Punch Prasad: బుల్లితెరపై ‘జబర్దస్త్’ కామెడీ షో ఎంత పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ వేదిక నుంచి ఎంతో మంది కమెడియన్లు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ షో హిట్ అవ్వడంతో ఇతర ఛానల్ లలో కూడా ఇలాంటి ప్రోగ్రాం లను ప్రారంభించారు. అయితే ‘జబర్దస్త్’ ను మాత్రం క్రాస్ చేయలేకపోయయనే చెప్పాలి. ఎంతో మంది జబర్దస్త్ ఆర్టిస్ట్ లు తమ కామెడి టైమింగ్, పంచ్ లతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో పంచ్ ప్రసాద్ కూడా ఒకరు. ఆయన కామెడీ టైమింగ్ కు మంచి డిమాండ్ ఉంది. ఆయన వేసే పంచ్ లకు కూడా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. స్కిట్ లో ఆయన కనిపిస్తే పంచ్ డైలాగ్ వరుసగా వస్తూనే ఉంటాయి. అలా జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రసాద్. అయితే ఆయన ఇటీవల కిడ్నీలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో సమస్య ఒకటి రావడంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని తెలుస్తోంది. 


‘జబర్దస్త్’లో చేస్తుండగానే పంచ్ ప్రసాద్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. తర్వాత అది కిడ్నీ సమస్య అని తెలియడంతో గత కొంత కాలం నుంచి వైద్యం చేయించుకుంటున్నారు. ఆ మధ్యలో కిడ్నీల పనితీరు పూర్తిగా తగ్గిపోవడంలో డైయాలసిస్ చేయించుకోవడం ప్రారంభించారు. తర్వాత కాస్త కోలుకోవడంతో మళ్లీ టీవీ కామెడీ ప్రోగ్రాంలలో కనిపించారు ప్రసాద్. దీంతో ఆయనకు తగ్గిపోయింది అనుకున్నారు అంతా. మళ్లీ సాధారణ జీవితం గడుపుతారు అనుకున్నారు. కానీ ఇటీవల మళ్లీ ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రసాద్ కు థైరాయిడ్ సమస్య ఉండటంతో అది ఇప్పుడు మరింత ఎక్కువైనట్టు ఆయన భార్య తెలిపింది. పంచ్ ప్రసాద్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని ఆమె ఓ వీడియో బ్లాగ్ ద్వారా వివరించింది. 


ఇటీవల పంచ్ ప్రసాద్ జ్వరంతో బాధపడ్డారని, ఆసుపత్రికి తీసుకెళ్తే థైరాయిడ్ సమస్య బాగా ఎక్కువైందని డాక్టర్లు తెలిపారని చెప్పింది. దానికి సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించినట్లు చెప్పింది. అయితే తన కాలికి ఇన్ఫెక్షన్ అయిందని, అది పూర్తిగా తగ్గిన తర్వాతే ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు చెప్పారని తెలిపింది. అందుకోసం మళ్లీ ఓ కొత్త ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పింది. డాక్టర్లు అందుకు సంబంధించిన పరీక్షలు అన్నీ చేస్తున్నారని తెలిపింది. అయితే ప్రసాద్ ఇప్పుడిప్పుడే నడవడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. ఆయకు తప్పనిసరిగా డయాలసిస్ చేయించాలని డాక్టర్స్ సూచించారని, లేదంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని చెప్పారట డాక్టర్స్. అందుకే ఆయనకు క్రమం తప్పకుండా డాయాలసిస్ చేయిస్తున్నామని తెలిపింది. ఇక పంచ్ ప్రసాద్ కు ఆయన భార్య ముందు నుంచీ అండగా ఉంటూ వస్తున్నారు. ప్రసాద్ ను ఆమె దగ్గరుండి ఆసుసత్రికి తీసుకెళ్తోంది. ప్రసాద్ కు సేవలు చేయడంలో ఆమె ప్రేమ, సహనం పట్ల నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దీంతో ఈ వీడియో చూసిన వారంతా ప్రసాద్ త్వరగా పూర్తిగా కోలుకొని మళ్లీ సాధారణ జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. 


Also Read 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?