Illu Illalu Pillalu Serial Today Episode వల్లి తండ్రి ఇంటికి రావడంతో టెన్షన్ పడి తండ్రిని గదికి తీసుకెళ్లి ఇంటికెళ్లిపోమని చెప్తుంది. ఈ రోజు ఎలా అయినా చెంబు సంగతి చూస్తానని వెళ్లిపోవడానికి రాలేదు ఉండిపోవడానికి వచ్చానని ఇడ్లీ బాబాయ్ ఆనంద్‌రావు చెప్తాడు. వల్లీ షాక్ అవుతుంది. ఇంటికి వెళ్లిపోమని తండ్రిని బతిమాలుతుంది. అయితే ఇడ్లీ బాబాయ్ మాత్రం ఈ రాత్రికి ఇక్కడే ఉండేలా చేయమని చెప్పి వల్లీని తీసుకొని రామరాజు వాళ్ల దగ్గరకు వెళ్తాడు.
నాన్న దగ్గర నేను కాపాడుకున్న పరువు మర్యాద అన్నీ పోతాయిరా.. అదే జరిగితే నేను బతికి ఉండటం వేస్ట్‌రా అని అంటాడు. సాగర్, ధీరజ్ చాలా బాధ పడతారు. ధీరజ్ మనసులో రేపు లక్ష ఇవ్వకపోతే పెద్దోడు ఏదో ఒకటి చేసుకునేలా ఉన్నాను ఏదో ఒకటి చేసి వాడికి డబ్బు ఇవ్వాలి కానీ ఇప్పటికి ఇప్పుడు లక్ష అంటే ఎలా అని ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ప్రేమ పడుకోవడానికి రెడీ అవుతుంది. ఆ చెత్త వెధవ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తాడా.. ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే వాడిని చంపేస్తా అనుకుంటుంది. ఇంతలో కల్యాణ్ కాల్ చేస్తాడు. హాయ్ బేబీ అని ప్రేమని కల్యాణ్ అంటాడు. ప్రేమ కోపంగా ఏంట్రా బేబీ.. నాలుగు ఫొటోలు పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తే భయపడతా అనుకున్నావా చంపేస్తా అని అంటుంది. హో అయితే భయపడవా అని అంటాడు. నేను ఏం తప్పు చేశాన్‌రా భయపడటానికి నువ్వు భయపడుతున్నావ్.. రారా.. వచ్చి చెప్పరా.. ఎవరికీ ఏం చెప్తావ్ చెప్పరా.. వచ్చి చెప్పి నా ఇంటి గుమ్మం దాటరా అని అంటుంది. దాంతో కల్యాణ్ సరే అని చెప్పి ఇంటి బయట ఉన్నట్లు సెల్ఫీ తీసుకొని పంపిస్తాడు. ప్రేమ ఆ ఫొటో చూసి చాలా భయపడుతుంది. ఏం చేసుకుంటావో చేసుకో వచ్చి చెప్పుకో అన్నావ్ కదా నీ సరదా నేను ఎందుకు కాదు అంటా వస్తా అగు అని అంటాడు.
ప్రేమ కంగారుగా పరుగులు తీస్తుంది. హాల్‌లో రామరాజు, తిరుపతి, వేదవతి, వల్లి ఉంటారు. వేదవతి ప్రేమని ఎక్కడికి అని అడుగుతుంది. ఇక వల్లీ అయితే ఏంటి ఇంత టెన్షన్ పడుతుంది అని అనుకుంటుంది. ప్రేమ కంగారుగా పరుగులు పెడుతుంది. ఇక రామరాజు అమృతకి లెక్కలు చూడమని ఇస్తాడు. వేదవతి భర్తతో దానివన్నీ పానీ పూరీ, కట్లెట్ లెక్కలే అని అంటుంది. ఇంతలో ధీరజ్ వచ్చి తండ్రి వాళ్లకి తెలియకుండా అక్కడక్కడే చక్కర్లు కొడతాడు. తిరుపతి చూసి ఏంటి అల్లుడు డబ్బులు కావాలా ఐదు పది అయితే నన్ను అడుగు లక్షలు అయితే మీ నాన్నని అడుగుతాడు. వేదవతి తమ్ముడికి ఒక్కటిచ్చి వాడికి డబ్బుతో పనేముంటుందిరా అని అంటుంది.
ధీరజ్ తండ్రి పక్కనే కూర్చొని తండ్రి ఫోన్ కొట్టేసి రామరాజు ఫోన్ నుంచి లక్ష పంపుకోవడానికి ప్రయత్నిస్తాడు. రాంగ్ పిన్ అని రావడంతో ధీరజ్ చాలా కంగారు పడతాడు. ఇంతలో రామరాజు ఫోన్ గురించి వెతుకుతాడు. అందరూ కంగారుగా ఫోన్ వెతుకుతారు. ఇంతలోపు ధీరజ్ లక్ష రూపాయలు పంపించుకుంటాడు. తర్వాత వల్లి రామరాజు చిన్న ఫోన్‌తో పెద్ద ఫోన్‌కి ఫోన్ చేస్తుంది. ఇంతలో ధీరజ్ ఫోన్ దిండు కింద పెట్టేస్తాడు. తర్వాత ఫోన్ దొరుకుతుంది. ధీరజ్‌ని చూసిన రామరాజు ఫోన్ పక్కనే ఉన్నా వీడు ఎందుకు ఇవ్వలేదు.. పైగా ఎప్పుడూ నాతో ఉండడు కదా ఈ రోజు పక్కన కూర్చొన్నాడేంటి అనుకుంటాడు. ధరజ్ తండ్రికి సారీ చెప్పుకుంటాడు మనసులో.. అన్నయ్య ఏమైనా చేసుకుంటాడనే భయంతో ఇలా చేశానని అనుకుంటాడు. ప్రేమ పరుగులు పెడుతూనే ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.