Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. కాచీ పెళ్లిరోజుకావడంతో ఆమెను సంతోషపరిచేందుకు భర్త స్వీట్లు, గిఫ్ట్‌లు పట్టుకునిరాగా...వాటిని ఆదిలక్ష్మీ బయటపడేస్తుంది.అడిగినందుకు కాచీపై చేయిచేసుకుంటుంది.అప్పుడే అక్కడికి కమలాకర్‌రావడంతో ధాత్రి ఫోన్ చేసి కౌషికిని పిలుస్తుంది. ఏం జరిగిందని కౌషికి ప్రశ్నిస్తున్న సమయంలోనే కమలాకర్‌ ఆదిలక్ష్మీని తిడతాడు.అప్పుడేఅక్కడికి వచ్చిన సురేష్‌ మా అమ్మను అనరాని మాటలు అంటున్నారని అనగా...జగధాత్రి ఆదిలక్ష్మీ చేసిన  పనిని సీసీ ఫుటేజీలో చూపిస్తుంది.దీంతో ఆదిలక్ష్మీ తప్పు చేసిందని తేలడంతో కాచీకి క్షమాపణలు చెబుతుంది.ఆదిలక్ష్మీ కుట్ర                   కాచీ పెళ్లిరోజుకావడంతో ఆమె భర్త గిప్ట్‌లు, స్వీట్లు పట్టుకుని వస్తాడు.ఇవాళ కాచీకి సర్‌ఫ్రైజ్  ఇస్తానని జగధాత్రితో చెప్పి తెచ్చిన వస్తువులన్నీ హాల్‌లో పెట్టి ఆమెను తీసుకురావడానికి పైకి వెళ్తాడు.అప్పుడే కిచెన్‌లోకి జగధాత్రి వెళ్లడంతో ఆదిలక్ష్మీ మాత్రమే హాల్‌లో ఉంటుంది. ఎలాగైనా ఈ సర్‌ఫ్రైజ్‌ ప్లాన్ చెడగొట్టి ఇంట్లో తగవులు పెట్టాలని చూస్తుంది. నేను నా రూమ్‌లోకి వెళ్లి కాఫీ తాగుతానని జగధాత్రికి గట్టిగా చెప్పి వెళ్లిపోయినట్లు నటిస్తుంది.అయినా ఆదిలక్ష్మీ పిన్ని ఎందుకు నాకు అంత గట్టిగా చెబుతోందని ధాత్రి అనుకుంటుంది. ఆమె కిచెన్‌లో నుంచి చూడగా....పిన్ని ఏదో ఎత్తుకుని పోతున్నట్లు కనిపిస్తుంది.ఏదోలే అని ధాత్రి వదిలేస్తుంది. కాచీకి సర్‌ఫ్రైజ్ ఇద్దామని కిందకు భర్త తీసుుకుని రాగా అక్కడ ఏం ఉండవు. దీంతో అందరూ కలిసి గిఫ్ట్‌లు,స్వీట్లు ఏమయ్యాయని వెతుకుతారు. జగధాత్రికి అనుమానం  వచ్చి ఆదిలక్ష్మీ పిన్ని వెళ్లిన వైపు వెళ్తుంది. కాచీపై చేయిచేసుకున్న ఆదిలక్ష్మీ                           అక్కడ గిఫ్ట్‌లు, స్వీట్‌లు పడేసి ఉండటం చూస అందరూ షాక్ తింటారు. వీటిని ఇక్కడ ఎవరు పడేశారోనని అనుకుంటారు.కాచీ చాలా బాధపడుతుంటుంది.అప్పుడే కావాలని ఆదిలక్ష్మీ కాచీని తిడుతుంది.నీకు పిల్లలు లేరు...కనీసం పెళ్లిరోజు జరుపుకుందామంటే అదృష్టం కూడా లేదని ఏం జాతకమే నీది అని అవమానిస్తుంది.దీంతో కాచీ ఆదిలక్ష్మీపై గొడవపెట్టుకుంటుంది.నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచే దరిద్రం తాండవిస్తోందని...ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోయిందని అంటుంది.అసుల ఇవన్నీ నువ్వు ఇక్కడ పడేసి ఉంటావని అనగానే ఆదిలక్ష్మీ కాచీపై చేయిచేసుకుంటుంది.అప్పుడే కమలాకర్‌ ఇంట్లోకి  వస్తాడు.తన కూతురుపై చేయిచేసుకోవడం చూసి కోపంతో రగిలిపోతాడు.కాచీకి క్షమాపణలు చెప్పిన ఆదిలక్ష్మీ                               ఇంట్లో ఆదిలక్ష్మీ రచ్చ చేస్తుందని వైజయంతి  కౌషికి ఫోన్ చేసి ఇంటికి రప్పిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కౌషికి ఏం జరిగిందని..అడుగుతుంది. చెంపమీద ఆ దెబ్బ ఏంటని ప్రశ్నిస్తుంది. మీ అత్తగారు చేసిన నిర్వాకమని కమలాకర్‌ అంటాడు. నా కూతురిని ఇక్కడ ఉంచితే ఇలాగేనా చూసుకునేదని అంటాడు. నువ్వు సరిగా నీ కూతురిని పెంచితే నేను కొట్టాల్సిన అవసరం ఉండేది కాదని ఆదిలక్ష్మీ అంటుంది. పిల్లల పెంపకం గురించి నువ్వే చెప్పాలని కమలాకర్ అంటాడు.నీకూతురు నీ మొగుడిని చంపి జైలుకు వెళ్లింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఎలా చూసుకోవాలో కూడా తెలియని న కొడుకు గురించి చెప్పాల్సిన పనిలేదని అంటుండగానే సురేష్ ఇంటికి వస్తాడు. కొడుకు రాక చూసి ఆదిలక్ష్మీ డ్రామా మొదలుపెడుతుంది. నువ్వు లేవని తెలిసి వీళ్లు రోజూ నన్ను హింసిస్తున్నారని చెబుతుంది. ఇదేలా కౌషికి మా అమ్మను చూసుకునేదని అంటాడు. అందరూ కలిసి మా అమ్మను బాధపెడుతున్నారని కోప్పడతాడు.                                       నిషిక కల్పించుకుని అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా మాట్లాడటమేంటని నిలదీస్తుంది. కాచీ గిఫ్ట్లు, స్వీట్లు మీ అమ్మ బయటపడేసిందని నిలదీసినందుకు కాచీని కొట్టిందని అంటుంది.అలా అని నిరూపించే సాక్ష్యాలు ఉన్నాయా అని అడగ్గా....జగధాత్రి సీసీటీపీ ఫుటేజీ చూపిస్తుంది.దీంతో ఆదిలక్ష్మీ సిగ్గుతో తలదించుకుంటుంది.మర్యాదగా కాచీకి సారీ చెప్పమని కౌషికి అనడంతో ఆదిలక్ష్మీ తప్పయ్యిందని చెప్పి వెళ్లిపోతుంది. జగధాత్రి, కౌషికి దగ్గరకు వచ్చిన సురేష్‌....ఇప్పుడు నిజం చెప్పకపోతే ఏమయ్యేదని అంటాడు. నిజం దాచి మా అమ్మ గౌరవాన్ని కాపాడి ఉండొచ్చు కదా అని అంటాడు. అప్పుడు తప్పు కాచీది అయ్యేదని అనగా...మహా అయితే ఏమయ్యాది గట్టిగా మందలించి వదిలేసేవాళ్లు...ఇప్పుడు మా అమ్మతో సారీచెప్పించి ఆమె గౌరవం తగ్గించారని అంటాడు.