Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది.తండ్రిని కాపాడుకోవడం కోసమే గణపతి అబద్ధం చెబుతున్నాడని తెలుసుకున్న జేడీ..కాచీకి పెళ్లిరోజు ఫంక్షన్ చేసేందుకు ఇంట్లో వాళ్ల కోసం కమలాకర్ చీరలు తెప్పించగా...నిషిక, యువరాజు కేదార్‌ను అవమానించాలని చూస్తారు. ఈరోజుతో కేదార్ వ్యవహారం తేలిపోవాలని కమలాకర్ అంటాడు. కేదార్ మీ కొడుకు అవునో కాదో చెప్పాలని వాళ్ల అన్నయ్యని అడగ్గా...నా కొడుకు కాదని సుధాకర్ చెబుతాడు. దీంతో నిషిక,వైజయంతి ఆనందపడిపోతాడు. దీంతో కమలాకర్ కేదార్‌ను దత్తత తీసుకుంటానని అంటాడు.బయటపడిన గణపతి గుట్టు జేడీ,కేడీ గణపతి ఫ్రెండ్స్‌లా వెళ్లి వాళ్ల అమ్మానాన్నలను ఆరా తీసినా నిజం చెప్పకపోవడంతో జేడీ ప్లాన్ బి అమలు చేస్తుంది.రమ్యకు డబ్బులిచ్చి పంపించి గణపతి ఇచ్చినట్లు చెప్పిస్తుంది.దీంతో రమ్య నిజంగానే గణపతి ఫ్రెండ్స్ అనుకుని వాళ్ల అమ్మ నిజం చెప్పేస్తుంది. వాళ్ల నాన్న కోసమే గణపతి చేయని నేరం నెత్తిన వేసుకున్నాడని చెబుతుంది.అయినా మీరు ఎందుకు ఒప్పుకున్నారని అడగ్గా...రెండేళ్లలో బయటకు తీసుకొస్తామని మాటిచ్చారని అందుకే గణపతి నేరం తనపై వేసుకున్నాడని చెబుతుంది. పోనీ ఊ కిడ్ని తెప్పించిన వాళ్లు ఎవరో తెలుసా అని అడిగితే మాకు ఏం తెలియదని...మా అబ్బాయి అన్నీ చూసుకున్నాడని చెబుతారు. దీంతో వీళ్లకు ఏం తెలియదని జేడీ అనుకుంటుంది. ఇక రమ్యను బయటకు రమ్మని చెబుతుంది. మనం వీలైనంత త్వరగా ఆ కిడ్నీ మార్పిడికి డబ్బులు ఎవరు ఎలా ఇచ్చారో కనిపెడితే...ఈకేసులో ముందుకు వెళ్లొచ్చని చెప్పి జేడీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.ధాత్రిని అవమానించిన నిషిక కాచీ బర్త్‌డే జరగకుండా ఆదిలక్ష్మీ రచ్చ చేయడంతో ఈసారి కాచీ పెళ్లిరోజును గ్రాండ్‌గా చేయాలని కమలాకర్ అనుకుంటాడు. అందుకోసం ఇంట్లో వాళ్లందరికీ చీరలు తెప్పిస్తాడు.అందరూ వచ్చి ఎవరికి నచ్చినవి వాళ్లు సెలక్ట్ చేసుకోవాలని చెబుతాడు. కమలాకర్ కేదార్, జగధాత్రితో చాలా కలివిడిగా ఉండటం చూసి నిషిక,వైజయంతి కుళ్లుకుంటారు.ఎలాగైనా ఇవాళ జగధాత్రికి బుద్దిచెప్పాలని నిర్ణయించుకుంటారు. చీరలు చూసేందుకు జగధాత్రి రాగా...నిషిక,వైజయంతి అవమానిస్తారు. మామయ్య చెప్పింది వజ్రపాటి కుటుంబం ఫంక్షన్ అని ...మీరు ఎందుకు వస్తున్నారని నిషిక నిలదీస్తుంది. ఇంట్లో పనివాళ్లకు తర్వాత సాదా చీరలు తెప్పిస్తానని వైజయంతి అంటుంది. ఇంతలో కౌషికి కలుగజేసుకుని ఎందుకు అలా మాట్లాడుతున్నారని అంటుంది. ఇవాళ ఈ విషయం తేలిపోవాలని నిషిక అంటుంది.అసలు వీళ్లు ఏ హక్కుతో ఈ ఇంట్లో ఉంటున్నారని అడుగుతుంది.దీనికి ఇది పుట్టినిల్లుకాదు,మెట్టినిల్లు కాదని అంటుంది. పనివాళ్లను పనివాళ్లగానే ఉండనివ్వాలని అంటుంది. దీంతో కేదార్‌కు కోపం వచ్చి నేను ఈ ఇంటి బిడ్డనని...జగధాత్రి నా భార్యగా ఈ ఇంటి పెద్దకోడలని అంటాడు. ఈ మాట వినగానే యువరాజుకు కోపం వచ్చి కేదార్‌ను కొడతాడు. ఇంకొకసారి ఈమాట అన్నావంటే చంపేస్తానని బెదిరిస్తాడు. నువ్వు కొట్టినంత మాత్రాన నిజం చెరిగిపోదని కేదార్ అంటాడు. నువ్వేమీ మాట్లాడవేంటి బాబాయి అని కమలాకర్‌ను యువరాజు అడుగుతాడు. ఖచ్చితంగా ఈ ఫంక్షన్‌కు వజ్రపాటి కుటుంబానికే ఆహ్వానం ఉందని...బయటివాళ్లకు లేదని చెప్పడంతో నిషిక ముఖం వెలిగిపోతుంది.కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్ కమలాకర్ తమవైపు తిరిగాడని వాళ్లు సంతోషించేలోపు....జగధాత్రిని వచ్చి చీర సెలక్ట్ చేసుకోమని అంటాడు. ఇంటి కోడలివి నీకు కొత్త చీర లేకపోతే ఎలా అని అనగానే కేదార్, జగధాత్రి ఎంతో సంతోషిస్తారు. మీరు నిజంగా మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ చెబుతారు. మీరు ఎన్ని అవమానాలు చేసినా...వాళ్లు భరిస్తూ వచ్చారని యువరాజును కమలాకర్ తిడతాడు.ఇప్పటికైనా వాళ్లను అర్థం చేసుకోమని అంటాడు. వాళ్ల మన ఇంటివాళ్లు ఎలా అవుతారని యువరాజు అడగ్గా...ఆ విషయం మీనాన్నే చెప్పాలని అంటాడు.ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇవాళ ఈ విషయం తేలిపోవాలని కమలాకర్ అంటాడు. వాళ్ల అన్నయ్యను నిజం చెప్పమని చెబుతాడు. అందరి ముందు నిజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా...కనీసం నాలుగు గోడల మధ్య అయినా కేదార్‌ను మీ కొడుకుగా అంగీకరించమని జగధాత్రి కోరుతుంది.
వైజయంతి బెదిరించడంతో సుధాకర్ కేదార్ నా కొడుకు కాదని చెబుతాడు. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో నిషిక ఆనందపడిపోతుంది.మామయ్యగారే చెప్పారు కదా...ఇక మీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని...పనిమనుషుల్లా ఒక మూలనపడి ఉండండని నిషిక అంటుంది. దీంతో కమలాకర్ కేదార్‌ను దత్తత తీసుకుంటానని అనడంతో అందరూ షాక్ తింటారు.ఆ మాటలకు యువరాజుకు కోపం వస్తుంది. కేదార్ ఈ ఇంటివాడన్న సంగతి ఇక్కడ ఉన్న అందరికీ తెలిసినా...ఏ ఒక్కరూ నిజం ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదని అందుకే నేను వాడిని దత్తత తీసుకుని వజ్రపాటివారి వంశంలోనే కలిపేసుకుంటానని చెబుతాడు.
