Jagadhatri Today Episode: మరొక ఛానల్ ఎండి భవానీకి ఫోన్ చేసి మీకు అకాడమీకి ఇస్తాను అన్న ల్యాండ్ వేరే వాళ్ళకి కౌశికి అమ్మేస్తోంది అని కన్ఫర్మ్ అయిందంటూ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. 


అఖిలాండేశ్వరి, భవాని కౌశికి ఇంటికి వస్తారు. ల్యాండ్ అమ్మేస్తున్నారు అని తెలుసుకున్న వాళ్ళిద్దరూ కౌశికి చాలా గట్టిగా అడుగుతారు. ల్యాండ్ అమ్మేసిన కారణంగా ఇక పెళ్లి జరగదని,  ఆపేస్తామని భవాని అంటుంది. అఖిలాండేశ్వరి మాత్రం కౌశికి ఏం చేసినా  డబ్బులు  కోసం కాదు, కుటుంబ విలువలు కోసమే చేస్తుంది అని నమ్మి, ఏం జరిగింది అని తెలుసుకోవడానికి వచ్చాను అని చెబుతుంది. రేపు జరగబోయే మాధురి ఎంగేజ్మెంట్ కల్లా ల్యాండ్ పేపర్లు ఇస్తానని కౌశికి మాట ఇస్తుంది.  మాధురి ఎంగేజ్మెంట్ గురించి భయపడుతున్న కౌశిక్ అని ధాత్రి మనం ఎలాగైనా ముందు ఆ హార్డ్ డిస్క్ గురించి చూద్దాం అని బయలుదేరుతుంది. ధాత్రి, కేదార్ విజయ్ అపార్ట్మెంట్ దగ్గరికి హార్డ్ డిస్క్ కోసం వెళతారు. 


ధాత్రి: హార్డ్ డిస్క్ విజయ దగ్గరే ఉంటే ఈ రోజు మనం హార్డ్ డిస్క్ తోనే వెనక్కి వెళ్తున్నాం.


అదే సమయానికి విజయ్ తన భార్యకి కొత్తకారు, బంగారు హారం తో  సర్ప్రైజ్ఇస్తాడు. 
 


కేదార్: మన చానల్లో వర్క్ చేస్తూ నెలకి 50 వేలు తీసుకునే ఎంప్లాయ్ ఉన్నట్టుండి 15 లక్షల రూపాయలు పెట్టి కారు ఎలా కొనగలడు. 


ధాత్రి: చానల్లోనే కాదు కేదార్, ఛానల్ తో పాటు, ఛానల్లో విషయాలు బయట వాళ్లకి మోస్తూ.. పార్ట్ టైం కూడా చేస్తున్నాడు. ఇలాంటివి ఒకటి ఏంటి రెండు మూడు కూడా ఒకేసారి కొనేయగలడు..


ధాత్రి: ఇప్పటిదాకా జస్ట్ డౌట్ మాత్రమే ఉండేది కేదార్. ఇదంతా చూస్తుంటే కన్ఫామ్ అయిపోయింది. మనకి కావలసిన హార్డ్ డిస్క్ విజయ్ దగ్గరే ఉంది. 


ఇంతలో విజయ్ కి పిళ్లై ఫోన్ చేస్తాడు. పక్కకి వచ్చి మాట్లాడతాడు 


పిళ్లై: డబ్బు, కారు అందాయా...?


విజయ్: అందాయి బాయ్.. థాంక్యూ బాయ్...


పిళ్లై: మన డీల్ ప్రకారం నువ్వు అడిగినవన్నీ ఇచ్చేశాను. ఇప్పుడు నువ్వు హార్ట్ డిస్క్ తీసుకొని నేను చెప్పిన దాబా దగ్గరికి రా. 


విజయ్: ఇప్పుడే వస్తున్నాను భాయ్ 


పిళ్లై: విజయ్ జాగ్రత్త... అందులో ఏముందో అది నాకు ఎంత ఇంపార్టెంటో తెలుసుగా.. 


విజయ్: నా ప్రాణం అడ్డేసైనా హార్డ్ డిస్క్ ని తీసుకువచ్చి మీ చేతుల్లో పెడతాను భాయ్ 


విజయ్ కారులో  బయలుదేరుతున్నప్పుడు ఎదురుగుండా ధాత్రి కేదార్లు మాస్కులు పెట్టుకొని వచ్చి కారుని ఆపుతారు. విజయ్ ని, ధాత్రి ఒక 10 నిమిషాలు మాట్లాడాలని బయటకు పట్టుకొస్తుంది. హార్డ్ డిస్క్ గురించి  కాస్త స్టైల్ మార్చి విజయ్ ని అడుగుతాడు కేదార్. ఇప్పుడే  పట్టుకుని వస్తానని చెప్పి విజయ్ పరిగెత్తుకుంటూ వెళ్లిపోతాడు. ధాత్రి , కేదార్ విజయ్ వెనుక పరిగెడతారు . పరిగెడుతూ వెళ్తున్న కేదార్ , ధాత్రిలకి  మీనన్  కొత్త గెటప్ లో  కనిపిస్తాడు. వెనకాతల ఉన్న నలుగురు మనుషులని  జేడీ రూపంలో ఉన్న ధాత్రి  మీదకి పంపిస్తాడు. ధాత్రి, కేదార్ లు సూపర్  ఫైట్ చేయడంతో  మీనన్ వాళ్ళ మనుషులు అక్కడ నుండి పారిపోతారు. అలా హార్డ్ డిస్క్ దొరకకుండా మిస్సయిపోతుంది. విజయ్ వాళ్లని వాళ్ళ ఇంటిదగ్గర నిఘా పెట్టి ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటారు.


కౌశికి : విజయ్ ఇంత  పని చేస్తాడు అనుకోలే దు?


ధాత్రి :  మినిస్టర్ హరినాథ్ వెనకాతల ఉండి ఇదంతా నడిపిస్తున్నది ఆ మీనన్.


కౌశికి :  మీనన్ ఎందుకు ఛానల్ ని టార్గెట్ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తోంది. 


కేదార్ : పోలీసులు మన వెనుక ఉన్నారు. నువ్వు భయపడకు అక్కా. ఒక్కసారి విజయ్ దొరికితే ఈ హార్డ్ డిస్క్ దొరుకుతుంది. ఈ సమస్య నుంచి మనం ఈజీ గా బయట పడచ్చు. 


కౌశికి : నా భయం అందుకు కాదు కేదార్. పోలీసులకు చెప్పద్దు అన్నాడు మినిస్టర్. మీరు అదే చేశారు. ఇప్పుడు  ఏం చేస్తాడో అని భయంగా ఉంది. 


ధాత్రి : మినిస్టర్ అయినా ఫామిలీని కానీ, కంపెనీని కానీ టచ్ కూడా చేయలేరు వదినా.