Jagadhatri Serial Today Episode సుధాకర్, వైజయంతిల పెళ్లి రోజు వేడుకలు ఆఫీస్‌లో జరుపుతారు. కేథార్, జగద్ధాత్రి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారని కాచి చెప్పడంతో కౌషికి గిఫ్ట్ ఇవ్వమని చెప్తుంది.
కేథార్ గోల్డ్ చైన్ తీసుకొచ్చి నా కష్టార్జీతం నాన్న నా సంపాదనతో కొన్నాను.. మీ దగ్గర ఉన్నవాటి కంటే చాలా తక్కువది కానీ ప్రేమతో తీసుకొచ్చానని అంటాడు. సుధాకర్ ప్రేమని విలువ కట్టకూడదని చెప్పి తన మెడలో వేయమని కేథార్‌కి చెప్తాడు. కేథార్ చాలా సంబర పడిపోతాడు. ఇక జగద్ధాత్రి వైజయంతి కోసం పెద్ద నెక్లెస్ తీసుకొస్తుంది. నిషికి తీసుకోవద్దని చెప్తుంది. కానీ వైజయంతి నక్లెస్ నచ్చి తీసుకుంటుంది. కేథార్, జగద్ధాత్రిలు చాలా సంతోషపడతారు.
నిషిక కోపంతో వెళ్లిపోతుంటే యువరాజ్ ఆపి వాళ్లని నాన్న, అక్కలకు శాశ్వతంగా దూరం చేస్తున్నా ఒక సారి బయట ఉన్న ఫ్లెక్సీ చూసి రా అంటాడు. నిషిక వెళ్లి చూసి షాక్ అయిపోతుంది. సుధాకర్, వైజయంతిల పెద్ద ఫొటోలతో పెళ్లి రోజు శుభాకాంక్షలు జగద్ధాత్రి, కేథార్ చెప్పినట్లు వజ్రపాటి పెద్ద కొడుకు కేథార్, వజ్రపాటి పెద్ద కోడలు జగద్ధాత్రి అని రాసుంటుంది. నిషిక వెంటనే అందర్ని పిలుస్తుంది. అందరూ చూసి షాక్ అయిపోతారు. జగద్ధాత్రి కేథార్ ఏంటి ఇది అనుకుంటారు. ఇక కౌషికి జగద్ధాత్రి, కేథార్‌లను ఇలా చేస్తారని అనుకోలేదని అంటుంది.
కేథార్ అక్కతో నిజంగా ఆ ఫ్లెక్సీ ఎలా వచ్చిందో నాకు తెలీదు అంటాడు. వైజయంతి కేథార్‌ని లాగి పెట్టి కొడుతుంది. జగద్ధాత్రి మాట్లాడబోతే నువ్వు మాట్లాడకు అని అరుస్తుంది. కేథార్‌తో పోనీలే అని ఇంట్లో ఉండనిచ్చినందుకు మా పరువు తీస్తారా అని అడుగుతుంది. నిషిక కూడా నలుగురిలో మా పరువు తీయాలనా ఇలా చేశారా అని అడుగుతుంది. నా మీద ఒట్టు మాకేం తెలీదు అని జగద్ధాత్రి అంటుంది. నలుగురిలో పరువు పోయిందని కౌషికి అక్కడ చేరిన అందర్ని చూసి తల దించుకుంటుంది.
కేథార్ అందరితో ఇది నా ఫ్యామిలీ నా కుటుంబం పరువు తీయాలని మేం చూడమని అంటాడు. ఇది నీ కుటుంబం కాదు.. సరిగ్గా విను ఇది నీ కుటుంబం ఎప్పటికీ అవ్వదు కూడా.. ఆదుకొని ఆదరించినందుకు నలుగురిలో మా పరువు తీస్తారా అని సుధాకర్ కోప్పడతాడు. ఇక కౌషికి అయితే మీరు ఇలా చేస్తారని అనుకోలేదు జగద్ధాత్రి మా మంచితనాన్ని చేతకాని తనం అనుకున్నారా.. మీ మీద చూపించిన అభిమానానికి మీరు ఇచ్చిన బహుమతి ఇదా.. ఇన్నాళ్లు చేసిన మంచి ఈ ఒక్క తప్పుతో చెరిపేశారని అంటుంది. టైం చూసి భలే దెబ్బ కొట్టావురా ఇక్కడున్న వాళ్లు తీసిన ఫొటోలు వీడియోలు బయటకు వెళ్లిపోయింటాయి అని యువరాజ్ అంటాడు.
జగద్ధాత్రి ఏడుస్తూ ఈ పని మేం చేయలేదు చెప్తుంది. అందరి ముందు ఇలా సమాధానం లేని ప్రశ్నలా నిలబెడతారు అనుకోలేదు అని కౌషికి అంటుంది. ఏం చేస్తే మీరు మమల్ని ఎలా నమ్ముతారు అని కేథార్ అడుగుతాడు. దాంతో యువరాజ్ ప్రెస్‌మీట్ పెట్టి ఈ ఫ్లెక్సీకి మాకు ఏం సంబంధం లేదు.. నాకు వజ్రపాటి ఫ్యామిలీకి ఏం సంబంధం లేదని చెప్పమని అంటాడు. జగద్ధాత్రి వద్దని చెప్పినా కేథార్ చెప్తానని అంటాడు. జగద్ధాత్రి కేథార్‌తో ఇలా నువ్వు మీడియాతో చెప్తే ఇంకెప్పుడు నువ్వు మామయ్య కొడుకు అని నిరూపించుకోలేవు ప్రెస్ మీట్‌కి ఒప్పుకోవద్దని అంటుంది. నాన్న పరువు కాపాడాలన్నా అక్క నమ్మకం నిలబెట్టుకోవాలన్నా ఇదొక్కటే మార్గం ద్ధాత్రి.. ప్రేమ అంటే ఇవ్వడం అని నువ్వే చెప్పావు కదా ఇప్పుడు నేను ఇవ్వాల్సిన టైం అని కేథార్ చెప్తాడు. అందరి ముందు మీడియా ముందు చెప్తానని కేథార్ అంటాడు.
జగద్ధాత్రి కౌషికితో మేం ఇది చేయలేదు అంటే ఇంకెవరో చేశారని అర్థం కదా ఒక్క గంట టైం ఇవ్వండి అని బతిమాలుతుంది. దాంతో కౌషికి ఒక్క గంట టైం అని అంటుంది. కేథార్‌తో జగద్ధాత్రి ఆ ఫ్లెక్సీ మీద ఉన్న అడ్రస్ చూసి వాళ్లే ప్రింట్ చేశారు నేను అక్కడికి వెళ్లి కనుక్కుంటా అని జగద్ధాత్రి వెళ్తుంది. ఆ అడ్రస్‌కి వెళ్లి అడిగితే నాకు లాభం ఏంటి అని జగద్ధాత్రి మీద చేయి వేయబోతే జగద్ధాత్రి వాడి చేయి విరిచేస్తుంది. వాడిని బెదిరించి విషయం అడుగుతుంది. అతను యువరాజ్ అడ్రస్ ఇవ్వడంతో యువరాజ్ నీ పనా అని అనుకుంటుంది. ఇక సీసీ టీవీ ఫుటేజ్ తీసుకుంటుంది. వాటిని తీసుకొని జగద్ధాత్రి బయల్దేరుతుంది.
కేథార్ బాధపడుతుంటాడు. నిషిక మీడియా వచ్చింది రమ్మని చెప్తుంది. ఇంకా పది నిమిషాలు ఉన్నాయి కదా అని కేథార్ అంటే అందరూ వెళ్లమని చెప్తారు. నీకేం సాయం చేయలేనని కౌషికి అంటుంది. కేథార్ బాధగా మీడియా ముందుకు వెళ్తాడు. నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకో అని కౌషికి అంటే చేయని తప్పుని ఎలా సరిదిద్దు కోవాలో తెలీడం లేదని ద్ధాత్రి వచ్చేస్తుంది ఒక్క పదినిమిషాలు టైం ఇవ్వమని బతిమాలుతాడు. కుదరదు అని కౌషికి అంటుంది. మరోవైపు జగద్ధాత్రి పరుగులు పెడుతుంది.
కేథార్ మీడియా ముందు కూర్చొంటాడు. కేథార్ మీడియా ముందుకు వెళ్లి నేను ఒక అనాథని నా భార్య జగద్ధాత్రి. వజ్రపాటి నిషిక వాళ్ల అక్క. అదే బంధంతో కొన్నాళ్లుగా వాళ్ల ఇంట్లో ఉన్నాం. అంతకు మించి ఆ కుటుంబానికి నాకు ఏం లేదు అని కేథార్ చెప్పే టైంకి జగద్ధాత్రి ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.