Illu Illalu Pillalu Serial Today Episode వల్లీ అమూల్యతో విశ్వ మంచోడని, లవ్‌ స్టోరీలు ఉన్నాయా అని అడిగిన విషయం అమూల్య ప్రేమతో చెప్తుంది. ప్రేమకు వల్లీ అడ్డంగా బుక్ అయిపోతుంది. ప్రేమ వల్లీతో ఏం చేస్తున్నావ్.. అమూల్యతో ఎందుకు అలా మాట్లాడావ్.. లవ్ స్టోరీలు ఉన్నాయా అని ఎందుకు అడిగావ్.. మా అన్నయ్య మంచోడా అని నువ్వు ఎందుకు చెప్పావ్.. మా అన్నయ్య మంచోడా కాదా అనే విషయం నీకు ఎందుకు అని ప్రేమ అడుగుతుంది.

Continues below advertisement

వల్లీ కవర్ చేస్తూ కాలేజ్‌కి వెళ్లే పిల్ల ప్రేమ దోమ అంటూ ఏమైనా ఉన్నాయా అని అడిగాను.. ఇక నువ్వు ఎలా మంచి దానివో మీ అన్నయ్య కూడా అలా మంచోడు అనిపించి చెప్పాను అని అంటుంది. నువ్వు మసి పూసి మారేడు కాయ చేస్తే అర్థం చేసుకోలేను అనుకున్నావా.. ఎప్పుడూ లేనిది నువ్వు అమూల్యకి లవ్‌ స్టోరీలు ఉన్నాయా అని అడగటం.. మా అన్నయ్య మంచోడని చెప్పడంతో వెనకాలే ఏదో చేస్తున్నావ్ అని నాకు అనుమానంగా ఉంది అని ప్రేమ అంటుంది. అచ్చబాబోయ్ ఇంత మంచిదాన్ని నాలాంటి అమాయకురాలికి అలా అన్నావ్ అంటే నీ కళ్లు పోతాయ్ అని వల్లీ అంటుంది. నువ్వు ఎంత మంచిదానివో ఎంత అమాయకురాలివో నాకు తెలుసు గానీ ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండు.. నువ్వు ఏమైనా పిచ్చి పిచ్చి పనులు చేశావని తెలిసిందో అనుకో నేను నర్మద అక్క అంత మంచిదాన్ని కాదు.. నిన్ను నీ ఇంటి వరకు పరుగెత్తిస్తా అని ప్రేమ వల్లీకి వార్నింగ్ ఇస్తుంది. 

వేదవతి రామరాజు కుర్చీలో కూర్చొని ఉంటుంది. నర్మద ఆఫీస్‌కి వెళ్తూ అత్తయ్య  కాళ్లకి మొక్కి ప్రమోషన్ మీద ప్రమోషన్ వచ్చేలా దీవించండి అని అంటుంది. వేదవతి బిందాస్‌గా కూర్చొని  నీరు తీసుకురా టీ తీసుకురా అని టైం అయిపోతుంది అని నర్మద అంటే చెప్పింది చేయ్ అని పంపిస్తుంది. నర్మద నీరు ఇస్తుంది. తర్వాత టీ కూడా ఇస్తుంది. తర్వాత వేదవతి లేచి నర్మదని పై నుంచి కింద వరకు చూసి నేను అనుకున్నట్లు ఏం జరగలేదులే.. ఉద్యోగం చేస్తున్న కోడలు అత్తని పట్టించుకోదు కదా నువ్వు అలా పొగరుగా  అయిపోయావ్ ఏంటో అని టెస్ట్ చేశా.. పర్లేదు నువ్వు పాత నర్మదలానే ఉన్నావ్ అని అంటుంది. మీకు మీ గడుసు తనానికి ఓ దండం అని చెప్పి వెళ్తుంది. 

Continues below advertisement

రామరాజు మిల్లుకి బయల్దేరుతుంటే నర్మద వెళ్లి కొత్త పోస్ట్‌లో చేరుతున్నా ఆశీర్వదించమని అంటుంది. రామరాజు ఆశీర్వదించి నువ్వు అసలే రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నావ్.. కుట్రలు పెరుగుతాయి.. లంచాలు ఇవ్వాలని చూస్తారు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్తారు. ఇక  సాగర్ తండ్రి పర్మిషన్ అడిగి నర్మదని డ్రాప్ చేస్తా అని అంటాడు. నర్మద, తిరుపతి షాక్ అయిపోతారు. తిరుపతి మనసులో వీడికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది వాళ్ల నాన్న ముందే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాడు అంటే తోపే అని అనుకుంటాడు. సాగర్ నర్మదని తీసుకొని వెళ్తాడు.

 చందు ధీరజ్‌ని ఓ చోటుకి పిలిచి లక్ష ఇస్తాడు. ధీరజ్ వద్దని నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే చాలు అంటాడు. ధీరజ్ మాటలకు చందు ఎమోషనల్ అయి హగ్ చేసుకుంటాడు. చందు డబ్బు కోసం ఏం ఇబ్బంది పడలేదు అని ధీరజ్‌ చేతిలో డబ్బు పెడతాడు. ధీరజ్ ఆ డబ్బు బ్యాంక్‌లో వేసి నాన్న అకౌంట్‌కి పంపాలని అనుకుంటాడు. అంత వరకు ఏం ప్రాబ్లమ్ రాకపోతే చాలు అని అనుకుంటాడు. మరోవైపు ఇంటికి కామాక్షి వచ్చి నట్టింట్లో కూర్చొని ఏడుస్తుంది. ఏమైందని వల్లీ, తిరుపతి, వేదవతి, రామరాజు అడుగుతారు. విషం ఇచ్చేయండి నేను చస్తాను అని కామాక్షి ఓవర్ చేస్తుంది. ఏమైంది అని రామరాజు మళ్లీ అడగటంతో మీ అల్లుడికి బిజినెస్‌లో లక్ష రూపాయలు తగ్గాయి అంట నా మీద అరుస్తున్నాడు.. అని కూని ఏడుపులు ఏడుస్తుంది. 

తిరుపతి కామాక్షి ఆపి నువ్వు చితక్కొడితే పడే వాడు నీ మీద అరుస్తున్నాడా అని అంటుంది. వేదవతి కూతుర్ని వెళ్లవే నీ అత్తారింటికి పోవే ఇది అల్లుడిని అడ్డు పెట్టుకొని లక్ష టెండర్ పెట్టడానికి వచ్చిందని అంటుంది. లక్ష నేను ఇస్తానులే అని రామరాజు అంటాడు. వెంటనే అల్లుడికి కాల్ చేసి లక్ష కోసం నా కూతుర్ని ఏడిపిస్తావా అని కోప్పడతాడు. కామాక్షి భర్త ఫ్లాష్ బాక్‌లోకి వెళ్లి నగలకోసం కామాక్షి డబ్బు అడగటం అతను ఇవ్వను అని చెప్పడం.. సాయంత్రానికి ఆ నగ కొంటాను అని అనడం గుర్తు చేసుకొని ఇది మళ్లీ మామయ్య గారికి టెండర్ వేసిందని అనుకుంటాడు. రామరాజు బ్యాంక్ మేనేజర్‌కి కాల్ చేసి అల్లుడి అకౌంట్‌కి లక్ష వేయమని చెప్తాడు. ధీరజ్ డబ్బు కట్టడానికి వెళ్తే బ్యాంక్ క్లోజ్ అని చెప్పేస్తారు. మరోవైపు రామరాజు తన అకౌంట్‌లో ఇంకెంత ఉందని అడగటంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.