Jagadhatri Serial Today Episode: డ్రగ్స్ ముఠాను పట్టుకునేందుకు జేడీ,కేడీ ప్రయత్నిస్తుంటారు. ఇదే విషయంపై వారు సీనియర్ అధికారులతో మాట్లాడుతుండగా...మీనన్ గ్యాంగ్‌లోని రూసూల్ నుంచి టిప్ వచ్చిందంటూ జూనియర్...ఓ చిట్ తీసుకువచ్చి జగధాత్రికి ఇస్తుంది. అందిలో ఈగిల్ అని రాసి ఉంటుంది. కేదార్ ఏమైందని అడగ్గా....ఏదో పెద్ద బ్లాస్ట్‌కు ప్లాన్ చేస్తున్నారని జేడీ చెబుతుంది. కోడ్ రెడ్ అంటే ఆల్రెడీ ప్లాన్ రెడీ అయిపోయిందంటుంది. ఇంకాసేపట్లో బ్లాస్ట్ జరగబోతోందని ఆమె అంటుంది.అందుకు సీనియర్ అధికారి స్పందిస్తాడు. అంత పెద్ద బ్లాస్ట్ జరగాలంటే పెద్ద మొత్తంలో ఆర్డీఎక్స్ కావాలని....సిటీలోకి ఆర్డీఎక్స్ వచ్చినట్లు ఎక్కడా మనకు సమాచారం రాలేదు కదా అంటాడు. మూడోరోజుల క్రితం వైజాగ్‌లో ఓ కంటైనర్ మిస్ అయినట్లు మాకు సమాచారం ఉందని...ఆ మిస్ అయిన కంటైనర్‌లోనే ఆర్డీఎక్స్ వచ్చి ఉంటుందని జేడీ అంటుంది. ఇంతపెద్ద సిటీలో వాళ్లు ఎక్కడ ఆర్డీఎక్స్ దాచారో...ఎక్కడ దాన్ని పేల్చబోతున్నారో తెలుసుకోవడం ఎలా అంటారు.
దేవదాయశాఖ మంత్రి రంగరాజు సిటీలోకి వస్తున్నారని ....ఆయన్నే టార్గెట్ చేసి ఉంటారని జేడీ అనుమానిస్తుంది. ఆయన రానున్న నరసింహస్వామి గుడి వద్దే బ్లాస్ట్ జరగబోతుందని జేడీ అంటుంది. వెంటనే మనం అక్కడికి వెళ్లి ఈ బ్లాస్ట్‌ను అడ్డుకోవాలని భావిస్తారు. వెంటనే వారిద్దరూ గుడికి బయలుదేరతారు..
అటు మీనన్....జేడీపై గెలవబోతున్నందుకు చాలా ఆనందపడతాడు. మరోవైపు గుడివద్ద మీనన్ మనుషులు గుడి వద్ద బాంబులు పెడుతుంటారు. ఈలోగా మినిష్టర్‌ను కలవడానికి కౌషికి కూడాగుడి వద్దకు వస్తుంది. మినిష్టర్ గుడివద్దకు వచ్చి లోపలకి వెళ్తుంటాడు. అటు మినిష్టర్ వద్ద ఉండే రాజేందర్ కాల్ లిప్ట్ చేయకపోవడంతో జేడీ అసహనం వ్యక్తం చేస్తుంది. వాళ్లు చాలా త్వరగా గుడికి రావడానికి ట్రై చేస్తుంటారు. వాళ్లు మినిష్టర్ లైవ్ చూస్తుండగా.... అక్కడ కౌషికిని చూసి షాక్‌కు గురవుతారు. మనం ఇప్పుడు కేవలం మినిష్టర్‌తోపాటు వదినను కూడా కాపాడాలని జేడీ అనుకుంటుంది. అటు మీనన్ మాత్రం కౌషికిని చూసి మరింత ఆనందపడిపోతాడు. ఇక మీనన్ తన మనుషులకు ఆదేశాలు ఇస్తాడు. బాంబులు వెంటనే పేల్చాలని చెబుతాడు. మీనన్ మనుషులు ఆర్డీఎక్స్ బ్యాగ్‌ను మినిష్టర్‌కు దగ్గరగా తీసుకురావడంతో పోలీసులు అనుమానించి పట్టుకుంటారు. ఈలోగా జేడీ అక్కడ ఉన్న పోలీసు ఆఫీసర్‌కు ఫోన్ చేసి గుడిలో బాంబు పెట్టారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది. కానీ ఆ విషయం పోలీసు ఆఫీసర్‌కు వినిపించదు. ఈలోగా మినిష్టర్ గుడిలోకి వెళ్లిపోతాడు. దీంతో టార్గెట్ మిస్ అయ్యిందని మీనన్ బాధపడుతుంటాడు.మినిష్టర్ గుడిలో పూజ ముగించుకుని బయటకు వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు బ్లాస్ట్ చేయాలని మీనన్ దేవాను ఆదేశిస్తాడు.
గుడిలో సిగ్నల్ లేకపోవడంతో మనం చెప్పేది వారికి వినిపించలేదని జేడీ అంటుంది. ఇప్పటి వరకు బాంబు పేల్చలేదంటే....అక్కడ ఏదో మిస్టేక్ జరిగిందని....ఖచ్చితంగా వాళ్లు వేరే ప్లాన్ చేసి ఉంటారని అంటుంది.అప్పుడే పోలీసు ఆఫీసర్ రాజేందర్ ఫోన్ చేయగా...నేను వచ్చేవరకు మినిష్టర్‌గారిని గుడిలోనే ఉంచాలని జేడీ చెబుతుంది. గుడిలోపల జనాలు మొత్తాన్ని క్లియర్ చేయమని చెబుతుంది. దీంతో పోలీసులు గుడిలో ఉన్న భక్తులను బయటకు పంపిస్తుండటంతో తమ ప్లాన్ జేడీకి తెలిసిపోయిందేమోనని మీనన్ అనుమానిస్తాడు. అక్కడ ఏం జరుగుతోందే తెలియడం లేదని దేవా మీనన్‌తో అంటాడు.ఇలాంటిది ఏదో జరుగుతోంది అంటే...అక్కడికి జేడీ వచ్చిందని అర్థంరా అంటాడు. ఇంతలో జేడీ అక్కడ ప్రత్యక్షమవుతుంది. వాళ్లను వీడియోలో చూసి మీనన్ షాక్ తింటాడు. బ్లాస్ట్ చేసి జేడీపై గెలుద్దామనుకున్నానని....ఇప్పుడు ఏకంగా జేడీనే బ్లాస్ట్‌లో లేపేస్తానని అంటాడు. అనుకున్న సమయానికి అనుకున్నట్లు బ్లాస్ట్ చేయాలని....ఒక్కదెబ్బకు మినిస్టర్, జేడీ, కేడీ, కౌషికి అందరూ మాడి మసైపోవాలంటాడు. అటు జేడీ, కేడీ బాంబుల గురించి వెతుకుతుంటారు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న పోలీసు అధికారికి కూడా ఈ విషయం చెప్పి....మినిస్టర్‌ను బయటకు రాకుండా నువ్వు చూసుకో....బాంబులు ఎక్కడెక్కడ ఉన్నాయో మేం కనిపెడతామని జేడీ అతనితో చెబుతుంది. మినిష్టర్ బయటకు వచ్చేప్పుడే చంపాలని వాళ్లు ప్లాన్ చేసి ఉంటారు కాబట్టి....ఆ మార్గంలోనే బాంబులు ఉండి ఉంటాయని జేడీ చెప్పడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.