Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. షాక్‌ ట్రీట్‌మెంట్ ఇస్తే సుధాకర్‌కు కాళ్లు వస్తాయని అందుకోసం ఓ పథకం వేస్తారు. నా దగ్గర విషం లేని పాములు వదిలి అవి నాన్న చూసేలా చేస్తే ఆయన భయంతో లేచి నిల్చుంటారని కేదార్ అంటాడు. క్రెడిట్‌ కేదార్‌కు పోతుందని నేనే పాముల దగ్గర నిల్చుంటానని యువరాజు అంటాడు. పాముల అతనికి డబ్బులిచ్చి కోరలు లేని పాములు కాకుండా నిజం పాములే ఇంట్లో వదిలిపెట్టేలా ఆదిలక్ష్మీ కుట్ర చేస్తుంది.మిశ్రాకు జేడీ షాక్‌                       కోర్టులో మిశ్రాను ఎదిరించిన తర్వాత ఖచ్చితంగా ఆయన తనను ట్రాన్స్‌ఫర్ చేయడమో  లేక ఈ కేసు నుంచి తొలగించడమో చేస్తాడని ముందే  ఊహించిన జేడీ....కావాలనే అతన్ని రెచ్చగొట్టి పందెంకట్టేలా చేస్తుంది.  ఇప్పుడు జేడీని ఈ కేసు నుంచి తప్పిస్తే మిశ్రా ఈగో హర్ట్‌ అవుతుంది కాబట్టి చచ్చినా ఆ పని చేయడని కేదార్ అంటాడు. జేడీ తెలివితేటలు చూసి సాధూ కూడా మెచ్చుకుంటాడు. చాలా మంచి పని చేశావని...లేకపోతే ఈ కేసు నుంచి నిన్ను తప్పించడానికి ఎంతదూరమైనా వివేక్ వెళ్లేవాడని సాధూ అంటాడు.ఇప్పుడు అతని చేతులు కట్టిపడేశావని చెబుతాడు. ఇక మేం వెళ్లి హాయిగా ఈ కేసులో సాక్షాధారాలు సంపాదించుకోవచ్చని జేడీ అంటుంది.సుధాకర్‌ బాధ                    బెడ్‌రూమ్‌ నుంచి హాల్లో కూర్చోబెట్టడానికి సుధాకర్‌ను తీసుకొస్తూ వైజయంతి ఆపసోపాలు పడుతుంది.నా నడుము విరిగిపోయిందంటూ కూలబడుతుంది. ఇంట్లో వాళ్లంతా తనకు సేవలు చేయడం చూడలేకపోతున్న సుధాకర్‌..ఆస్పత్రి నుంచి కేర్‌టేకర్‌ను రమ్మని చెబుతానని అంటాడు. ఇంట్లో ఇంతమంది ఉన్న తర్వాత కేర్‌టేకర్‌ పెట్టుకోవడం ఏంటని కమలాకర్‌, కౌషికి అంటారు. మీరు మాకు ఎప్పుడూ భారం కాదని అంటారు.అయినాకానీ మీతో ఇలా సేవలు చేయించుకోవడం నేను తట్టుకోలేకపోతున్నానని బాధపడతాడు. వైజయంతి దీర్ఘంగా ఆలోచిస్తుండటంతో కేదార్‌, జగధాత్రి ఏమైందని అడుగుతారు. నడవలేకపోతున్నందుకు బాబాయి చాలా బాధపడుతున్నారని చెబుతుంది.  ఏదైనా షాక్‌ ట్రీట్‌మెంట్ ఇస్తే నాన్న లేచి నిల్చుంటారని కేదార్‌ అంటాడు. నేను గదిలో ఇయర్‌ఫోన్‌ పెట్టుకుని అటు తిరిగి నిల్చుంటాను...మీరు డమ్మీ పాములు వదలండని అప్పుడు నాన్న నన్నుకాపాడటం కోసమైనా లేచి వస్తారని అంటాడు. దీంతో పేరు మొత్తం కేదార్‌కు పోతుందని నిషిక యువరాజుతో అంటుంది. దీంతో యువరాజు కల్పించుకుని అసలు నాన్న నిన్ను కొడుకుగానే ఒప్పుకోవడం లేదు...నువ్వు చస్తుంటే ఆయన ఎందుకు వచ్చి కాపాడతాడని అంటాడు. నేనే అక్కడ నిల్చుంటానని మీరే పాములు వదలండని అంటాడు. ఎవరు నిల్చుంటే ఏముంది నాన్న లేచి నడవడం ముఖ్యమని కేదార్ అంటాడు.పాములు పట్టే వాడిని పిలిచి కోరలు లేని పాములు తెప్పిస్తానని కేదార్ అంటాడు.ఆదిలక్ష్మీ కుట్ర                      వీళ్ల మాటలు విన్న ఆదిలక్ష్మీ నాకు మంచి ఛాన్స్ దొరికిందని సంబరపడిపోతుంది. పాములుపట్టే వాడిని మధ్యలోనే ఆపేసి...వాడికి తన చేతులకు ఉన్న బంగారు గాజులు ఇచ్చేస్తుంది. నువ్వు కోరలు లేని పాములు కాకుండా విషం ఉన్న పాములనే వాళ్లకు ఇవ్వాలని చెబుతుంది.ఈ పని చేస్తే నీకు ఇంకా చాలా డబ్బులు ఇస్తానని చెబుతుంది. ఆమె చెప్పినట్లే వాడు కోరలు తీయని విషం  ఉన్న పామును తీసుకొచ్చి ఇస్తాడు. ఈ విషయం తెలియని యువరాజు హాల్లో ఇయర్‌ఫోన్ పెట్టుకుని పాటలు వింటున్నట్లు నటిస్తాడు. అప్పుడే కేదార్ హాల్లో పామును వదులుతాడు. పాములుపట్టేవాడు పోలీసులు వచ్చి నన్నే పట్టుకుంటారని భయపడుతూ ఆదిలక్ష్మీకి చెబుతాడు. నువ్వేభయపడకని  ఆ విషం ఉన్న పాములు ఇవ్వమని జగధాత్రి,కేదార్‌ చెప్పారని చెప్పు అంటుంది. ఈ దెబ్బకు ఒక కొడుకు పాము కరిచి ప్రాణాలు కోల్పోతే...ఇంకో కొడుకు జైలుపాలవుతాడని ఆదిలక్ష్మీ సంబరపడిపోతుంది. హాల్లో పాము రావడం చూసి సుధాకర్‌ అరవడంతో ఈరోజు ఎపిసోడ్‌ ముగిసిపోతుంది.