Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. కేదార్‌ను ఈ ఇంటి వారసుడిగా మీరు అంగీకరించకపోతే నేను దత్తత తీసుకుంటానని కమలాకర్ అంటాడు. ఆ మాటలు విన్న యువరాజు కోపంతో రగిలిపోతాడు. మర్యాదగా ఆ మాటలు వెనక్కి తీసుకోకుంటే  చంపేస్తానని బెదిరించి కత్తి తీసుకుని వస్తాడు. బాబాయి మీదకు  కత్తి తీసుకుని  వచ్చిన యువరాజును కేదార్ అడ్డుకోగా....యువరాజు కత్తితో పొడవబోతాడు. అప్పుడు కమలాకర్‌ అడ్డుకోవడంతో చేతికి గాయం అవుతుంది.కేదార్‌ను దత్తత తీసుకుంటానన్న కమలాకర్‌                               కేదార్‌ను  యువరాజు, నిషిక అవమానిస్తుంటే కమలాకర్ చూస్తూ తట్టుకోలేకపోతాడు. మా అన్నయ్య నిజం చెప్పకపోయినా  వీడు ఈ ఇంటి వారసుడేనని అంటాడు. అందుకే ఈ ఇంటికి కష్టం వచ్చిన ప్రతిసారీ వీడు అండగా ఉంటున్నాడని....పెద్దకోడలు అనుకున్నది కాబట్టే జగధాత్రి ఇంటికోసం పాటుపడుతోందని అంటాడు. మీకు ఎవరికైనా వాడిని ఈ ఇంటి కొడుకుగా అంగీకరించలేందుకు అభ్యంతరం ఉంటే నేనే వాడిని దత్తత తీసుకుంటానని చెప్పడంతో ఇంట్లో అందరూ షాక్ తింటారు. ఆ మాటలు విన్న కేదార్‌, జగధాత్రి, కౌషికి ఎంతో ఆనందిస్తారు. ఇప్పటికైనా  కేదార్‌ను అర్థం చేసుకున్నావని కౌషికి అంటుంది. కమలాకర్‌ మాటలకు యువరాజుకు  కోపం వస్తుంది. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదని అంటాడు. ఈ గొడవ ఇంతటితో ఆపండని కౌషికి అనగా....ఈరోజే ఈ వ్యవహారం తేలిపోవాలని నిషిక అంటుంది. అప్పుడు,ఇప్పుడు నాది ఒకటే మాటని...వజ్రపాటి వంశానికి ఒక్కడే వారసుడని అది నేనేనని అంటాడు. ఈ మాటలు విన్న కమలాకర్‌ వీడికి డబ్బుపిచ్చి పట్టిందని అంటాడు. ఆస్తి, పదవి తప్ప...వీడికి బంధాలు, బంధుత్వాలు పట్టడం లేదని అంటాడు. కేదార్  ఈ ఇంంటి బిడ్డ అని ఈ నాలుగుగోడల మధ్య ఉన్నవారికే తెలియడం వల్లే వీడు వారసుడు , వారసుడిని అని విర్రవీగుతున్నాడని కమలాకర్‌ అంటాడు. రేపు కాచీ పెళ్లిరోజు వేడుకలో నేనే అందరి ముందు కేదార్‌ ఈ ఇంటి పెద్దకొడుకుగా  ప్రకటిస్తానని చెబుతాడు. అప్పుడు వీడికి ఆ వారసుడిని అనే పిచ్చి పోతుందని అంటాడు.కత్తితో పొడిచిన యువరాజు                  కమలాకర్‌ మాటలకు పిచ్చెక్కిపోయిన యువరాజు లోపలికి వెళ్లి కత్తి తీసుకుని వస్తాడు.దీంతో అందరూ భయపడిపోతారు. మర్యాదగా మీరు అన్న మాటలు వెనక్కి తీసుకోకుండా చంపేస్తానని హెచ్చరిస్తాడు. ఆ మాటలు విన్న కేదార్‌కు కోపం వస్తుంది.ఇప్పటి వరకు సహించానని బాబాయిని ఏమన్నా అన్నావంటే చూస్తూ ఊరుకోనని అంటాడు. అసలు నిన్ను చంపితే ఈ గొడవలన్నీ ఆగిపోతాయని కేదార్‌ను పొడవబోతాడు. అప్పుడు కమలాకర్‌ ఆ కత్తిని చేతితో పట్టుకోగా....గాయమై రక్తం కారుతుంది. అందరూ కలిసి యువరాజు పక్కకు లాగుతారు. కౌషికి వచ్చి యువరాజు చెంప పగులగొడుతుంది. ఇలాంటి అర్థంలేని ఆవేశంతోనే ఇంతవరకు తీసుకొచ్చావని అంటుంది. వైజయంతి కొడుకుని రూమ్‌లోకి లాక్కెళుతుంది. కొడుకును కొట్టి ఎవరిమీద కత్తి ఎత్తుతున్నావురా అని అరుస్తుంది. కమలాకర్‌ నాకు మరిది మాత్రమే కాదురా....కొడుకులాంటి వాడని అంటుంది. ఈ ఆస్తి నీచేతికి రావాలని...కంపెనీ మొత్తానికి నువ్వే  యజమానిగా ఉండాలని కోరుకున్నానే తప్ప...నువ్వు ఇలా ఇంట్లో వాళ్లని చంపుతానని అంటే చూస్తూ ఊరుకోనని అంటుంది. అయినా వాళ్లను చంపితే నువ్వు జైలుకుపోతావు కానీ ఆస్తికి వారసుడివి ఎలా అవుతావురా అని గడ్డిపెడుతుంది. నేను మీనాన్నను కూడా మోసం చేసి ఇన్నాళ్లు కష్టపడింది నువ్వు జైలుకు వెళ్తే చూడటానికా అని అంటుంది. ముందు వాళ్ల వైపుకి వెళ్లిన మీ బాబాయిని మన వైపు తిప్పుకుంటే మీ బాబాయే వాళ్లను తన్ని తరిమేస్తాడని చెబుతుంది. కాచీ పెళ్లిరోజు వేడుకలో మీ బాబాయి ఎలాంటి ప్రకటన చేయకుండా నేను అడ్డుకుంటానులే అని చెప్పడంతో యువరాజు కొంత శాంతిస్తాడు. ఇదే అదునుగా ఆదిలక్ష్మీ ఈ కుటుంబాన్ని విడదీయడానికి ఎత్తులు వేస్తుంటుంది.