గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 27 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu September 27 Episode)

Continues below advertisement

మీనా చింటూని ప్రేమగా చూసుకోవడం చూసి కుళ్లుకుంటుంది రోహిణి. వాడికి నేను చేయాల్సినవి అన్నీ తను చేస్తోంది ఎందుకు అని తల్లితో అంటుంది. తనకి చింటూ అంటే ప్రేమ ఉంది అంటుంది. అంటే నాకు ప్రేమ లేదనా అని రోహిణి రివర్సవుతుంది... మీనా ప్రేమ చూపిస్తున్నందుకు సంతోషించు అంటుంది. ఈ ఇంట్లో వీళ్లు ఉన్నంతసేపూ తనకు టెన్షన్ తప్పదు అనుకుంటుంది రోహిణి.  మీనాను బయటకు పంపించేసి ఎలాగైనా తల్లిని, చింటూని ఇంట్లోంచి పంపించాలని ప్లాన్ చేస్తుంది రోహిణి. ఫ్రెండ్ విద్యతో కాల్ చేయించి ప్లాన్ అమలు చేస్తుంది రోహిణి. మీనాకు విద్య కాల్ చేస్తుంది. తర్వాత బాలు దగ్గరకు వచ్చి.. విద్య కాల్ చేసింది వెళతాను అంటుంది మీనా. పార్లలమ్మకి సంబంధించిన ఎవర్నీ నమ్మకూడదు..నాకు డౌట్ వచ్చి ఎప్పుడు కాల్ చేసినా వచ్చేయాలి అని బాలు చెబుతాడు. శ్రుతి, రవి ఇద్దరూ హాల్లోనే కూర్చుని ఉండడంతో ఇంకా వీళ్లు వెళ్లలేదు అనుకుంటుంది. ఇంకా వెళ్లలేదేంటి అంటుంది. నీకేంటి అంటుంది శ్రుతి. ఏం లేదు ట్రాఫిక్ పెరుగుతుందని అడుగుతున్నా అంటుంది. తర్వాత రవి, శ్రుతి వెళ్లిపోతారు.

Continues below advertisement

ఇంతలో ప్రభావతి వచ్చి మీనా ఏది అంటుంది. పూలమ్ముకునేందుకు వెళ్లింది అంటుంది రోహిణి. కాఫీ కూడా ఇవ్వలేదంటూ ఫైర్ అవుతుంది. మరో కోడలు ఎదురుగా ఉందికదా అంటాడు సత్యం. అత్తయ్యకు మీనా పెట్టిన కాఫీనే ఇష్టం అంటుంది రోహిణి. ఆమాట ఒప్పుకోదుకదా అంటాడు సత్యం. ఎలాగైనా అత్తయ్య, మావయ్యని కూడా ఇంట్లోంచి పంపించాలి అనుకుంటుంది. వట్టింట్లో ఉన్న ప్రభావతి దగ్గరకు వెళ్లి వాళ్లు ఇంకా వారం రోజులు ఇంట్లోనే ఉండేలా ఉన్నారు అంటుంది. దిక్కుమొక్కులేని దరిద్రులంతా నా ఇంటిపై పడితినడానికి ఇదేమైనా ధర్మసత్రవా అంటుంది ప్రభావతి. నేను వెళ్లి అడిగేస్తా అని ప్రభావతి అంటే.. నా దగ్గరో ప్లాన్ ఉంది అంటుంది రోహిణి. వాళ్లను ఇంట్లో ఉంచేసి ఎవ్వరం లేకుండా వెళ్లిపోతే వాళ్లే బయటకు వెళ్లిపోతారు అంటుంది రోహిణి. ఎవరూ లేకపోతే ఇల్లు ఊడ్చుకుపోరా అని ప్రభావతి అనగానే..మీరంతా వెళ్లాక నేను ఉండి వాళ్లను పంపించేస్తాను అంటుంది. రోహిణి మాటలు నమ్మేసి భర్తను తీసుకుని బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. మనోజ్ షాప్ పెట్టిన సందర్భంగా గుడికి వెళ్లాలని సత్యంతో చెబుతుంది. ఇంతలో బాలు రావడంతో ట్రిప్ ఏమైనా ఉందా అని అడుగుతాడు. ట్రిప్ అయ్యాక వచ్చి తీసుకెళ్తా అంటాడు బాలు. లేదు వెళదాం అంటుంది ప్రభానతి.

ఉన్నట్టుండి ఇదంతా చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది అనుకుంటాడు బాలు. మీనాను తన ఫ్రెండ్ ఇంటికి పంపించేసింది, బాలు ట్రిప్ కి వెళుతున్నాడు, ప్రభావతి సత్యం ఇద్దరూ గుడికి వెళుతున్నారు, మనోజ్ ఫర్నిచర్ షోరూమ్ కి వెళ్లాడు..శ్రుతి రవి వాళ్లపనులపై వాళ్లు వెళ్లిపోయారు. ఇప్పుడు తల్లిగా చింటూని దగ్గరకు తీసుకుని.. తర్వతా తన తల్లికి నాలుగు మాటలు చెప్పి ఇంట్లోంచి పంపించేసేందుకు ప్లాన్ చేసింది రోహిణి. ఇప్పటికే రోహిణిపై బాలుకి అనుమానం మొదలైంది. హాస్పిటల్ లో చింటూ గురించి చెప్పగానే ఎమోషనల్ అయింది. ఇంటికి రాగానే రూమ్ ఇస్తానంటూ షాకిచ్చింది. ఎప్పుడూ కాల్ చేయని విద్యతో మీనాకు ఫోన్ చేయించి హెల్ప్ అడిగింది. ఇంట్లో అందర్నీ ఒక్కొక్కరిగా బయటకు పంపించేస్తోంది. బాలుకి డౌట్ వచ్చింది కాబట్టి.. ట్రిప్ కి వెళ్లిన వెంటనే వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఎలా కవర్ చేస్తుందో చూడాలి.