Jagadhatri Serial Today Episode నిషిక, యువరాజ్ ఏదో ఒకటి చేసి జగద్ధాత్రి, కేథార్‌ల అంతు చూడాలని అనుకుంటారు. జగద్ధాత్రి, కేథార్, కౌషికి వాళ్లు సరదాగా మాట్లాడుకుంటూ తింటూ ఉంటే వైజయంతి చూసి మనం వీళ్లతో కలిసి తినొద్దు అనుకుంటారు. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామో ఎప్పుడు ఆ జగద్ధాత్రి వాళ్లకే టైం కలిసొస్తుందని అనుకుంటారు. ఇంతలో ఇంటికి పోలీసులు వస్తారు.
బూచి వాళ్లు ఏమైనా చేశారా అని యువరాజ్ని అడుగుతారు. నా భర్తనే అంటారా అని నిషిక గొడవ పడితే కౌషికి అపి పోలీసులు ఎందుకు వచ్చారా అని అడుగుతుంది. పోలీసులు వచ్చి కౌషికిని అరెస్ట్ చేస్తామని అంటారు. అందరూ షాక్ అయిపోతారు. కౌషికిని అరెస్ట్ చేయడం ఏంటి అని అంటే మేనేజర్ మీ ఆఫీస్‌లోనే దారుణ హత్యకు గురయ్యాడని ఎవరో అతన్ని బలంగా కొట్టారని పోలీసులు చెప్తారు. అతను చనిపోవడం ఏంటి అని అందరూ కంగారు పడతారు. కౌషికి కొట్టడంతో పడిపోయిన అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లి దారిలో చంపేశారని అంటారు. మేనేజర్ ఎలా చనిపోయాడు అని జగద్ధాత్రి అడిగితే కత్తితో పొడిచి చంపారు అని అంటారు. అంత కీరాతకంగా ఎవరు చంపుంటారు అని యువరాజ్ అంటాడు.
కౌషికి కంగారుతో నేను బయట వదిలేశా కానీ ఎలా చనిపోయాడో నాకు తెలీదు అంటుంది. నిషిక, యువరాజ్, వైజయంతిలు మాత్రం ఎందుకు చంపేశారు మీ కోపం మాకు తెలుసు మీరే ఇలా చేసుంటారు అని అంటారు. వాళ్ల మాటలతో కౌషికిని అరెస్ట్ చేయమని రెచ్చగొడతారు. పోలీసులు కౌషికిని అరెస్ట్ చేస్తామని అంటారు. జగద్ధాత్రి, కేథార్లు ఎంత చెప్పినా పోలీసులు వినరు. నిషిక కౌషికితో జైలు శిక్ష అనుభవించిన తర్వాత అయినా నీ కోపం తగ్గించుకో అని అంటుంది.
పోలీసులు కౌషికిని తీసుకెళ్తారు. నిషిక వాళ్లు చాలా హ్యాపీగా ఫీలవుతారు. జగద్ధాత్రి, కేథార్, సుధాకర్ బాధ పడతారు. సుధాకర్ లాయర్‌తో మాట్లాడుతాడు. జగద్ధాత్రి, కేథార్‌లు స్పాట్కి బయల్దేరుతారు. మేనేజర్ బాడీని స్టాఫ్ అందరూ చూస్తుంటారు. ఒకమ్మాయి మాత్రం బాడీ చూసి టెన్షన్ పడుతుంది. జేడీ, కేడీలు బాడీని పరిశీలిస్తారు. బాడీని చూసి ఇంత కిరాతకంగా ఎలా చంపేశారు. ఉదయం పార్టీలో ఉన్నావారే చేసుంటారని కనిపెట్టాలని అనుకుంటారు. జేడీ చూసి తర్వాత అతని షూ, కోట్ లేకపోవడం గమనిస్తుంది. కానిస్టేబుల్‌ని అడిగితే అవేమీ లేవని చెప్తాడు.
జేడీ మొత్తం చూసి మర్డర్ ఇక్కడ జరగలేదు.. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి.. పెనుగాలాట కూడా జరగలేదు.. చంపిన వాళ్లు అన్నీ వదిలేసి షూ, బ్లేజర్ ఎందుకు తీసుకెళ్తారు అని అనుకుంటారు. ఇక జేడీ కేడీతో ఇక్కడున్న వాళ్లలో ఎవరికో నిజం తెలుసు మనం కనిపెట్టాలి అని చెప్తుంది. అందర్ని పరిశీలనగా చూస్తుంది. అందరితో మీ మేనేజర్ ఎలాంటి వాడు అని అడుగుతాడు. అబ్బాయిలు మంచోడు అని చెప్తే అమ్మాయిలు మాత్రం కంగారు పడతారు. వాళ్లని జేడీ అడిగితే ఏం లేదు అనేస్తారు. జేడీ మేనేజర్ గదికి వెళ్తుంది. మొత్తం పరిశీలనగా చూస్తుంది. ఈ గది మరీ ఎక్కువ క్లీన్‌గా ఉంది.. ఎవరో కావాలనే మొత్తం క్లీన్ చేసినంత క్లీన్‌గా ఉందని అనుకుంటారు. ఆ గదిలో జేడీ ఓ గ్లాస్ ముక్క చూస్తుంది. మనం అనుకున్నట్లే ఇక్కడే ఏదో జరిగింది.. మొత్తం క్లీన్ చేసేశారని అనుకుంటారు. అక్కడ లేడీ హోయిర్ వెంట్రుక చూసి టెస్ట్‌కి పంపిస్తారు. లేడీ మట్టి గాజు పెంకు దొరుకుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.