Jagadhatri Serial Today Episode: కౌషికి ఇచ్చిన వార్నింగ్‌తో జగధాత్రి కూడా చాలా ఫీలవుతుంది. నిషి చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకుంటోందని అంటుంది. మీనన్‌తో నిషికి ఉన్న అన్ని సంబంధాలు కట్ చేయాలని అంటుంది. ఇంతలో రమ్య నుంచి ధాత్రికి ఫోన్ వస్తుంది. గుడి దగ్గర బాంబు బ్లాస్ట్‌లో గాయపడిన వారిలో ఒకరు కనిపించడం లేదని చెబుతుంది. దీంతో కేడీ,జేడీ ఇద్దరూ ఆస్పత్రికి బయలుదేరతారు
ఆస్పత్రికి వెళ్లి వైద్యులను జేడీ, కేడీ ఆరా తీస్తారు. కనిపించకుండా పోయిన వారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తెలుసా అంటే...అతన్ని చూడటానికి ఎవరూ రాలేదని చెబుతారు. అతనికి సంబంధించిన డిటైల్స్ కూడా ఏమీ ఇవ్వలేదని వైద్యులు అంటారు. బాంబు బ్లాస్ట్ కేసు అని తెలిసినప్పటికీ ఎందుకు వివరాలు తీసుకోలేదని జేడీ నిలదీస్తుంది. అతని తలకు పెద్దదెబ్బతగిలిందని...తనకు ఏం గుర్తులేవని చెప్పడంతో మేం ఏమీ చేయలేకపోయామని చెబుతారు. కెమేరాలకు దొరక్కుండా వాడు పారిపోయాడని ఆస్పత్రి సిబ్బంది చెబుతారు. అయినప్పటికీ జేడీ సీసీ ఫుటేజ్ చెక్ చేయగా....ఒకడు దెబ్బలతోనే ఆస్పత్రి నుంచి బయటకు వెళ్తున్న వీడియో కనిపిస్తుంది. వాడు ఓ ఆటోలో ఎక్కి వెళ్లిపోతాడు. ఆటో నెంబర్‌ను పట్టుకున్న జేడీ...ఆవివరాలు రమ్య ద్వారా కనుక్కుంటుంది. జేడీ,కేడీ ఇద్దరూ కలిసి ఆటోను వెతుకుతూ రోడ్డుమీదకు వెళ్తారు. ఒకచోట ఆటోనిలిపి ఉండటాన్ని చూసి డ్రైవర్‌ను పట్టుకుంటారు. నీ ఆటోలో ఎక్కిన వాడిని ఎక్కడ దింపావని నిలదీయడంతో...అతను వాడిని ఎక్కడ దింపాడో చెబుతాడు. దీంతో ఆటోడ్రైవర్‌ను తీసుకుని జేడీ, కేడీ బయలుదేరతారు. అతను ఇల్లుచూపింంచి వెళ్లిపోతారు. జేడీ, కేడీ ఇద్దరూ లోపలకి వెళ్లగానే....అక్కడ మరో ఇద్దరితో కలిసి ఆస్పత్రి నుంచి పారిపోయివచ్చిన రౌడీ మందు తాగుతూ ఉంటాడు. మిగిలిన ఇద్దరు రౌడీలను కొట్టి వాడిని జేడీ, కేడీ జయరాంను అదుపులోకి తీసుకుంంటారు. రహస్యంగా అతన్ని విచారిస్తుంది జేడీ. నువ్వు అప్రూవర్‌గా మారి నిజం చెప్పకపోతే...నీకే ఎక్కువ శిక్ష పడుతుందని బెదిరిస్తుంది. నువ్వు పోలీసులకు దొరికిపోయావని మీనన్‌కు తెలిస్తే నిన్ను చంపేస్తాడని...కాబట్టి నువ్వు మాకు నిజం చెబితే రక్షణ కల్పిస్తామని ఆశ చూపుతుంది.అయినా వాడు ఏమాత్రం భయపడకుండా వాళ్లకే జయరాం తిరిగి వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో పై అధికారి సాధూ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి...జయరాంను పట్టుకున్నట్లు చెబుతాడు. మినిష్టర్‌ను చంపడానికే జయరాం వేరొకరితో కలిసి గుడివద్ద బ్లాస్ట్ చేశారని జేడీ చెబుతుంది. మీరు ఛాలెంజ్ చేశారు కాబట్టి...ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఇలా ప్రెస్‌మీట్ పెట్టారని విలేకరులు ప్రశ్నిస్తారు. రకరకాల ప్రశ్నలతో వారు విసిగిస్తారు. ఇంతలో జయరాంను కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకెళ్తుండగా....అతను బిగ్గరగా నవ్వుతూ మీరు ఏంచేసినా నన్నేం చేయలేరని అంటాడు. ఈ కోర్టుల్లోఈకేసు ఎప్పటికీ తేలదని అంటాడు. అతన్ని కోర్టుకు తీసుకెళ్లే క్రమంలోనే జయరాంపై మర్డర్ ఎటాక్ జరగడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.