Jagadhatri Serial Today Episode జేడీ, కేడీలు మేనేజర్ హత్య కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఆఫీస్‌లో ఒకమ్మాయి కళ్లు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్‌కి తీసుకెళ్లారని చెప్తాడు. ఇక యువరాజ్, నిషికలు మాట్లాడుకుంటారు. ఎన్ని సార్లు కౌషికి మీద ప్లాన్ చేసినా తనని ఏం చేయలేకపోయాం.. ఇప్పుడు మాత్రం అక్క ఏం చేయకుండా ఇరుక్కుంది. ఇప్పుడు కౌషికిని కోర్టుకి తీసుకెళ్తారు కదా ఎవరైనా సాక్ష్యం మార్చకుండా మనం ఆఫీస్‌లో ఇద్దరు ముగ్గురిని మన వైపు తిప్పుకొని అక్కడ చూసింది చూసినట్లు సాక్ష్యం చెప్పించాలి అని యువరాజ్ అంటాడు.
యువరాజ్ మాటలకు నిషిక మనమే సాక్ష్యం చెప్దామని అంటుంది. మనం సాక్ష్యం చెప్తే అక్క మనల్ని ఇంట్లో ఉండనివ్వదు అని యువరాజ్ అంటాడు. దానికి నిషిక మన సాక్ష్యంతో వదిన జైలుకెళ్తుంది. ఇళ్లు, వ్యాపారాలు మన చేతికి వస్తే ఇక మనల్ని ఎవరు ఏం చేస్తారు అని అంటుంది. జగద్ధాత్రి, కేథార్ గురించి యువరాజ్ అడిగితే మన ఇంట్లో వాళ్లని అసలు ఉండనిస్తే కదా వాళ్లేదో చేయడానికి అని అంటుంది.
వైజయంతి దిగులుగా వచ్చి కౌషికి వెంట మీ మామయ్య వెళ్లారు.. ఆ జగద్ధాత్రి, కేథార్ కూడా వెళ్లారు కదా కౌషికి బయటకు వచ్చేస్తుందేమో అని అంటుంది. అలాంటిది ఏం జరగదు వదినకు జైలే గతి ఇక ఇంటికి రాదు అని నిషికి అంటుంది. ఇంతలో జగద్ధాత్రి, కేథార్, సుధాకర్ ఇంటికి వస్తారు. కౌషికి రాలేదని సంబర పడిన నిషిక వాళ్లకి పెద్ద షాక్ తగులుతుంది. కేథార్ వాళ్లు కౌషికిని తీసుకొస్తారు. ముగ్గురు ఇలా జరిగింది ఏంటి అని బిత్తరపోతారు. మనిస్టర్‌తో బెయిల్ ఇప్పించి తీసుకొచ్చానని సుధాకర్ అంటాడు. ఇంత పెద్ద కేసులో బెయిల్ ఎలా ఇచ్చారని యువరాజ్ అడిగితే అలా అడుగుతావేంటి అని సుధాకర్ అంటాడు. రెండు రోజుల్లో హత్య ఎవరు చేసిందో కనిపెట్టకపోతే మళ్లీ జైలుకి తీసుకెళ్తారని కేథార్ అంటాడు.
నిషిక, యువరాజ్, వైజయంతిలు ఈ రెండు రోజులకు బయటకు ఎందుకు వచ్చావ్ మూడు రోజుల ముచ్చటే అదేదో జైలుకి వెళ్లిపోతే బెటర్ అంటారు. నీ పిల్లల పరిస్థితి ఏంటా అని నిషిక అంటే కాచి నిషికతో మా అక్క ఏం చేయలేదు.. ఒకవేళ ఏమైనా జరిగితే పిల్లల్ని మేం చూసుకుంటాం అని కాచి అంటే నీకే పిల్లలు లేరు.. నువ్వొక గొడ్రాలివి అని అవమానిస్తారు. కేథార్, జగద్ధాత్రి మేం అంతా చూసుకుంటాం కౌషికిని మేం ఏం తప్పు చేయలేదు అని నిరూపిస్తామని కేథార్ అంటాడు. దాంతో మీరేంటి ఎప్పుడూ పోలీసుల్లా మాట్లాడుతారు అని ప్రశ్నిస్తారు. జగద్ధాత్రి కవర్ చేస్తుంది.
కౌషికి ఈ కేసు నుంచి బయట పడటం కష్టమని అంటుంది. సుధాకర్ కూడా కష్టమే ఏం చేద్దాం అని అనుకుంటారు. ఇంతలో న్యూస్‌లో కౌషికి మర్డర్ కేసు గురించి టీవీలో వస్తుంది. యువరాజ్ కౌషికితో ఒక మనిషి ప్రాణం తీసేసింది అని అంటాడు. దాంతో కేథార్ అక్క గురించి ఇంకొక్క మాట అన్నా ఊరుకోను అంటాడు. వైజయంతి కేథార్ మీద అరుస్తుంది. దాంతో కౌషికి వెళ్లిపోతుంది. జగద్ధాత్రి, కేథార్ వెనకాలే వెళ్తారు. మర్డర్ చేసి ఇంటి పరువు తీసేసిందని సుధాకర్‌తో నిషిక అంటే మీరు ఎన్ని తప్పులు చేసినా మిమల్ని ఇంట్లో ఉంచింది కదా అదే తన తప్పు అని ఛీ కొట్టి సుధాకర్ వెళ్లిపోతాడు. చేయని తప్పునకు బలైపోతానా తట్టుకోలేకపోతున్నా ధైర్యం సరిపోవడం లేదు.. ఇంట్లో వాళ్లే ఇలా మాట్లాడుతున్నారని కౌషికి చెప్తుంది. కేథార్, జగద్ధాత్రిలు ధైర్యం చెప్తారు. ఈ కేసుని జేడీ, కేడీలు తీసుకున్నారని తెలుస్తుంది. వాళ్లు ఉండగా నాకు ఏం కాదని ధైర్యంగా ఉందని కౌషికి చెప్తుంది. కేథార్, జగద్ధాత్రిలు అండగా ఉన్నందుకు థ్యాంక్స్ చెప్తుంది. మరోవైపు కాచి తనని నిషిక గొడ్రాలు అన్నందుకు బాధ పడుతుంది. జగద్ధాత్రి కాచి దగ్గరకు వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.