Jagadhatri Serial Today Episode: శ్రీవల్లిని ఇంట్లో నుంచి బయటకు పంపించేందుకు నిషిక, వైజయంతి నాటకమాడతారు. ఓ వ్యక్తిని నియమించి ...ఇంటి ముందు మగ్గులు వేస్తున్న వల్లిని బైక్‌కు గుద్దేలా చేస్తారు. ఆ తర్వాత ఆమె అతనితో మాట్లాడి పంపిస్తుండగా...వీళ్లద్దరూ వెళ్లి రచ్చ చేస్తారు.ఎవరు అతను,,,వాడితో నీకు సంబంధం ఏంటని గొడవ గొడవ చేస్తారు. అతను ఎవరో తెలియదని చెప్పినా వైజయంతి వినదు. లోపలికి తీసుకెళ్లి అందరి ముందు తిడితేనే దీనికి బుద్ది వస్తుందని నిషిక అనడంతో....శ్రీవల్లిని వైజయంతి లోపలికి లాక్కెళ్తుతుంది. దీంతో సుధాకర్ వైజయంతిపై గట్టిగా అరుస్తాడు. ఎందుకు శ్రీవల్లిని తోశావని నిలదీస్తాడు. అది చేసిన పనికి నేను కేవలం కిందకే తోశానని...మీరు అయితే మెడపట్టి బయటకు గెంటివేస్తారని వైజయంతి అంటుంది.
శ్రీవల్లి ఇప్పుడు ఏం చేసిందని కేదార్ నిలదీస్తాడు. కౌషికి కూడా వాళ్ల పిన్నిని తప్పుబడుతుంది. గేటు బయట ఎవరితోనే మాట్లాడుతోందని వైజయంతి అంటుంది. వాడు వచ్చి దీన్ని కలిసి ఈ గిప్ట్ ఇచ్చి పోయాడని చూపెడుతుంది. వీధుల్లో తిరిగే వాళ్లను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇలాగే రోడ్డుపైకి ఈడుస్తారని తిడుతుంది. దీంతో జగధాత్రికి పట్టరాని కోపం వస్తుంది. అత్తయ్యపై గట్టిగా అరవడంతో నిషి కల్పించుకుని లేనివాళ్ల బుద్ది లేకిగానే ఉంటుందని అంటుంది.దీంతో కౌషికికి కోపం వస్తుంది. ఈ ఇంట్లో ఉన్నవాళ్ల బుద్ది అంత సక్రమంగానే ఉందా అని అడుగుతుంది. ఇంతలో ధాత్రి కల్పించుకుని పెళ్లికావాల్సిన ఆడపిల్ల క్యారెక్టర్‌పై ఇష్టానుసారం అబంఢాలు వేయవద్దిని హితవు పలుకుతుంది. పెళ్లికావాల్సిన పిల్ల వీధుల్లో మగాళ్లతో మాట్లాడొద్దనే నేను అంటున్నాను అని వైజయంతి సమాధానమిస్తుంది. ఇంతలో శ్రీవల్లి కల్పించుకుని నిజంగా అతను ఎవరో నాకు తెలియదని చెప్పగానే...ఆమె శ్రీవల్లి చెంప పగులగొడుతుంది. నా కళ్లతో నేను చూసిన తర్వాత కూడా అబద్ధం చెబుతావా అని అరుస్తుంది. నీ ఒంటిపైకి ఈరంగులు ఎలా వచ్చాయని అడిగితే...అతను నా మీదపడినప్పుడు ముగ్గులోని రంగులు అంటుకున్నాయని చెబుతుంది. కౌషికి కల్పించుకుని అసలు ఏం జరిగిందో చెప్పాలని శ్రీవల్లిని అడుగుతుంది. అతని పేరు ప్రకాశ్‌ని...ఒక అనాథని చెబుతుంది. అంతే తెలుసని...అంతకు మించి ఏం తెలియదని అంటుంది. ఇంతలో యువరాజు కల్పించుకుని అతను ఎవరో తెలియకుండా పేరు ఎలా తెలిసిందనిఅంటే...అతనే చెప్పాడని శ్రీవల్లి వివరణ ఇస్తుంది. ఇంతలో వైజయంత్రి మళ్లీ గొడవ చేస్తుంది. ఇంతమంది అమ్మాయిలు ఉంటే వాడు నీ దగ్గరకే వచ్చి పేరు చెప్పి వెళ్లాడా అని మండిపడుతుంది. అసలు ఏం జరిగింతో మొత్తం తెలుసుకోకుండా వల్లి గురించి తప్పుగా మాట్లాడొద్దని కేదార్ అంటాడు. ఏం జరిగిందో చెప్పమని ధాత్రి అడగ్గా...నేను ఇంటి ముందు ముగ్గు వేస్తుంటే అతను బైక్‌పై వచ్చి కిందపడిపోయాడని అప్పుడే నాపై పడటంతో రంగులు అంటుకున్నాయని చెబుతుంది. అమ్మ రావడంతో అతను భయపడి పారిపోయాడని...అప్పుడే ఈ గిప్ట్ బాక్స్ అక్కడ మర్చిపోయాడని చెబుతుంది. మీరు ఏ తప్పు చేయకపోతే...వాడు నన్ను చూసి ఎందుకు పారిపోతాడని వైజయంతి నిలదీస్తుంది. శ్రీవల్లి ఏం మాట్లాడకపోయేసరికి నీ పని చెబుతా ఉండూ అంటూ వైజయంతి వంటగదిలోకి వెళ్లి అట్లకాడ కాల్చి తీసుకొస్తుంది. శ్రీవల్లి చేతిపై అట్లకాడతో వాతపెట్టబోగా...ఆ చేతిపై కేదార్ చేతిని ఉంచుతాడు. దీంతో వాత కేదార్ చేతిపై పడుతుంది. కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేదానికి ఇంత గొడవ ఎందుకు చేశావని సుధాకర్‌తోపాటు కౌషికి కూడా వైజయంతిని తిడతారు.
శ్రీవల్లి మరోసారి తప్పుచేయకుండా బుద్ది చెప్పాలని వాతపెడుతుంటే నువ్వెందుకు చేయి అడ్డుపెట్టావని వైజయంత్రి అనగా....నా చెల్లి తప్పు చేయదని నేను నమ్ముతున్నాను కాబట్టి అని కేదార్ అంటాడు. దీంతో వైజయంతి గుండె జారిపోతుంది. ఆ అమ్మాయి నీ చెల్లెలు అని నీకుఎవరు చెప్పారని అంటుంది. తోడపుట్టకపోయినా...శ్రీవల్లి నాకు సొంత చెల్లెలే అంటాడు. దీంతో ఊపిరిపీల్చుకుంటుంది. శ్రీవల్లి ఇప్పటి వరకు ఒక్కసారిగా తప్పుగా మాట్లాడటం గానీ...తప్పుగా ప్రవర్తించడం గానీ చేయలేదని ఇవాళ సడెన్‌గా చేసిందంటే ఎలా నమ్ముతామని అందరూ అంటారు.
కేదార్ చేతికి ధాత్రి మందు రాస్తుండగా శ్రీవల్లి అక్కడికి వచ్చి అతనికి కృతజ్ఞతలు చెబుతుంది. మా అమ్మకూడా నన్ను వద్దనుకున్నా...మీరు మాత్రం ఎంతో ఆప్యాయత చూపిస్తున్నారని కన్నీరు పెట్టుకుంటుంది. అసలు అతను ఎందుకు వచ్చాడో..ఎందుకు కిందపడ్డాడో..ఎందుకు గిప్ట్ నా చేతిలో పెట్టి పారిపోయాడో అర్థం కావడం లేదని అంటుంది. శ్రీవల్లి మాటలు విన్న జగధాత్రికి ఏదో కావాలనే చేసినట్లు అనుమానం వస్తుంది. వాడెవడో కనిపెట్టి వాడితోనే ఈ ఇంట్లో నిజం చెప్పిస్తామని ధాత్రి శ్రీవల్లికి హామీ ఇస్తుంది. తమ ప్లాన్ చెడిపోయినందుకు అత్తాకోడళ్లు గింజుకుంటారు. ఆ ధాత్రి, కేదార్ ఉన్నంతకాలం ఈ ఇంట్లో మన పథకాలు అమలు కావని నిషిక అంటుంది. ఈసారి మనం కొట్టబోయే దెబ్బకు శ్రీవల్లి శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్లిపోవాలని వైజయంత్రి అంటుంది. పెళ్లికి ముందే తొందరపడి ఇప్పుడు ఎందుకు హైరానా పడుతున్నారని నిషిక అంటుంది.అయితే నువ్వు ఇంకా శ్రీవల్లి నా కూతురే అనుకుంటున్నావా అని మండిపడుతుంది. ఆ శ్రీవల్లి పెళ్లికి ముందే నీకు పుట్టిన సంతానం కాదా అని నిషిక నిలదీయగా...వైజయంతి ఆమె మెడపట్టుకుని పైకి లేపుతుంది. నువ్వు అనుకునేలా నేను అలాంటి తప్పులు చేయనని అంటుంది. ఇంకోసారి శ్రీవల్లి నా అక్రమ సంతానం అని నువ్వు అన్నావంటే నిన్ను చంపి నా కొడుక్కిఇంకో పెళ్లి చేస్తానని చెప్పి వెళ్లిపోతుంది.
నిషి దగ్గరకు వచ్చిన కౌషికి నీతో మాట్లాడాలని చెబుతుంది.ఏంటి వదినా అని అడగ్గా...నిన్నుచూస్తే భయం వేస్తోందని నువ్వు ఈకుటుంబాన్ని ఎప్పుడు ఏ పరిస్థితుల్లో పడేస్తావోనని భయం వేస్తోందని అంటుంది. ఇప్పుడు నేను ఏం చేశానని అనగా...నిన్ను నువ్వు ఆస్పత్రిలో నుంచి మాయమై ప్రెండ్స్ కలవడానికి వెళ్లానని చెప్పడం నాకు ఎందుకో కన్వినెన్స్‌గా అనిపించలేదని అంటుంది. ఇప్పుడు ఏ గొడవ చేసి ఈ ఇంటిపైకి ఏం తీసుకొస్తున్నావోనని భయంగా ఉందని అంటుంది. ఒక్కసారి పొరపాటు చేశానని మళ్లీ మళ్లీ మాటలు అనడం బాగాలేదని నిషిక అంటుంది. కష్టపడి యువరాజును దారిలోకి తీసుకొస్తున్నామని...ఇప్పుడు నువ్వు దారి తప్పకు అని హెచ్చరిస్తుంది. ఇప్పుడు యువరాజు చేసినట్లే నేను చేస్తున్నానని అనకుంటున్నారా అని నిషి అడగ్గా...ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నానని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన యువరాజు మా తప్పులు ఎత్తి చూపుతున్నట్లుగా ఉందని అనడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.