Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది.కమలాకర్‌నూ దూరం చేసుకుంటే ఇంటికి మనమే దూరమవుతామని వైజయంతి చెప్పడంతో యువరాజు వాళ్ల బాబాయికి సారీ చెప్పి దగ్గరవుతాడు. దీంతో ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. స్టేషన్‌కు వెళ్లిన జేడీకి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటో ఇవాల్టి ఎపిసోడ్‌లో చూద్దాంమెట్టుదిగిన యువరాజు                         కమలాకర్‌పై కత్తితో దాడి చేసి గాయపరిచినందుకు వైజయంతి యువరాజును గట్టిగా మందలిస్తుంది. కమలాకర్‌ మనవైపు ఉంటేనే ఈఇంట్లో మనం ఏమైనా చేయగలమని చెబుతుంది. వెళ్లి మర్యాదగా సారీ  చెప్పి ఆయన్ను ఎలాగైనా మనవైపు  తిప్పుకోవాలని సూచిస్తుంది. ఉదయం అందరికీ ఇష్టమైన టిఫిన్‌లు రెడీ చేసి ఉంచుతుంది జగధాత్రి...కిచెన్‌లో ధాత్రి, కౌషికి కమలాకర్‌,కేదార్‌ నవ్వులు చూసి వైజయంతి, నిషిక,యువరాజు మండిపడిపోతారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఆదిలక్ష్మీ వాళ్లను మరింత రెచ్చగొడుతుంది.పరాయివాళ్లు ఇంట్లోవాళ్లయ్యారు...ఇల్లు మాది అనుకున్నవాళ్లు పరాయివాళ్లు అయ్యారని దెప్పిపొడుస్తుంది. వాళ్లెవ్వరూ మిమ్మల్ని టిఫిన్లకు పిలవరని...మీది కూడా నా బతుకులాంటిదేనని చెప్పి టిఫిన్ చేద్దాం రండి అంటూ వాళ్లను పిలుస్తుంది. ఆదిలక్ష్మీ కావాలనే రెచ్చగొడుతుందని...నువ్వు ఆవిడ మాటలు ఏవీ పట్టించుకోవద్దని వైజయంతి చెబుతుంది.                     టిఫిన్ పెట్టమని ఆదిలక్ష్మీ  అరవడంతో జగధాత్రి వంటలన్నీ డైనింగ్‌ టేబుల్‌ వద్దకు తీసుకొస్తుంది.కమలాకర్‌ కూర్చోగా...అక్కడికి వచ్చిన యువరాజు వెళ్లి పక్కన కూర్చుంటాడు. దీంతో కమలాకర్‌ లేచి వెళ్లిపోతాడు. అయినా సరే మళ్లీ వెళ్లి పక్కనే కూర్చోగా...నాకు ఆకలిగా లేదని చెప్పి కమలాకర్‌ వెళ్లిపోతుంటే వైజయంతి ఆపి ప్రశ్నిస్తుంది. ఎందుకు యువరాజు నీ పక్కన కూర్చుంటే వెళ్లిపోతున్నావని అడుగుతుంది.నిన్న జరిగినదానికి అబ్బోడు చాలా బాధపడుతున్నాడని...నీకు సారీ చెప్పడానికి వస్తుంటే ఎందుకు వెళ్లిపోతున్నావని అంటాడు. కేదార్‌ కూడా వచ్చి వాళ్ల బాబాయికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా...నీ బోడి రికమండేషన్ నాకు అవసరం లేదని యువరాజు అంటాడు. నాకు మీరంతా కావాలని వచ్చానని కానీ మీరు ఇలా ఎడముఖం పెడమఖంగా ఉంటే చూడలేకపోతున్నానని కేదార్ అంటాడు. నావల్ల నువ్వు, యువరాజు గొడవపడటం నాకు  నచ్చలేదని చెబుతాడు. సుధాకర్‌ కూడా చెప్పడంతో యువరాజు వచ్చి కమలాకర్‌కు సారీ చెబుతాడు.దీంతో  కమలాకర్‌ యువరాజును క్షమించేస్తాడు.  మీరిద్దరూ ఈ ఇంటికి రెండు కళ్లులాంటివాళ్లని అనడంతో యువరాజు మళ్లీ కోప్పడతాడు...జేడీని ఓడించడానికి మీనన్‌ పావులు                               గణేశ్‌ను  జేడీ కోర్టుకు తీసుకెళ్తుందని వాడు అక్కడ నోరు విప్పితే మనకు ఇబ్బందులు తప్పవంటూ మినిస్టర్‌, ఆది మీనన్‌ దగ్గరకు పరుగెత్తుకుంటూ వస్తారు. మేం ఇంత  టెన్షన్ పడుతుంటే నువ్వు తాపీగా మందు తాగుతున్నావని అరుస్తారు. మీరు ఏం కంగారుపడొద్దని..కేసు జేడీ చేతిలో ఉన్నా మనం చెప్పినట్లు ఆడుతుందని అంటాడు. ఎందుకంటే ఆ సాధూ పైన ఉండే పోస్టులో ఇప్పుడు మనవాడు వచ్చి కూర్చున్నాడని చెబుతాడు. కాబట్టి కేసు మనం చెప్పినట్లు నడుస్తుందని అంటాడు. దీంతో మినిస్టర్ రిలాక్స్‌ అవుతాడు. ఇంతలో జేడీ,కేడీ ఇద్దరూ స్టేషన్‌కు వెళ్తారు. గణేశ్‌ను కోర్టుకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తుంటారు.ఇంతలోసాధూ కూడా అక్కడికి వస్తాడు. సింధూ లాగ్‌బుక్ తెచ్చి గణేశ్‌ను ఆల్రెడీ కోర్టుకు తీసుకెళ్తున్నట్లు ఉందని చెబుతుంది.కానిస్టేబుళ్లు వచ్చి సెల్‌లో గణేశ్‌ లేడని చెబుతారు. ఏం జరిగిందని జేడీ సాధూను అడగ్గా...అసిస్టెంట్‌ కమిషనర్‌గా బీహార్‌కు చెందిన మిశ్రాను నియమించారని...అతను వచ్చి గణేశ్‌ను కోర్టుకు తీసుకెళ్లాడని చెబుతాడు. క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఆ మిశ్రాను మనపైన వేశారంటే ఇదంతా ఆ మినిస్టర్‌,మీనన్‌ పనే  అని జేడీ అంటుంది.