Jabardasth Telecast Time And Day From July 26th 2026: తెలుగు బుల్లితెరపై ఓ ట్రెండ్ సెట్ చేసిన కామెడీ షో అంటే 'జబర్దస్త్' అని చెప్పాలి. ఈటీవీలో 'జబర్దస్త్' వచ్చే సమయానికి టీవీలకు అతుక్కుని కూర్చునే జనాలు ఎంతో మంది ఉన్నారు. మధ్యలో వ్యూయర్‌షిప్ కొంత తగ్గినా... ఇప్పటికీ హిట్ టీవీ షోలలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఇప్పుడీ షో టైమింగ్ మారింది. ప్రసారం అయ్యే రోజు కూడా! ఆ డీటెయిల్స్ తెలుసుకోండి.
ఆదివారానికి వచ్చిన 'జబర్దస్త్'...రాత్రి తొమ్మిదిన్నరకు కాదు - మరి ఎప్పుడు?Jabardasth Telecast Time From July 26th 2026: 'జబర్దస్త్' ప్రారంభమైన కొత్తల్లో గురువారం ప్రసారం అయ్యేది. షో సక్సెస్ కావడంతో కొన్ని రోజులకు శుక్రవారం కూడా ప్రసారం చేయడం స్టార్ట్ చేశారు. గురువారం 'జబర్దస్త్', శుక్రవారం 'ఎక్స్ట్రా జబర్దస్త్' పేర్లతో ప్రసారం అయ్యేది. రెండేళ్ళ క్రితం... మే 30, 2024 తర్వాత నుంచి గురు, శుక్ర కాకుండా శుక్ర, శని వారాల్లో ఎక్స్ట్రా తీసేసి 'జబర్దస్త్'గా ప్రసారం చేశారు. ఇప్పుడు శనివారం నుంచి ఆదివారానికి వచ్చింది.
జూలై 26, 2026 నుంచి ప్రతి ఆదివారం ఈటీవీలో 'జబర్దస్త్' ప్రసారం కానుంది. రాత్రి తొమ్మిదిన్నరకు కాకుండా సాయంత్రం ఆరు గంటలకు కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది. అదీ సంగతి.
కొత్తగా వచ్చిన పాత టీమ్ లీడర్లు...మళ్ళీ సందడి సందడిగా ధనరాజ్, అభి!సుడిగాలి సుధీర్, ఆది టీమ్ లీడర్లు కావడానికి ముందు 'జబర్దస్త్'లో హంగామా చేసినది, షోలో మెయిన్ ఎట్రాక్షన్‌గా నిలిచినదీ ధనరాజ్, 'అదిరే' అభి. వాళ్ళిద్దరూ మళ్ళీ 'జబర్దస్త్'కు వచ్చారు.
ఇప్పుడు 'జబర్దస్త్'లో 'హైపర్' ఆది ఉన్నాడు. అతనితో పాటు ధనరాజ్, అభి, బుల్లెట్ భాస్కర్, తాగుబోతు రమేష్, నాటీ నరేష్, ఆటో రామ్ ప్రసాద్ టీమ్స్ కామెడీ చేయనున్నాయి. కొన్ని రోజుల క్రితం 'జబర్దస్త్'కు మళ్ళీ జడ్జిగా మెగా బ్రదర్ నాగబాబు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఇంద్రజ మరొక జడ్జిగా వ్యవహరించనున్నారు. రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేయనున్నారు. ఈ షో ఫార్మాట్ ఫాలో అవుతూ ఇతర టీవీ ఛానళ్లలో కొన్ని షోస్ వచ్చాయి. కానీ సక్సెస్ కాలేదు. అయితే వ్యూయర్‌షిప్ తగ్గిన నేపథ్యంలో షో టెలికాస్ట్ టైమింగ్, ప్రసారమయ్యే తేదీని ఈటీవీ మార్చినట్టు గుసగుస.
