.


నిషిక: పదమూడు కోట్లా..? మా దగ్గర పది కోట్లే ఉన్నాయని చెప్పాము కదా ఇంద్రాణి గారు.


ఇంద్రాణి: కరెక్టే నిషి కానీ మీరు మూడు కోట్లు అడ్జెస్ట్‌ చేయగలిగితే సంవత్సరంలో లాభాలు చూడొచ్చు.


అంటూ ఇంద్రాణి వాళ్లకు ఆశలు రేపుతుంది. మూడు కోట్ల కోసం కౌషికినే సాయం అడుగుదామని వైజయంతి చెప్తుంది. అక్క ఇవ్వదని యువరాజ్‌ చెప్తాడు. దీంతో ఇంద్రాణి ఎలాగైనా వీళ్లను ఒప్పించి డీల్‌ ఓకే చేయించాలని నిషికను పొగడ్తలతో ముంచెత్తుతుంది. దీంతో నిషి ఎలాగైనా మూడు కోట్లు సంపాదిస్తామని.. పదమూడు కోట్లకు ఆ ఫ్యాక్టరీ కొంటామని చెప్తుంది. దీంతో ఇంద్రాణి వెళ్లిపోతుంది. తర్వాత మూడు కోట్లు ఎలా తీసుకురావలో యువరాజ్‌, నిషిక ఆలోచిస్తుంటారు. ఇంతలో సుధాకర్‌ వచ్చి ప్లాట్‌ రిజిష్ట్రేషన్‌ గురించి చెప్పగానే అందుకోసం నగలు, గోల్డ్‌ బిస్కెట్స్‌ తాకట్టు పెడితే మూడు కోట్లు వస్తాయని చెప్తుంది. ఆ మాట విన్న యువరాజ్‌ వాళ్లు ఆ గోల్డ్‌ కొట్టేయాలని ప్లాన్‌ చేస్తారు. వాళ్ల ప్లాన్‌ ను ధాత్రి పసిగడుతుంది. ఇంతలో  ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!