Jagadhatri Serial Today Episode: కీర్తి బర్త్‌డేపార్టీకి తప్పకుండా వస్తానని సురేష్ చెప్పడంతో జగధాత్రి అదే విషయం కీర్తికి చెప్పిరెడీ అవ్వమని చెబుతుంది.ఇంతలో బర్త్‌డే పార్టీకి డెకరేషన్ చేసేందుకు కేదార్, యువరాజు కలిసి బెలూన్లు కట్టడం చూసి సుధాకర్ ఎంతో సంతోషపడతాడు.వీళ్లిద్దరూ కొట్టుకోకుండా ఇలా సంతోషంగా ఉంటే చాలాని అనుకుంటాడు.సుధాకర్ అలా సంతోషపడటం చూసి వైజయంతి,నిషిక కోపంతో రగిలిపోతారు.యువరాజుకు ఏం తెలియడం లేదా అనుకుంటారు.ఇంతలో నిషిక వెళ్లి కేదార్‌ను లాక్కుని వస్తుంది.నువ్వు ఏం చేస్తున్నావో తెలుస్తుందా అని నిలదీస్తుంది. కీర్తి బర్త్‌డే కోసం బెలూన్లు కడుతున్నానని అంటాడు. అసలు నువ్వు ఈ కంపెనీకి సీఈవో అవ్వాలని అనుకుంటున్నావా లేక మీఅక్క వెనక తోకలా జీవితాంతం తిరుగుతావా అని అంటుంది. మేం అసలు ఈ బర్త్‌డే జరగకూడదని అనుకుంటుంటే నువ్వేంటి వెళ్లి బెలూన్లు కడుతున్నావని దివ్యాంక అంటుంది.అయినా బావ ఈబర్త్‌డేకి రావాలి కదా అని అంటాడు. కౌషికిఅన్ని మాటలు అన్న తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ రాడని నిషిక అంటుంది. నేను పంపించిన వీడియో చూసిన తర్వాత ఇప్పుడే కాదు ఈ జన్మలోనూ సురేష్, కౌషికి కలవరని దివ్యాంక అంటుంది.కానీ వారి అంచనాలు తలకిందులవ్వడానికి ఎంతో సమయం పట్టదు. కీర్తి బర్త్‌డే పార్టీకి సురేష్ రావడం చూసి వారు షాక్ తింటాడు. సురేష్‌కు ఎదురెళ్లి కేదార్ సాదరంగా ఆహ్వానిస్తాడు. ధాత్రి కీర్తి, కౌషికిని పిలుస్తుంది.కీర్తి పరుగెత్తుకుంటూ వచ్చి వాళ్ల నాన్నను కౌగిలించుకుని ఒళ్లో కూర్చుంటుంది. సురేష్ పార్టీకి రావడంతో అందరూ కలిసి కేక్ కట్‌చేసి సెలబ్రేషన్ చేసుకుంటారు. ఒకరితర్వాత ఒకరు కీర్తికి కేక్ తినిపించి విషెష్ చెబుతారు. ఇంతలో దివ్యాంక సురేష్ దగ్గరకు వచ్చి కీర్తి మొదట కేక్ కౌషికికి తినిపించి ఆ తర్వాతే నీకు తినిపించిందని చెబుతుంది. ఇలాగే వదిలేస్తే...ఆ పిల్లను కూడా నీకు దూరం చేస్తారని చెబుతుంది. కేక్ కట్ చేసి బర్త్‌డే సెలబ్రేషన్లు అయిపోగానే...భోజనం చేయడానికి వెళ్తుండగా సురేష్ అందరినీ ఆపుతాడు. నేను ఇక్కడికి రావడానికి ఇంకో కారణం కూడా ఉందని చెబుతాడు. తాను కీర్తిని ఇంటికి తీసుకెళ్లిపోదామని అనుకుంటున్నానని చెబుతాడు. దీనికి కౌషికి ససేమీరా అంటుంది. ఆరేళ్లపాటు బిడ్డను వదిలేసి వెళ్లిపోయినవాడికి ఇప్పుడు కన్నబిడ్డ గుర్తుకు వచ్చిందా అని నిలదీస్తుంది. ఆరేళ్లు నువ్వు ఎక్కడ బాధపడతావోనని నీకు బిడ్డను వదిలేసి ఒంటరిగా బతికానని ఇప్పుడు నా బిడ్డను నేను వదులుకోలేనని చెబుతాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వనని కౌషికి అంటుంది.ఇద్దరూ చెరోవైపు లాక్కుంటుంటే జగధాత్రి వచ్చిఇద్దరినీ విడదీస్తుంది. మీ పంతాల కోసం పసిబిడ్డ మనసుతో ఆడుకుంటారా అని తిడుతుంది. ఇదంతా చూస్త్తున్న నిషిక, వైజయంతి మాత్రం ఆనందపడుతుంటారు. సుధాకర్ కలుగజేసుకుని కీర్తి ఎవరితో ఉంటానంటే వాళ్ల వద్దకే తీసుకెళ్లండని చెబుతాడు.దీంతో కీర్తి ఇద్దరూ కావాలని చెప్పడంతో....తాను మళ్లీ వస్తానని కీర్తిని కౌషికి వద్దే వదిలేసి సురేష్ వెళ్లిపోతాడు. డ్రాగన్‌తో ఎలాగైనా నిజం చెప్పించాలని మీనన్ ఎత్తులు వేస్తుంటాడు.తనతో శోభనానికి బెడ్‌రూం సిద్ధం చేయిస్తాడు.దీంతో భయపడిపోయిన డ్రాగన్ జేడీకి ఫోన్ చేస్తుంది. మేం వస్తున్నామని భయపడొద్దని జేడీ చెబుతుంది. మనమే ఈపనిచేయిస్తున్నామని మీనన్‌కు తెలిసిపోయింది కాబట్టి డబ్బులు పోయినప్పటికీ తనతంట తాను భయటపడడని కాబట్టి డ్రాగన్‌తో టార్చర్ పెట్టించాలని ఫ్లాన్ వేస్తారు. మీనన్ ఇంటికి వెళ్లి డ్రాగన్‌ను రెచ్చగొడతారు.
