Jagadhatri Serial Today Episode: జగధాత్రిని ఆశ్రమం నుంచి పంపించేయాలని హోంమంత్రి ఆదేశించడంతో జగధాత్రి ఆమెకు కౌంటర్ వేస్తుంది. ఈ ఆశ్రమాన్ని మానాన్న మా అమ్మ పేరిట కట్టించారు...కాబట్టి ఇక్కడ ఉండే హక్కు నీ కన్నా నాకే ఉందంటూ బోర్డు వైపు చూపిస్తుంది. అనాథ పిల్లలు ఉండే ఇలాంటి ఆశ్రమానికి అవినీతిపరురాలి పేరు ఎలా పెడతారంటూ హోంమంత్రి తాయర్ మండిపడుతుంది. వెంటనే ఆబోర్డు పీకేయమని తన అనుచరులను ఆదేశిస్తుంది. ఆ మాటలకు జగధాత్రికి తీవ్ర కోపం వస్తుంది.మా అమ్మ గురించి ఇంకొక్క మాట మాట్లాడినా ఊరుకోనని అంటుంది. ఇంతలో నిషిక కలుగజేసుకుని ఆవిడ ఎవరనుకున్నావ్...హోంమినిస్టర్. ఆవిడ తలుచుకుంటే నీ జీవితం తారుమారు అవుతుందని హెచ్చరిస్తుంది. జీవితాలను తారుమారు చేయడం మీకు అలవాటే కదా తాయర్‌గారు అని కేదార్ అంటాడు. పాతికేళ్ల క్రితం జరిగిన దానికి సాక్ష్యాలు లేకపోయినా...ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలుసుు మినిస్టర్ అని జగధాత్రి అంటుంది. నిజం బయటపడితే అందరికన్నా ముందు నీ నిజాయితే బయటకు వస్తుందని హెచ్చరిస్తుంది. ఇంతలో తాయర్ కార్యకర్తలను రెచ్చగొడుతుంది. వాళ్లంతా కావ్య పేరు తీసేసి తాయార్ పేరు పెట్టాలంటూ గొడవ చేస్తారు. దీంతో జగధాత్రి కల్పించుకుని మీరు మా ఆశ్రమాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదని...మీరు వెళ్లిపోతే మేమే ప్రారంభించుకుంటామని చెబుతుంది. దీంతో అగ్నికి ఆజ్యం పోసినట్లు నిషిక, యువరాజు కూడా శ్రుతికలుపుతారు.ఇప్పటికిప్పుడు మీ అమ్మ బోర్డు పీకేస్తే ఏం చేస్తావు అంటారు. ఇంతలో కొందరు కార్యకర్తలు కావ్య ఫొటో తీయడానికి ప్రయత్నించగా...జగధాత్రి, కేదార్ ఇద్దరూ కలిసి కొడతారు. దీంతో మరింత రెచ్చిపోయిన కార్యకర్తలు ఆశ్రమానికి ఉన్న బోర్డు పీకిపడేస్తారు. ఆ బోర్డుపై తాయర్ కాలుతో తొక్కుతుంది. దీంతో జగధాత్రికి కోపం వస్తుంది.ఇది మా ఆశ్రమం అని...దీనికి ఎవరు పేరు పెట్టుకోవాలో మా ఇష్టమని అంటుంది. దీనికి మినిష్టర్ కూడా ఘాటుగానే సమాధానమిస్తుంది.ఇది గవర్నమెంట్ స్థలమని...ఆశ్రమాన్ని మంజూరు చేయించింది కూడా నేనేనని ఆమె అంటుంది. ఎవరి పేరు పెట్టాలో నిర్ణయించే హక్కు మాకుందని అంటుంది. కావ్య అవినీతిపరులని చెప్పడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని...కాదని మీరు నిరూపిస్తే నేనే మీడియాను పిలిచి నాది తప్పయ్యిందని ఒప్పుకుని నేనే స్వయంగా ఆశ్రమానికి ఆమె పేరు పెడతానని తాయర్ అంటుంది. అప్పటి వరకు నా పేరే పెట్టుకుంటానని అంటుంది. కావ్య పేరు ఆశ్రమానికి తీసివేయడంతో వైజయంతి,నిషికతోపాటు వాళ్ల అమ్మ చాలా సంతోషంగా ఉంటారు. జగధాత్రి ఇంత ఘోరంగా అవమానపడటం చూస్తే చాలా ఆనందంగా ఉందని యువరాజు కూడా అంటాడు. అటు జగధాత్రి బాధపడుతుంటే కేధార్ వచ్చి ఓదార్చుతాడు. మీ అమ్మ ఎంత నిజాయితీపరురాలోమనకు తెలియదా అని అంటాడు. కానీ ఇలాంటి అర్హతలేని వాళ్లకు కూడా ఆమె గొప్పతనం తెలియాలి కదా అని ధాత్రి అంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన హోంమినిస్టర్ తాయర్....నా మొగుడిని చంపితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా జగధాత్రి అని మండిపడుతుంది. నిన్ను,నీ కుటుంబాన్ని నాశనం చేసే వరకు నాకు విశ్రాంతి లేదని అంటుంది. నిజం గురించి నువ్వు చేసే ప్రయత్నాలన్నీ అడ్డుకుంటానని అంటుంది. మీ అమ్మను ఓడించి విజయం సాధించానని...ఇప్పుడు నిన్ను కూడా ఓడిస్తున్నానని గర్వంగా మాట్లాడుతుంది. అప్పుడే జగధాత్రి కుర్చీలో కూర్చుని కాలుమీద కాలు వేసుకుని చిటికెలు వేస్తూ హోంమినిస్టర్‌కు సవాల్ విసురుతుంది. ఓ సామాన్యురాలైన నా మీద గెలవడానికి నీకు మంత్రి పదవి అవసరమైంది. ఇప్పుడు నువ్వు గెలిచినట్లా నేను గెలిచినట్లా అని నిలదీస్తుంది. పాతికేళ్లు దాటినా మా అమ్మపేరు మిమ్నల్ని వణికిస్తోందంటే...గెలిచింది మా అమ్మేకదా అని అంటుంది. ఓటమిని నీకు పరిచయం చేసి జైలు జీవితాన్ని నీకు చూపించకపోతే నేను కావ్య కూతురినే కాదని హెచ్చరిస్తుంది. దీంతో హోంమినిస్టర్‌కు దిమ్మతిరిగిపోతుంది.జగధాత్రిపై కోపంతో చిందులు తొక్కుతుంది. జగధాత్రి ఫ్యామిలీ మొత్తం జైలుకు పోవాలంటే ఆశ్రమంలో వారు వండిన అన్నంలో విషం కలపాలని అనుచరుడిని ఆదేశిస్తుంది. తాయారు పేరిట ఉన్న అనాథ ఆశ్రమాన్ని హోంమినిష్టర్ ఓపెన్ చేస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్లిన జగధాత్రి వంటపని మొదలుపెడతామని అనగా...వంటవాళ్లను పెడితే సరిపోయేది కదా అని కౌషికి అంటుంది.లేదు మేమే స్వయంగా వండి వడ్డిస్తామని జగధాత్రి చెబుతుంది.అందరం కలిసి తలో చేయి వేస్తే...వంట పూర్తవుతుందని కేదార్ అంటాడు. అందరూ కలిసి వంటపని మొదలుపెడతారు. ఆ వంటలో విషం కలిపే ప్రయత్నాలు తాయరు చేస్తుంటుంది.