Jagadhatri  Serial Today Episode:  జేడీ ఆఫీసులోకి వెళ్లిన మీనన్‌ పోలీసులందరినీ బంధించి మినిస్టర్‌ కేసుకు సంబంధించిన ఫైల్‌ను వెతికిస్తుంటాడు. ఇంతలో అక్కడికి జేడీ, కేడీ, మేఘన వస్తారు. డోర్‌ క్లోజ్‌ చేసి ఉండటంతో ఎవ్వరూ లేరంటుంది మేఘన.


జేడీ: మీనన్‌ లోపలే ఉన్నాడు కేడీ.


కేడీ: ఇప్పుడు లోపలికి ఎలా వెళ్లాలి జేడీ.


మేఘన: ఏయ్‌ పిచ్చి లోపలకి వెళ్లడం దేనికి. వాళ్లు లోపల ఉన్నారంటే బయటకే కదా రావాలి. వచ్చే వరకు వెయిట్‌ చేసి అటాక్‌ చేద్దాం.


జేడీ: లోపల మన టీం ఉంది.  మినిస్టర్‌ ఉన్నాడు. సాక్ష్యాలు ఉన్నాయి. మనం ఇక్కడ వెయిట్‌ చేస్తూ కూర్చుంటే మొత్తం నాశనం అయిపోతాయి. లోపల పరిస్థితి తెలుసుకోకుండా రిస్క్‌ తీసుకోలేం. కేడీ..


అని జేడీ సైగ చేయగానే మాస్కులు పెట్టుకుని వెనక వైపు వెళ్తారు. అక్కడి నుంచి డోర్స్‌ ఓపెన్‌ చేసుకుని లోపలికి వెళ్తారు.


మినిస్టర్‌: జేడీ గురించి నాకు బాగా తెలుసు మీనన్‌. కచ్చితంగా సాక్ష్యాలు ఇక్కడే పెట్టి ఉంటుంది.


జేడీ: ఏంటి మీనన్‌ నేను లేనప్పుడు నా ఆఫీసులోకి వచ్చి సాక్ష్యాలను దోషులను తీసుకెళ్లిపోదామనుకున్నావా..? అయినా ఇది నా అడ్డ మీనన్‌. ఇందులో ప్రతి బెంచ్‌, ప్రతి ప్యాన్‌, ప్రతి టేబుల్‌ డ్యూటీ చేస్తుంది. ఇలాంటి చోట నీకు సాక్ష్యాలు ఎలా దొరుకుతాయి అనుకున్నావు.


కేడీ: ఏంటి మినిస్టర్‌ గారు మీరు ఎన్ని తప్పులు చేసినా మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నాము. అలాంటి మాకు ఒక్క మాట చెప్పకుండా వెళ్లిపోదాం అనుకున్నారా..? మేం ఎంత ఫీల్‌ అవుతున్నామో తెలుసా..?


జేడీ: అయినా ఏంటి మీనన్‌.. నన్ను చూస్తే అంత భయమా..? ఎన్ని గన్నుల వెనక దాక్కున్నావేంటి..? సరే నువ్వు డీల్ చేయడంతో తోపు కదా..? మనం ఒక డీల్‌ చేసుకుందామా..?


మీనన్‌: డీలా.. మీనన్‌కు జేడీకి మధ్య డీలా.. ఓకే.. అరేయ్‌ డీలింగ్ చేసేప్పుడు సమానంగా కూర్చోవడం పద్దతి. కానీ ఇక్కడ ఒక్క చైరే ఉంది. ఇప్పుడు మేడం ఎక్కడ కూర్చుంటారు. సరే జేడీ నేల మీద కూర్చో.. ఎలా అయినా నాతో సమానంగా కూర్చోవాలి అంటే నువ్వు నేల మీద కూర్చోవడమే కరెక్టు.


అని మీనన్‌ చెప్పగానే జేడీ నేల మీద కూర్చుంటుంది. మీనన్‌ గట్టిగా నవ్వుతుంటాడు. రౌడీలు, మినిస్టర్‌ కూడా నవ్వుతుంటారు. ఇంతలో మీనన్‌  చైర్‌లోంచి కింద పడిపోతాడు. దీంతో జేడీ, కేడీ, మేఘన, పోలీసులు నవ్వుతుంటారు.


కేడీ: ఇప్పటికైనా అర్తం అయిందా మీనన్‌. ఈ ఆఫీసులో ప్రతి వస్తువు జేడీ కోసమే పని చేస్తుందని.


జేడీ: ఇప్పుడు సమానంగా ఉన్నాము. డీల్‌ ఏంటంటే నువ్వు అడిగినట్టే ఆధారాలు ఇచ్చేస్తాం. మీ వాళ్లను తీసుకుని వెళ్లిపోమ్మను. కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉండిపో.


మీనన్‌: డీల్‌ గురించి ఆలోచిస్తా.. కానీ ఒకటి చెప్పు.. ఈ ఆఫీసు అంతా అణువణువునా మా వాళ్లు వెతికారు. కానీ సాక్ష్యాలు మాత్రం దొరకలేదు. నీ కళ్లు చెప్తున్నాయి. సాక్ష్యాలు ఇక్కడే ఉన్నాయని.. ఎక్కడ దాచావు చెప్పు.


జేడీ: నేను దాచడం ఏంటి మీనన్‌.. అన్నీ నీ కళ్లెదురుగానే ఉన్నాయి.


మీనన్‌: ఎక్కడ..?


జేడీ: గాయిస్‌ మీనన్‌కు సాక్ష్యాలు చూడాలని ఉందట. చూపించండి..


అని జేడీ చెప్పగానే.. అందరూ అక్కడే ఉన్న ఒక్కో సాక్ష్యాన్ని తీసుకొచ్చి చూపిస్తుంటారు. మీనన్‌ షాక్‌ అవుతాడు. జేడీ నువ్వు సూపర్ జేడీ అంటూ మీనన్‌ మెచ్చుకుంటాడు. నాకు కావాల్సినట్టు సాక్ష్యాలు బయటపెట్టినందుకు చాలా థాంక్స్‌ అని చెప్తాడు. వెంటనే అక్కడ స్మోక్‌ బాంబు వేసి సాక్ష్యాలు తీసుకుని అక్కడి  నుంచి బయట పడతాడు మీనన్‌. ఈ ఒక్కసారి జేడీ మీద  నేనే గెలిచానని ఫీలవుతాడు. ఇంతలో ఇవాల్టీ ఎపిసోడ్‌  అయిపోతుంది.


 


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!