Jagadhatri Today Episode: మన ఛానల్ ని ఎందుకు టార్గెట్ చేశారు అర్థం కావట్లేదు అని కౌశికి అంటుంది. మినిస్టర్ అయినా, ఇంకెవరైనా మన ఫ్యామిలీని గాని, మన కంపెనీని గాని టచ్ చేయలేరు. మీరు చూస్తూ ఉండండి అని ధాత్రి ధైర్యం చెబుతుంది. మరోవైపు మీనన్ దగ్గర మినిస్టర్ హరినాథ్ చాలా గాబరా పడుతూ ఉంటాడు. అసలు పోలీసులు ఎందుకు వచ్చారు వాళ్లకి ఎలా తెలిసింది అని అంటాడు. నేను వేస్తున్న ప్రతి అడుగులోని జేడీ అనవసరంగా నా విషయాలలోకి వస్తోంది అంటాడు. మరోవైపు కౌశికి ని నా కాళ్ళ దగ్గరికి పట్టుకొస్తానని చెప్పి, నన్ను రోడ్డు మీద పడేసావు కదా అని మినిస్టర్ భయపడడంతో మీనన్ మినిస్టర్ మీద మండిపడతాడు మీనన్ అంటే చావు. చావును మించిన భయం ఏం ఉంటుంది చెప్పు అని మినిస్టర్ హరినాథ్ ని భయపెట్టి ఓకే అనేలా చేస్తాడు.
కేదార్: అంత దీర్ఘంగా ఏంటి ఆలోచిస్తున్నావు ధాత్రి
ధాత్రి: మనం ఒక ఫేక్ ఫోటోని వదినకి చూపించి ఇంట్లో ఉండనిచ్చారని సంబరపడిపోయి ఆ విషయమే పూర్తిగా మరిచిపోయాం కేదార్
ధాత్రి: కానీ మనం చేస్తున్నది ముళ్ళ ప్రయాణం అని అది మనకి గుచ్చుకొని గాయం చేసేంతవరకు మనకు తెలియదు. మనం చూపించిన సాక్ష్యం ఫేక్ అని తెలిసినా. మన పెళ్లి అబద్ధపు పెళ్లి అని తెలిసినా ఆ తర్వాత మనం తీసుకుని వచ్చే ఏ సాక్ష్యానికి ఏ విలువ ఉండదు. మనం ఇచ్చిన ఫోటో ఫేక్ అని డౌట్ వచ్చిన ముందే మనం ఏదో ఒకటి చేసి నువ్వు సుధాకర్ మావయ్య కొడుకు అని ప్రూవ్ చేసే సాక్ష్యాన్ని సంపాదించాలి. లేకపోతే జీవితంలో మనం ఇక్కడ ఇంకా అడుగుపెట్టలేము.
కేదార్: ఈ మిషన్ అయ్యాక మన తక్షణ కర్తవ్యం ప్రూఫ్ ని వెతకడమే ధాత్రి
ధాత్రిని వాళ్ళ అత్తయ్య పిలిచిన తర్వాత అక్కడికి నిశిక వచ్చి, ధాత్రికి , తన అత్తగారికి ఇద్దరి మధ్యలో పుల్లపడ్డడానికి ట్రై చేస్తుంది. వాళ్లని ఈ పెళ్లి వరకు వాడుకొని ఆ తర్వాత పడేస్తాను అని చెప్తుంది. వాళ్ళని టిష్యూ పేపర్లలాగా వాడుకొని వదిలేస్తా అని చెబుతుంది. నిశ్చితార్థం టైం అవుతుంది కదా.. అఖిలాండేశ్వరిని, పెళ్లి కొడుకుని గేటు దగ్గర ఉండి రిసీవ్ చేసుకోండి ధాత్రి, కేదార్ లకి చెబుతుంది. నిశీ, యువరాజుల్ని పంపిద్దామని, మర్యాదగా ఉంటుందని ధాత్రి చెబుతుంది. నువ్వు వాసుకికి అన్నలాంటి వాడివే కదా వెళ్ళు అని చెబుతుంది. అలా అనటంతో ధాత్రి ఇప్పుడే వెళ్లి తీసుకు వస్తామని బయలుదేరుతుంది.
ఇక్కడ కౌశికి వచ్చి వెళ్ళి రిసీవ్ చేసుకుందాం పద అని అడిగితే ధాత్రి వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వెళ్లారు అని వీళ్ళ దగ్గర కూడా ధాత్రి, కేదార్ లని ఇరికించాలని నిషిక ప్రయత్నిస్తుంది. దీంతో మనిషిని అనుమానించడం కాదు అర్థం చేసుకో అని కౌశిక నిషికకి బుద్ధి చెబుతుంది.
ధాత్రి కేదార్లు అఖిలాండేశ్వరిని, వాళ్ళ కొడుకుని వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. అక్కడికి మాధురిని ఒకప్పుడు ప్రేమించానని వచ్చి, ఇబ్బంది పెట్టి జైలు పాలైన భరత్ వచ్చి మాధురిని పెళ్లి చేసుకోవడంమో, చంపడమో ఏదో ఒకటి చేస్తా అని నిర్ణయించుకుంటాడు. లోపలికి వస్తున్న భరత్ ని ధాత్రి చూస్తుంది. భరత్ అనే అనుమానిస్తూ కేదార్ కూడా వస్తాడు. అంతలోని మిస్ అవుతాడు భరత్.
ధాత్రి : ఈ భరత్ బెయిల్ మీద బయటకు వచ్చాడు , మాధురి ఎంగేజ్మెంట్ అని తెలుసుకొని గొడవ చేయడానికి ప్రయత్నిస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. వీడిని ఎలాగైనా అఖిలాండేశ్వరి దగ్గరికి రాకుండా ఆపాలి. మాధురి అత్తింటి వాళ్ల ముందు తప్పు చేసినదానిలా నిలబడకూడదు. ఇద్దరు భరత్ ని వెతకడం మొదలు పెడతారు.
నిషిక అఖిలాండేశ్వరి దగ్గర పాత విషయాలు ఎత్తడం మొదలు పెడుతుంది. ఏది ఏమైనా మీరు పేపర్లు తీసుకొనే ఎంగేజ్మెంట్ చేసుకోండి అని చెబుతుంది. మీ కుటుంబ పరువు కాపాడటం కోసం, బాధ్యతతో చేస్తున్నావా అని అని గట్టిగా అడుగుతుంది అఖిలాండేశ్వరి. ఇంతలో పక్కకి పిలిచి నిషికని విషయం అడుగుతుంది భవానీ. మరోవైపు భరత్ సీక్రెట్ గా గోడ దూకి లోపలికి వస్తాడు. దూరం నుండి కౌశిక, ధాత్రిలు మేకప్ చేస్తున్న పెళ్లికూతురుని చూస్తాడు. బయట సెక్యూరిటీ గార్డు భరత్ ని చూసి పట్టుకోడానికి ట్రై చేస్తాడు. వాడు యువరాజ్ కి దొరుకుతాడు. నా చెల్లెలు జీవితం నాశనం చేసింది చాలా మళ్లీ ఇక్కడకు వచ్చి ఏం చేద్దాం అని అనుకుంటున్నావు అని అడుగుతాడు.. మాధురి కి సారీ చెబుదాం వచ్చాను తప్ప నాకు ఏ ఉద్దేశం లేదు అంటాడు. భరత్ ని వాడుకొని పెళ్లి చెడగొడదామని యువరాజ్ ప్లాన్ చేస్తాడు. యువరాజ్ ని వాడుకొని మాధురిని పెళ్ళి చేసుకుందామని భరత్ ప్లాన్ చేస్తాడు. ధాత్రి కేదార్ లు వాడు లోపలికి రాకూడదు, పెళ్ళికొడుకు వాళ్ళని కలవకూడదు అని ఫోన్ లో మాట్లాడుకుంటారు.
కౌశికి : ధాత్రి.. నీ గొంతులో కంగారుకి, మనసులో భయానికి కారణమేంటి చెప్పు ..