Jagadhatri Serial Today Episode: జగధాత్రితోపాటు యువరాజు,కౌషికి అందరూ నిషిక కోసం కంగారుపడుతుండగా...రాత్రికి నిషి ఇంటికి వస్తుంది. నీకోసం ఇంట్లో అందరూ కంగారుపడుతుంటే నువ్వు కనీసం ఫోన్ కూడా చేయవా అని నిలదీస్తారు. ఇప్పుడు ఎందుకు అందరూ ఓవర్ రియాక్ట్‌ అవుతున్నారని నిషి అంటుంది. నువ్వు కనిపించకుండాపోయే సరికి అందరూ  ఎంత కంగారుపుడుతున్నారో తెలుసా అని జగధాత్రి అంటుంది. దీనికి నిషి ఇంకా నయం నన్ను మీనన్ కిడ్నాప్ చేశాడని అనుకున్నారా ఏంటి అని అంటుంది. ఫారన్ నుంచి నా ప్రెండ్స్‌ వచ్చి నాకు సర్‌ఫ్రైజ్‌ ఇచ్చారని...వాళ్లను కలిసి వచ్చేసరికి నాకు కొంచెం లేటు అయ్యిందని దీనికే మీరంతా ఎందుకు హడావుడి చేస్తున్నారని అని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోతుంది.

Continues below advertisement

   ఫారన్ ప్రెండ్స్ ఎవరని యువరాజు నిషికను నిలదీస్తాడు. వాళ్లు నీకు తెలియదులే అంటూ నిషి దాటవేసి స్నానం చేయడానికి వెళ్లిపోతుంది. కచ్చితంగా  నిషి ఏదో దాచిపెడుతోందని యువరాజు అనుమానిస్తాడు. అందరికీ అబద్ధం చెబుతుందని అనుకుంటాడు. నాకు తెలియకుండా ఏదో దాస్తోందని అనుమానిస్తాడు.

   నిషిక ఖచ్చితంగా అబద్ధం చెప్పిందని అనిపిస్తోందని ధాత్రి కేదార్‌తో అంటుంది. ఆమె నిజం దాస్తోందని అంటుంది. నిజంగానే మీనన్‌ నిషికను కిడ్నాప్ చేసి ఉంటాడని భావిస్తుంది. మీనన్‌ కిడ్నాప్‌ చేస్తే వాడికోసం నిషి  ఎందుకు అబద్ధం చెబుతుందని కేదార్ అంటాడు. మీనన్‌ నుంచి ఎలా తప్పించుకుని రాగలుగుతుందని అంటాడు. నా అనుమానం కూడా అదేనంటుంది ధాత్రి...అసలు మీనన్‌ నిషికను ఎందుకు వదిలేశాడని ఆలోచిస్తుంది. నిషిని వాళ్ల ప్రెండ్స్ మాత్రం తీసుకెళ్లలేదని...మీనన్‌ అయ్యి ఉండొచ్చని అంటుంది. ఒకవేళ అదే నిజమే అయితే ఖచ్చితంగా  నిషిక మీనన్‌కు పనిచేస్తానని చెప్పి ఉండాలని... అదే నిజమైతే నేనే నిషికను పోలీసులకు పట్టిస్తానని కేదార్‌తో చెబుతుంది. వాళ్ల మాటలను మేడపై నుంచి వింటున్న నిషికలో భయం పట్టుకుంటుంది. మీనన్‌ను కలిసి వచ్చినప్పటి నుంచి నిషిక కంగారుపడటాన్ని గమనిస్తున్న యువరాజు కూడా ఆమె గురించి తీవ్రంగా  ఆలోచిస్తుంటాడు. అయినా నాన్న ప్రాణాపాయస్థితిలోఉంటే ప్రెండ్స్‌తో పార్టీకి వెళ్లడం ఖచ్చితంగా అబద్ధమే అనుకుంటాడు. జగధాత్రి వాళ్లు చెప్పినట్లు నిషిని ఎవరో కిడ్నాప్ చేశారని అనుకుంటాడు. మరి ఎందుకు నిషి అబద్ధం చెబుతోందని ఆలోచిస్తాడు. ఎవరిని కాపాడటానికి ఆమె ఈ పనిచేస్తోందని ఆలోచిస్తాడు. నా అనుమానమే నిజం అయితే....మీనన్ నిషిని కిడ్నాప్‌ చేయించి ఉండాలని భావిస్తాడు. నిషిని వదిలేశాడంటే....మీనన్‌కు పనిచేస్తానని ఒప్పుకుందా అని భయపడతాడు. మీనన్‌తో చేతులు కలిపితే ప్రతిక్షణం భయంతో చస్తూ బతకాల్సిందేనని అంటాడు. ఇప్పుడే నిషిని ఈ విషయంలో  హెచ్చరించాలని  అనుకున్నా....సాక్ష్యాలు లేకుండా మాట్లాడితే ఖచ్చితంగా గొడవ చేస్తుందని యువరాజు భావిస్తాడు. కాబట్టి రిషిని ఓ కంట కనిపెట్టాలని అనుకుంటాడు.

Continues below advertisement

   ఇంతలో అక్కడికి వాళ్ల కౌషికి వస్తుంది.ఏం ఆలోచిస్తున్నావ్ యువరాజు...మీనన్ ఈ ఫ్యామిలీని ఎందుకు ఎటాక్‌ చేశాడని ఆలోచిస్తున్నావా లేక నువ్వు మీనన్‌ వేసుకున్న ప్లాన్ ప్లాప్‌ అయ్యిందే అని బాధపడుతున్నావా అని అడుగుతుంది. నా కన్నతండ్రిని నేనే కిడ్నాప్ చేయమని ఎలా చెబుతాను అని మండిపడతాడు. ఇదేనా నువ్వు నన్ను నమ్ముతుంది అని అంటాడు. ఒకసారి ఆ మీనన్‌తో చేతులు కలిపి మన ఇంటి పరువు తీశావు కదా అని గుర్తుచేస్తుంది. మాఫియాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని క్లాస్‌పీకుతుంది. ఈలోగా  వైజయంతి అక్కడికి వస్తుంది. అబ్బాయి నువ్వు చెప్పినట్లే ఇంట్లోఉన్నా...ఇంకా అనుమానిస్తూ ఇన్ని మాటలు అంటున్నావు అని అంటుంది. వాడు మనవాడ్ని వదలకపోతే...అందులో వీడి తప్పు ఏముందని అంటుంది. నేను వాడిని ఇంట్లో నుంచి బయటకు పంపకుండా ఉంచుతుంది వాడిని కాపాడుకోవడానికేనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వైజయంతి కూడా మళ్లీ తన కొడుకుని మరోసారి అడుగుతుంది. నువ్వు మళ్లీ ఆ మీనన్‌ కోసం పనిచేయడం లేదు కదా అని నిలదీస్తుంది. ఇంత జరిగిన తర్వాత కూడా  నేను ఆ పనులు ఎందుకు చేస్తానమ్మా అంటాడు.నేను వాడు చెప్పిన పనులు చేసి ఉంటే నాన్నను ఎందుకు కిడ్నాప్ చేసేవాడు అని అంటాడు.     కేదార్‌ జగధాత్రి వద్దకు వచ్చి మనం హనీమూన్‌కు వెళ్తామని అని ప్రతిపాదిస్తాడు.దీంతో ధాత్రి మండిపడుతుంది.అత్తయ్య శ్రీవల్లి విషయంలో దాస్తున్న నిజం ఏంటో తెలియదు. నిషి మీనన్‌తో చేతులు ఎందుకు కలిపిందో అర్థం కావడంలేదు. వారంరోజుల్లో మినిస్టర్‌ను చంపిన వాళ్లను పట్టుకుంటామని శపథాలు చేశాం. చుట్టూ ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుని హనీమూన్‌కు వెళ్దామని ఎలా అడుగుతున్నావ్ అంటూ కోప్పడుతుంది. ఇంతలో వైజయంతిని నిషికను పిలిచి శ్రీవల్లిని ఇంట్లో నుంచి గెంటివేయబోతున్నానని చెబుతుంది. తన ప్లాన్ మొత్తం నిషికి చెబుతుంది.ఇది వర్కవుట్ కాకుంటే జగధాత్రి చేతిలో మీపని అయిపోతుందని నిషి హెచ్చరిస్తుంది. మరి వైజయంతి వేసిన ఆ ప్లాన్ ఏంటో వచ్చే ఏపిసోడ్‌లో చూద్దాం.