Jagadhatri Serial Today Episode: కౌషికి సురేష్ మీద అనుమానం పెంచి వాళ్లిద్దరినీ దూరం చేయాలని ప్లాన్ వేసిన దివ్యాంక...కావాలనే సురేష్ వాళ్ల ఇంటికి వెళ్తుంది. అప్పుడే పాప బర్త్‌డేకు పిలవడానికి కౌషికి సురేష్‌కు ఫోన్ చేయగా....అక్కడ ఉన్న దివ్యాంక ఆ ఫోన్ లిప్ట్ చేసి మాట్లాడుతుంది. నువ్వు అక్కడ ఎందుకు ఉన్నావని జగధాత్రి నిలదీయగా.....మాకు మాకు సవాలక్ష పనులు ఉంటాయని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత సురేష్ వచ్చిన తర్వాత కావాలనే కిందపడినట్లు నాటకమాడుతుంది. దీంతో సురేష్ లోపలకి వెళ్లి మందు తీసుకొస్తానంటూ వెళ్తాడు. అప్పుడే మళ్లీ దివ్యాంక సురేష్ ఫోన్ నుంచే వీడియో కాల్ చేస్తుంది. అదిచూసిన కేదార్...ఖచ్చితంగా ఇది బావ చేసిన ఉండడని చెబుతాడు. ఆ దివ్యాంక కావాలనే ఇదంతా చేస్తోందని అర్థమవుతోంది కదా అని అంటాడు.దయచేసి ఆ వీడియోకాల్ లిప్ట్ చేయవద్దని చెబుతాడు. కానీ అక్కడే ఉన్న వైజయంతి వచ్చి కౌషికి చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని వీడియో కాల్ లిప్ట్ చేస్తుంది. అక్కడ దివ్యాంక కాలుకి సురేష్ మందురాయడాన్ని వీడియోలో చూపిస్తుంది దివ్యాంక. దీంతో కౌషికి కోపంతో రగిలిపోతుంది. ఆ మంటపై పెట్రోలు చల్లినట్లు వైజయంతి, యువరాజు, నిషిక కూడా ఇంకా కాస్త పెంచుతారు. నిన్ను వదిలిన గంటల్లోనే ఆ దివ్యాంకను ఇంటికి పిలిపించుకున్నాడని అంటారు. దీంతో కోపంతో కౌషికి లోపలికి వెళ్లిపోతుంది. భోజనం సమయానికి కేదార్,జగధాత్రి కౌషికి, కీర్తిని ఒప్పించి కిందకు రప్పిస్తారు. అప్పుడే భోజనం చేస్తుండగా....దివ్యాంక గిప్ట్ ప్యాక్ పట్టుకుని అక్కడికి వస్తుంది. ఆమెను చూసిన కౌషికి కోపంతో రగిలిపోయి ఇక్కడికి ఎందుకు వచ్చావని నిలదీస్తుంది. మర్యాదగా నా ఇంటిలో నుంచి బయటకు వెళ్లు అంటూ హెచ్చరిస్తుంది. నేను నీతో గొడవపడటానికి రాలేదని...వచ్చే నెలలో నీ బర్త్‌డే ఉంది కదా అప్పటికి నువ్వు ఎలాగో జైలులో ఉంటావని ముందే గిప్ట్ ఇద్దామని తీసుకుని వచ్చానని అంటుంది. దీంతో కేదార్, జగధాత్రి ఆమెకు గట్టిగా రిటర్న్ వార్నింగ్ ఇస్తారు. మా వదినకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని...ఇదేఇంటిలో గ్రాండ్‌గా పార్టీ చేస్తామని జగధాత్రి చెబుతుంది. అప్పటికీ నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు కాబట్టి....ప్రత్యేక అనుమతి తీసుకుని మరీ కేక్ జైలుకే పంపిస్తామని చెబుతారు. ఈ తతంగం మొత్తం నిషిక వీడియో తీస్తుంటుంది. ఎందుకు వీడియో తీస్తున్నావని వైజయంతి అడగ్గా...దివ్యాంక తీయమని చెప్పిందని అంటుంది.ఏదో పెద్ద ప్లాన్‌తోనే వచ్చిందని అంటుంది.ఈ వీడియో చూసిన తర్వాత వదిన,అన్నయ్య శాశ్వతంగా విడిపోతారని చెప్పిందని చెబుతుంది. కౌషికి గిప్ట్ తీసుకోకపోవడంతో దివ్యాంక ఆ గిప్ట్ కీర్తికి ఇచ్చేందుకు వెళ్తుంది. కోపంతో రగిలిపోయిన కౌషికి ఆ గిప్ట్ తీసుకుని నేలకేసి కొడుతుంది. మర్యాదగా మా ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని చెబుతుంది.ఇదంతా వీడియో తీస్తున్న నిషిక వైపు చూసి కనుసైగ చేస్తూ దివ్యాంక వెళ్లిపోవడం ధాత్రి చూస్తుంది. సురేష్ ఇంటికి వెళ్లిన దివ్యాంక...అక్కడ పాపకోసం సురేష్ గిప్ట్ తీసుకుని ఉండటం చూస్తుంది.ఇప్పుడు నువ్వు వెళ్లినా కౌషికి ఇంటికి రానివ్వదని...నేను వెళ్లి పాపకు గిప్ట్ ఇస్తానని చెప్పి దివ్యాంక తీసుకుని వస్తుంది.ఆ గిప్ట్ పాకకు ఇస్తుంటే కౌషికి నేలకేసి కొట్టినట్లు వీడియో చిత్రీకరించి సురేశ్‌కు పంపిస్తుంది. అది చూసిన సురేష్ చాలా బాధపడతాడు. దివ్యాంక,నిషికకు సైగ చేయడం చూసిన ధాత్రి....మళ్లీ వీళ్లు ఏదో ప్లాన్ చేస్తున్నారని కేదార్‌కు చెబుతుంది.ఆ వెంకటేష్ కేసు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అంటుంది. డ్రాగన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియక జుట్టు పీక్కుంటున్న మీనన్‌కు జేడీపై అనుమానం వస్తుంది.ఇలాంటి ప్లాన్‌లు జేడీ మాత్రమే వేస్తుందని అనుకుని...ఆ డ్రాగన్ గురించి ఎంక్వైయిరీ చేయిస్తాడు.అప్పుడు ఆమె జైలు నుంచి వచ్చిందని...చిల్లర దొంగ అని తెలుసుకుంటాడు. ఇప్పటి వరకు నువ్వు ఆడించావు కదా....ఇక నేను ఆట ఆడిస్తానని మీనన్ తన ఇంటికి బయలుదేరతాడు.