Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ, కల్యాణ్‌ల విషయం రామరాజుకి చెప్పేయాలని వల్లి తెగ ప్రయత్నిస్తుంది. ఈ విషయం రామరాజుకి ఎక్కడ తెలిసిపోతుందో అని వేదవతి, నర్మద కంగారుగా వేదవతి అయితే భర్తని కనిపెడుతూ ఉంటుంది. వల్లి విషయం చెప్పడానికి మామయ్య గారండీ అని ధీర్ఘాలు తీస్తుంటే వేదవతి వల్లిని లోపలికి తీసుకెళ్తుంది.
మీ మామయ్య గారితో ఏం చెప్పాలనుకున్నావే.. ప్రేమ ఫొటోలో ఉన్నది తన ఫ్రెండ్‌నే నువ్వు ఎక్కువగా ఊహించుకొని మీ మామయ్యకి చెప్తే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది. నర్మద కూడా నీ కడుపుబ్బరం తగ్గించుకో అని అంటుంది. రామరాజుకి అనుమానం వస్తుంది. వేదవతిని పిలిచి నువ్వు నర్మద కంగారు పడుతున్నారు.. ధీరజ్ ప్రేమ రోడ్ల మీద పరుగులు పెడుతున్నారు.. వల్లి ఏదో చెప్పాలి అని చెప్పడం లేదు మీ అందర్ని చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది.. నాకు తెలీకుండా ఇంట్లో ఏమైనా జరుగుతుందా అని అందర్ని అడుగుతాడు. ఏం లేదని అందరూ చెప్తారు. ధీరజ్, ప్రేమల్ని అర్జెంట్‌గా ఇంటికి రమ్మని చెప్పు ఫోన్ చేయ్ అని వేదవతితో రామరాజు చెప్తాడు.
వల్లి ఎలా అయినా మామకు విషయం చెప్పాలని తెగ ఆలోచించేస్తుంది. ఫొటోలను కొరియర్ వచ్చినట్లు మామయ్యకి చూపించి కడుపు మంట తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తుంది. ప్రేమ, కల్యాణ్‌ల ఫొటోలను కవర్‌లో పెట్టి కొరియర్ వచ్చినట్లు తీసుకొచ్చి మామయ్యకి వస్తుంది. నర్మద చూసి అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది. ఎవరి పేరు మీద వచ్చిందో నేను చూస్తాను ఇవ్వు అని లాక్కోవాలని ప్రయత్నిస్తే వల్లి ఇవ్వదు. వేదవతి వచ్చి కూడా వల్లిని అడుగుతుంది. అయినా ఇవ్వదు.. ఇంతలో అందరూ హాల్‌లోకి వచ్చి ఏంటి మీ గొడవ అని అంటారు. ముగ్గురు లాక్కుంటూ ఉండగా వల్లి ఫొటోలను విసిరేస్తుంది. అందరూ ప్రేమ, కల్యాణ్‌లను చూసి షాక్ అయిపోతారు. రామరాజు అయితే ఒక ఫొటో తీసి చూస్తుంటే వల్లీ అన్ని తీసి మామకి అందిస్తుంది.
కల్యాణ్‌తో ప్రేమ చనువుగా ఉండటం చూసి రామరాజు షాక్ అయిపోతాడు. వల్లి ఏదో సాధించేసినట్లు సంతోషంగా గదిలోకి పరుగులు తీసి వెంటనే తల్లికి ఫోన్ చేసి విషయం చెప్తుంది. ప్రేమ ఇంటికి వస్తే దాన్ని వాళ్ల పుట్టింటికి తరిమేయడం ఖాయం అని చెప్తుంది. అబ్బా ఆ మాట ఎంత బాగుందో అలాగే జరగాలి అని అంటుంది భాగ్యం. అక్కడే జరిగే విషయాలు అన్నీ ఎప్పటికప్పుడు చెప్పు అని భాగ్యం అంటుంది. వల్లి మామ దగ్గరకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తూ ఏంటి మామయ్య గారండీ ఈ ఘోరం ఈ ఫొటోల్లో ప్రేమ పక్కన అబ్బాయి ఉండటం ఏంటండీ.. అందులోనూ బాగా చనువుగా ఉండటం ఫొటో దిగటం ఏంటో మామయ్య గారు..ఇద్దరూ అంత క్లోజ్‌గా ఉన్నారు అంటే ఆ అబ్బాయి ప్రేమకి ఏమవుతాడో అని అంటుంది. ఫొటోలు చూపించి ఆ రోజు పేపర్‌లో వీళ్లిద్దరి ఫొటోలు వచ్చాయి కదండీ.. ప్రేమ ఆ రోజు తరిమింది ఈ అబ్బాయినే అని తగిలిస్తుంది. ఫొటోలో ఇంత క్లోజ్‌గా ఉన్నారు.. రోడ్డు మీద మాత్రం ప్రేమ ఇతన్ని కొట్టడానికి కర్ర పట్టుకొని వెళ్లింది. నాకు తెలిసి ప్రేమకి పెళ్లికి ముందు ఇతనితో ప్రేమ, దోమ ఏమైనా ఉంది ఏమో అని వల్లి అంటే.. వల్లీ అని రామరాజు అరుస్తాడు. నోటికొచ్చినట్లు మాట్లాడకు అని అంటాడు.
వల్లికి ఫుల్ కోటింగ్ అయిపోతుంది. ఒక ఆడపిల్ల కోసం ఇలా మాట్లాడేటప్పుడు నిజం తెలుసుకోకుండా మాట్లాడొద్దు అని అరుస్తాడు. ఏం లేకపోతే ఎందుకు అలా ప్రేమ తరిమింది మామయ్య గారండీ అని అంటే నువ్వు మాట్లాడకు.. తను నీలా సాటి ఆడపిల్ల. నీకు చెల్లి లాంటిది.. ఏం జరిగిందో ముందు తెలుసుకోవాలి. తర్వాత మాట్లాడాలి.. అయినా ప్రేమ వస్తుంది కదా తను వచ్చే వరకు ఎవరూ ఏం మాట్లాడొద్దు నోటికి వచ్చినట్లు ఊహించుకోవద్దు అని అంటారు ఇంతలో కల్యాణ్ రామరాజుకి కాల్ చేస్తాడు. కల్యాణ్ అనగానే వేదవతి, నర్మద షాక్ అయిపోతారు. కల్యాణ్ రామరాజుతో మీ చిన్న కోడలు నేను ప్రేమించుకున్నాం సార్.. మేం ఇద్దరం లేచిపోయి అని చెప్పబోయే టైంకి ధీరజ్ కల్యాణ్ తల పగలగొడతాడు. రామరాజు తిరిగి కల్యాణ్‌కి కాల్ చేస్తే ఫోన్ కలవదు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.