Jagadhatri Serial Today Episode: హోంమినిస్టర్ అనుచరుడితో ఎలాగైనా నిజం చెప్పించాలని భావించిన జగధాత్రి...ఓ చిన్నారి చేతికి మిరపకాయ బజ్జీ ఇచ్చి అతని నోట్లో పెట్టేలా చేస్తుంది. దీంతో అతను ఆ బజ్జీని తినడంతో....విషం మిరపకాయ బజ్జీల్లో లేదని తేలుతుంది.అంటే ఇక పాయసంలో మాత్రమే విషం కలిపారని వారికి అర్థమవుతుంది. ఇంతలోనే పాయసం తీసుకుని అందరికీ ఇవ్వడానికి నిషిక వెళ్తుండటాన్ని జగధాత్రి చూసి పరుగులు పెడుతుంది. ఆమె చేతిలో ఉన్న పాయసం గిన్నెలను విసిరి కొడుతుంది. దీంతో నిషి కోప్పడగా...చూడక చేయి తగిలిందని అబద్ధం చెబుతుంది. ఈలోగా జగధాత్రివాళ్ల మామయ్య సుధాకర్ పాయసం తినేస్తాడు. అంతలోనే నోటి నుంచి నురగ కక్కుతూ కిందపడిపోతాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలిస్తారు. యువరాజు తాను చెప్పిన మాట వినడం లేదని...వాడిని కంట్రోల్‌లో పెట్టాలంటే ఐసీయూలో ఉన్న వాళ్ల సుధాకర్‌ను కిడ్నాప్ చేసి తన దగ్గర పెట్టుకోవడానికి మీనన్ ఆస్పత్రికి బయలుదేరతాడు. ఇంతలో ఆస్పత్రిలో కేధార్,యువరాజు గొడవపడతారు. మానాన్నను చంపడానికి నువ్వే ప్రయత్నించావ్ అంటూ యువరాజు కేదార్ చొక్కా పట్టుకుంటాడు. మా నాన్నను ఎందుకు చంపాలనుకున్నావ్ అని నిలదీస్తాడు. భోజనాలు మొదలైన దగ్గర నుంచీ కేదార్, జగధాత్రి కంగారుపడుతూనే ఉన్నారని అంటాడు. పాయసం కూడా కావాలనే కిందపడేశారని నిషిక అంటుంది. మామయ్య కిందపడిపోగానే కూడా...పాయసం తిన్నారా అని ఎందుకు అడిగారని నిలదీస్తుంది. అసలు పాయసంలో విషం కలిసిన సంగతి మీకు ఎలా తెలిసిందని అంటారు. వీళ్ల అమ్మ బోర్డు తీసేసి మినిష్టర్ బోర్డు పెట్టడంతో కోపంతోనే పిల్లలు తినే పాయసంలో జగధాత్రియే విషం కలిపిందని నిషిక అంటుంది. దీంతో ధాత్రి కోపంతో రగిలిపోతుంది. పాయసంలో విషం కలిసిన మాట నిజమేనని...కాకపోతే ఆ విషం కలిపింది మేము కాదని...మినిష్టర్ తాయార్ అని అరిచి చెబుతుంది. దొరికిపోయే సరికి మొగుడు, పెళ్లాలు ఇద్దరూ కలిసి కొత్త నాటకాలు ఆడుతున్నారా అంటూ నిషిక నిలదీస్తుంది. ఇంతలో కౌషికి కల్పించుకుని ధాత్రి చెబుతుంది నిజమేనని అంటుంది. మన ఫ్యామిలీ పరువు తీయాలనే మినిష్టర్ ఇలాంటి పనిచేసిందిని చెబుతుంది. ధాత్రి...మన పరువు కాపాడిందని అంటుంది.
సుధాకర్‌ను కిడ్నాప్ చేసేందుకు ఆస్పత్రికి వచ్చిన మీనన్‌కు అక్కడే జగధాత్రి వాళ్ల ఫ్యామిలీ మొత్తం ఉండటం చూసి నిరాశ చెందుతాడు. వెంటనే అనుచరుడు దేవాతో కలిసి డాక్టర్, నర్సు వేషం వేసుకుని ఐసీయూలోకి వెళ్తారు. వాళ్లను గమనించిన కేధార్, జగధాత్రికి అనుమానం వస్తుంది. డాక్టర్ చూపుల్లో ఏదో తేడా ఉందని ధాత్రి అంటుంది. వీళ్ల వాలకం చూస్తుంటే ఇక్కడ ఏదో జరుగుతోందని అంటుంది. ఇంతలో లోపలకి వెళ్లిన మీనన్....డాక్టర్‌ను బెదిరించి సుధాకర్‌ను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో సుధాకర్ మీనన్‌పై మండిపడతాడు.నా కొడుకును అడ్డుపెట్టుకుని మా ఫ్యామిలీని ఎందుకు వేధిస్తున్నావని నిలదీస్తాడు. నీకు ఏం కావాలని అడుగుతాడు. జగధాత్రి, కేదార్ ఇద్దరూ రిసెప్షన్ వద్దకు వెళ్లి డ్యూటీ డాక్టర్‌ల లిస్ట్ పరిశీలిస్తారు. దీంతో వచ్చిన వాళ్లు మీనన్ అని వారికి అర్థమవుతుంది. బెదిరించడానికి మామయ్యగారిని ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడని ధాత్రి చెబుతుంది. ఇంతలో వారిద్దరూ ఐసీయూలోకి వెళ్లగా పేషెంట్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని డాక్టర్ చెబుతాడు.ఇంతలో ధాత్రి వచ్చి ఈ విషయం అందరికీ చెప్పి తలోదిక్కు వెళ్లి వెతకమని ఆదేశిస్తుంది. అప్పుడే సుధాకర్‌ను తీసుకెళ్తున్న మీనన్ ఆమెకు ఎదురుపడతాడు. అయితే జగధాత్రియే జేడీ అని సంగతి తెలియదు. తాను కూడా ఈ విషయం బయటపడకుండా జాగ్రత్తపడుతుంది. అదే సమయంలో మీనన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తుంది. మా మామయ్యను వదిలివెళ్లాలని చెబుతుంది. తనే జేడీ అని తెలియక...మీనన్ వాళ్ల అనుచరులను జగధాత్రి మీదకు పంపుతాడు. వాళ్ల నుంచి ఆమె జేడీలా తప్పించుకోవడం చూసి మీనన్ ఆశ్చర్యపోతాడు.